Email: జీమెయిల్‌‌‌, ఔట్‌లుక్‌‌‌‌, యాపిల్‌‌‌ మెయిల్‌‌‌ వాడుతున్నారా.. ఈమెయిల్స్ ట్రాకింగ్‌ను ఇలా డిసేబుల్ చేసుకోండ?

ప్రతీకాత్మక చిత్రం

మెయిల్స్‌లో ఆటోమేటిక్‌‌‌ ఇమేజ్‌‌‌‌‌‌‌‌‌‌ డౌన్‌‌లోడ్‌ లేదా లోడింగ్‌ను ఆపేయడం వల్ల ట్రాకింగ్ కు గురి కాకుండా జాగ్రత్తగా ఉండవచ్చు. దీని వల్ల యూజర్ల ఆన్‌ లైన్‌ సెక్యూరిటీ పెరుగుతుంది. జీమెయిల్‌‌‌, యాపిల్‌‌‌ మెయిల్‌‌‌, ఔట్‌లుక్‌‌‌‌ లో ఎక్స్‌ట‌ర్న‌ల్ ఇమేజెస్‌‌ ఆటోమేటిక్‌‌‌ డౌన్‌లోడ్ను ఎలా ఆపాలో చూడండి.

  • Share this:
జీమెయిల్‌‌‌, ఔట్‌లుక్‌‌‌‌, యాపిల్‌‌‌ మెయిల్‌‌‌ లాంటి ఈ మెయిల్‌‌‌ సర్వీస్‌‌‌లు వాడుతున్న వారికి ప్రమోషనల్‌‌‌ మెయిల్స్ వస్తూనే ఉంటాయి. ప్రొడక్టుల గురించి ప్రచారం చేసుకోవడమే కాకుండా ఈ ప్రమోషనల్‌‌‌ మెయిల్స్ వల్ల యూజర్లకు మరికొన్ని ఇబ్బందులు ఉంటాయి. మెయిల్‌‌‌ ఓపెన్‌ చేశామా లేదా ఒకవేళ ఓపెన్‌ చేస్తే ఎంత సమయం ఆ మెయిల్‌‌‌‌లో ఉన్నాం అనే యూజర్ల వివరాలను ప్రమోషనల్‌‌‌ మెయిల్స్ ట్రాక్‌‌‌ చేస్తుంటాయి. ప్రమోషనల్‌‌‌ మెయిల్స్‌లో వచ్చే ఇమేజెస్‌‌ ద్వారా ఇది సాధ్యమవుతుంది. ప్రమోషనల్‌‌‌ మెయిల్స్‌లో సింగిల్‌‌‌ ట్రాకింగ్ పిక్సెల్ ఉంటుంది. ఈమెయిల్‌‌‌ ట్రాకింగ్ పిక్సెల్ రూపంలో ఇది ఉంటుంది. ఇది సంస్థలకు సమాచారాన్ని అందిస్తుంది.

అయితే సంస్థలు యూజర్ వ్యక్తిగత సమాచారాన్ని సేకరించలేకపోయినా.. మళ్లీ ఎలాంటి యాడ్లు పంపాలి అని నిర్ణయించుకుంటాయి. అయితే ఈ సమస్యకు పరిష్కారం ఉంది. మెయిల్స్‌లో ఆటోమేటిక్‌‌‌ ఇమేజ్‌‌‌‌‌‌‌‌‌‌ డౌన్‌‌లోడ్‌ లేదా లోడింగ్‌ను ఆపేయడం వల్ల ట్రాకింగ్ కు గురి కాకుండా జాగ్రత్తగా ఉండవచ్చు. దీని వల్ల యూజర్ల ఆన్‌ లైన్‌ సెక్యూరిటీ పెరుగుతుంది. జీమెయిల్‌‌‌, యాపిల్‌‌‌ మెయిల్‌‌‌, ఔట్‌లుక్‌‌‌‌ లో ఎక్స్‌ట‌ర్న‌ల్ ఇమేజెస్‌‌ ఆటోమేటిక్‌‌‌ డౌన్‌లోడ్ను ఎలా ఆపాలో చూడండి.

జీమెయిల్‌‌‌:
డెస్క్ టాప్ బ్రౌజర్ వాడుతున్నప్పుడు జీమెయిల్‌‌‌లో ఇమేజ్‌‌‌‌‌‌‌‌‌‌లు ఆటోమేటిక్‌‌‌గా లోడ్ అవడాన్ని ఆపాలంటే.. జీమెయిల్ లో సెట్టింగ్స్‌‌ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత సీ ఆల్‌‌‌ సెట్టింగ్స్‌‌లోకి వెళ్లాలి. ఆ తర్వాత జనరల్‌‌‌ ట్యాబ్ ఆప్షన్‌ లోకి వెళ్లి ఫైండ్ ఇమేజెస్‌లో చూస్ ఆస్క్ బిఫోర్ డిస్ల్పేయింగ్ ఎక్స్ టర్నల్‌‌‌ ఇమేజెస్‌ను ఎంపిక చేసుకోవాలి. ఆ తర్వాత కిందికి వచ్చి సేవ్ చేంజెస్‌‌ పై క్లిక్ చేయాలి. గూగుల్‌‌‌ మొబైల్‌‌‌ యూజర్లయితే జీమెయిల్‌‌‌ సెట్టింగ్స్‌‌ లోకి వెళితే.. చూస్‌‌ ఆస్క్ బిఫోర్ డిస్ల్పేయింగి ఎక్స్‌ట‌ర్న‌ల్ ఇమేజెస్‌‌ అనే ఆప్షన్‌ కనిపిస్తుంది.

మైక్రోసాఫ్ట్ ఔట్‌లుక్‌‌‌‌
మైక్రోసాఫ్ట్ ఔట్‌లుక్‌‌‌‌ లో డిఫాల్ట్ గానే ఆటోమేటిక్‌‌‌ ఇమేజ్‌‌‌‌‌‌‌‌‌‌ డౌన్‌లోడింగ్ బ్లాక్‌‌‌ అయి ఉంటుంది. అయితే ఒకవేళ ఇమేజ్‌‌‌‌‌‌‌‌‌‌ ఆటోమేటిక్‌‌‌గా డౌన్‌లోడ్ అవుతుంటే బ్లాక్‌‌‌ చేసుకోవాలి. ఔట్‌లుక్‌‌‌‌ డెస్క్ టాప్ యాప్‌లో ఫైల్స్ ఆప్షన్‌లోకి వెళ్లాలి. ఆప్షన్స్ > ట్రస్ట్ సెంటర్ > ట్రస్ట్ సెంటర్ సెట్టింగ్స్‌‌ > ఆటోమేటిక్‌‌‌ డౌన్‌లోడ్లోకి వెళ్లి డోంట్ డౌన్‌లోడ్ పిక్చర్స్ ఆటోమేటికల్లీ ఇన్‌ ఆర్ఎస్‌‌ఎస్‌‌ ఐటెమ్స్‌‌ ఆర్ స్టాండర్డ్ హెచ్‌టీఎంఎల్‌‌‌ ఈమెయిల్‌‌‌ మెసేజెస్‌‌ ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి.

యాపిల్‌‌‌ మెయిల్‌‌‌
మాక్‌లో యాపిల్‌‌‌ మెయిల్‌‌‌ యాప్‌ను ఓపెన్‌ చేసి ఆటోమేటిక్‌‌‌ ఇమేజ్‌‌‌‌‌‌‌‌‌‌ డౌన్‌లోడింగ్‌ను డిసేబుల్‌‌‌ చేయాలి. అలాగే మెయిల్‌‌‌ పై క్లిక్ చేసి ప్రిఫరెన్స్ లో వ్యూయింగ్‌లోకి వెళ్లి లోడ్ రిమోట్ కంటెంట్ ఇమేజెస్‌‌ అనే ఆప్షన్‌ ను అన్‌ చెక్‌‌‌ చేయాలి. దీని వల్ల మెయిల్‌‌‌ యాప్‌లో వచ్చే మెయిల్స్‌లో ఇమేజెస్‌‌ ఆటోమేటిక్‌‌‌ లోడ్ కావడం ఆగిపోతాయి. అలాగే ఐఫోన్‌ మొబైల్‌‌‌ యాప్‌లోనూ ఇలా చేయవచ్చు. యాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి మెయిల్‌‌‌ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి. అక్కడ లోడ్ రిమోట్ ఇమేజెస్‌‌ ఆప్షన్‌ను టోగుల్‌‌‌ చేయాలి. ఆ తర్వాతి నుంచి ఆటోమేటిక్‌‌‌ గా ఇమేజెస్‌‌ లోడ్ అవడం ఆగిపోతాయి.
Published by:Krishna Adithya
First published: