హోమ్ /వార్తలు /బిజినెస్ /

Digital Rupee: డిజిటల్‌ రుపీ వాడాలంటే బ్యాంక్‌ అకౌంట్‌ తప్పనిసరా? నిపుణులు ఏమన్నారంటే

Digital Rupee: డిజిటల్‌ రుపీ వాడాలంటే బ్యాంక్‌ అకౌంట్‌ తప్పనిసరా? నిపుణులు ఏమన్నారంటే

Digital Rupee: డిజిటల్‌ రుపీ వాడాలంటే బ్యాంక్‌ అకౌంట్‌ తప్పనిసరా? నిపుణులు ఏమన్నారంటే
(ప్రతీకాత్మక చిత్రం)

Digital Rupee: డిజిటల్‌ రుపీ వాడాలంటే బ్యాంక్‌ అకౌంట్‌ తప్పనిసరా? నిపుణులు ఏమన్నారంటే (ప్రతీకాత్మక చిత్రం)

Digital Rupee | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) డిజిటల్ రుపీ లాంఛ్ చేయడంతో డిజిటల్ కరెన్సీపై (Digital Currency) అనేక సందేహాలు వస్తున్నాయి. ఈ సందేహాలకు నిపుణులు ఇస్తున్న సమాధానాలు, డిజిటల్ రుపీపై అవగాహన కల్పిస్తున్నాయి.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

ఇండియాలో సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ, లేదా డిజిటల్ రుపీ లాంచ్‌ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం డిజిటల్‌ రుపీ క్రియేషన్‌, డిస్ట్రిబ్యూషన్‌, రియల్‌ టైమ్‌లో రిటైల్‌ వినియోగం తెలుసుకోవడానికి పైలట్‌గా అమలు చేస్తున్నారు. ఇందులో దశల వారీగా పాల్గొనేందుకు ఎనిమిది బ్యాంకులను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఎంపిక చేసింది. డిజిటల్ రుపీ అనేది రిజర్వ్ బ్యాంక్ ఆప్ ఇండియా (RBI) జారీ చేసిన లీగల్ కరెన్సీ కాబట్టి.. UPI లాగా దీన్ని ఉపయోగించడానికి వినియోగదారులకు బ్యాంక్ అకౌంట్‌ అవసరమా? లేదా? అనే సందేహాలను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. దీనిపై నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

విత్‌డ్రా చేయాలంటే అవసరమే!

డిజిటల్ రుపీకి చట్టబద్ధత ఉంది కాబట్టి, వినియోగదారులు డిజిటల్ రుపీ వ్యాలెట్‌తో బ్యాంక్ అకౌంట్‌ లింక్ చేయాల్సిన అవసరం లేదని నిపుణులు తెలిపారు. అయితే వ్యాలెట్‌ నుంచి మనీ లోడ్ చేయడానికి లేదా విత్‌డ్రా చేయడానికి, వినియోగదారులు వ్యాలెట్‌కు బ్యాంక్‌ అకౌంట్ లింక్ చేయాల్సి ఉంటుందని వివరించారు.

SBI Card: ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ ఉన్నవారికి అలర్ట్... జనవరి 1 నుంచి కొత్త రూల్స్

ఫిన్‌టెక్ సర్వీస్ ప్రొవైడర్ ఇన్-సొల్యూషన్స్ గ్లోబల్ CEO (డొమెస్టిక్) అనూప్ నాయర్ మాట్లాడుతూ.. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (CBDC) అనేది డిజిటల్ రూపంలో సెంట్రల్ బ్యాంక్ జారీ చేసిన ఫంగబుల్ లీగల్ టెండర్ అన్నారు. CBDCలను కలిగి ఉన్నవారికి రిటైల్ లేదా కమర్షియల్‌ బ్యాంక్‌లో అకౌంట్‌ ఉండాల్సిన అవసరం లేదన్నారు. భాగస్వామ్య బ్యాంకులు అందించే డిజిటల్ వ్యాలెట్‌ల ద్వారా వినియోగదారులు డిజిటల్ రుపీతో ట్రాన్సాక్షన్‌లు చేయవచ్చని వివరించారు. పర్సన్‌ టూ పర్సన్‌(P2P), పర్సన్‌ టూ మర్చెంట్‌(P2M) ట్రాన్సాక్షన్‌లు కూడా సాధ్యమవుతాయని తెలిపారు. అయితే వ్యాలెట్‌లో మనీ లోడ్‌ చేయడానికి, వ్యాలెట్‌ నుంచి విత్‌డ్రా చేయడానికి బ్యాంక్‌ అకౌంట్‌ అవసరమని పేర్కొన్నారు.

డిజిటల్ రుపీ పైలట్ లాంచ్‌లో భాగమైన యెస్ బ్యాంక్ ఒక ప్రకటనలో.. CUG పైలట్‌లో భాగమైన వ్యాపారులు, వ్యక్తులకు పేమెంట్స్‌ చేయడానికి కస్టమర్లు డిజిటల్ రుపీ వ్యాలెట్‌ ఉపయోగించవచ్చని తెలిపింది. ఎంపిక చేసిన కొద్ది మంది కస్టమర్‌లు బ్యాంక్ అందించే వెబ్ లింక్‌ని ఉపయోగించి YES BANK డిజిటల్ రుపీ వ్యాలెట్‌ డౌన్‌లోడ్ చేసుకోవచ్చని వివరించింది.

Araku One Day Tour: ఒక్క రోజులో అరకు చుట్టేసి వచ్చేయండి... ప్యాకేజీ వివరాలివే

SBI ఇ-రుపీ వ్యాలెట్‌లో మనీ లోడ్ చేయడం ఎలా?

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన వెబ్‌సైట్‌లో డిజిటల్ రుపీ వినియోగదారులు eRupee వ్యాలెట్‌కు మనీ ఎలా యాడ్‌ చేయాలో వివరించింది.

ముందుగా eRupee Wallet యాప్ హోమ్‌పేజీలో ‘లోడ్’పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత లోడ్‌ చేయాల్సిన మనీ ఎంటర్‌ చేయాలి. అనంతరం ‘లోడ్ డిజిటల్ రుపీ’పై క్లిక్ చేయాలి. ట్రాన్సాక్షన్‌ పూర్తవుతుంది. లింక్‌ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్‌ లేదా వివిధ UPI యాప్‌ల ద్వారా ఫండ్స్‌ ట్రాన్స్‌ఫర్‌ చేసుకునే అవకాశం ఉంది.

First published:

Tags: Digital currency, Digital Rupee, Rbi, Reserve Bank of India

ఉత్తమ కథలు