Home /News /business /

HOW TO START A CEMENT DEALERSHIP BUSINESS MK

Cement Dealer Ship Business: ఉన్న ఊరిలో లక్షల్లో ఆదాయం రావాలంటే ఈ పని చేయండి..పెట్టుబడి, ఆదాయం వివరాలు మీకోసం..

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

సిమెంట్ కంపెనీల నుండి నేరుగా సిమెంట్ ను దిగుమతి చేసుకుని మీ సమీపంలో గల వారికి రిటైల్ గా అమ్ముకొని సంపాదించడం ద్వారా సిమెంట్ వ్యాపారంలో ప్రవేశించచ్చు.

  దేశంలో నిర్మాణ రంగం పుంజుకుంటోంది. ఈ నేపథ్యంలో సిమెంట్ వాడకం కూడా పెరిగింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా సంప్రదాయ నివాసాల నుంచి ఆధునిక నివాసాల వైపు కదులుతున్నారు. అటు మౌలిక సదుపాయ రంగంలో కూడా కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు భారీ ప్రాజెక్టులు చెపడుతున్నాయి. దీంతో సిమెంట్ వినియోగం విపరీతంగా పెరిగిపోతూనే ఉంది. ప్రపంచ వ్యాప్తంగా పోలిస్తే సిమెంట్ వాడకంలో భారతదేశం రెండవ స్థానంలో ఉంది. ఈ క్రమంలో Cement Dealer Ship Business ను ప్రారంభించడం ద్వారా నెలకు లక్షల్లో ఆధాయాన్ని సంపాదించవచ్చు. ఇళ్ళ నిర్మాణం, ప్రభుత్వ పనులు, రోడ్లు, భవనాలు, పాత భవనాల మరమత్తులు, ఇతర నిర్మాణపు పనులకు తప్పనిసరిగా సిమెంట్ అవసరం. అయితే ఈ సిమెంట్ వ్యాపారాన్ని మంచి కంపెనీ వద్ద డీలర్ షిప్ తీసుకుని ప్రారంభించవచ్చు. ఇళ్ళు, భవనాలు, వంతెనలు, రోడ్లు, బ్రిడ్జిలు, గోడలు, తాపీపని, కాంక్రీట్ స్లాబ్, పిల్లర్లు వంటి నిర్మాణాలకు సిమెంట్ అవసరం అవుతుంది. సాధారణంగా కంపెనీలు తమ వ్యాపార అభివృద్దిలో భాగంగా ఫ్రాంచెజీ విధానాన్ని అవలంబిస్తుంటాయి. ప్రస్తుతం సిమెంట్ కంపెనీ వారు కూడా తమ వ్యాపార వృద్ది కోసం డీలర్ షిప్ ద్వారానే తమ సేల్స్ ను విస్తరించుకుంటారు.

  సిమెంట్ కంపెనీల నుండి నేరుగా సిమెంట్ ను దిగుమతి చేసుకుని మీ సమీపంలో గల వారికి రిటైల్ గా అమ్ముకొని సంపాదించడం ద్వారా సిమెంట్ వ్యాపారంలో ప్రవేశించచ్చు. సిమెంట్ కంపెనీల బ్రాండ్ ను బట్టి ఆయా కంపెనీలు కొంత పెట్టుబడిని డిపాజిట్ చేయమని అడుగుతాయి. సాధారణంగా లక్ష రూపాయల నుండి 10 లక్షల రూపాయల వరకు పెట్టుబడి డిపాజిట్ కంపెనీ నిబంధనలను బట్టి జమచేయాల్సి ఉంటుంది. సిమెంట్ బ్యాగులను జాగ్రత్తగా దాచడానికి ఒక గోడౌన్ అవసరం అవుతుంది. అలాగే వాటిని విక్రయించడానికి మంచి సెంటరులో దుకాణం, అలాగే పబ్లిసిటి కోసం కాస్త ఖర్చు అవుతుంది. అయితే సిమెంట్ దుకాణం సాధారణంగా కొత్తగా అభివృద్ధి చెందుతున్న, నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్న ప్రాంతాలను గుర్తించి ఏర్పాటు చేస్తే మీ వ్యాపారం పుంజుకుంటుంది.

  Term Policy Premiums: టర్మ్ పాలసీలను తీసుకోవాలనుకుంటున్నారా..? ఈ విషయం తప్పక తెలుసుకోండి..


  సిమెంట్ డీలర్ షిప్ వ్యాపారానికి అవసరమైన డాక్యుమెంట్లు ఇవే..
  సిమెంట్ డీలర్ షిప్ వ్యాపారాన్ని ప్రారంభించాలంటే తప్పనిసరిగా MSME Certificate అవసరం, అలాగే GST రిజిస్టర్ చేసుకుని ఉండాలి. దీంతో పాటు స్థానిక గ్రామ పంచాయితీ/ మున్సిపాలిటి వారి నుండి అనుమతి పత్రం తప్పనిసరిగా ఉండాలి. Tax Information Network (TIN), డీలర్ షిప్ లో ఎవరైనా తోటి భాగస్వాములు ఉన్నట్లయితే వారి వివరాలు, ల్యాండ్ లీజ్ డాక్యుమెంట్లు, మీ బిజినెస్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, బ్యాంకు కరెంట్ అకౌంట్ మొదలగునవి తప్పనిసరిగా అవసరం అవుతాయి.

  సిమెంట్ డీలర్ షిప్ వ్యాపారాన్ని ప్రారంభించాలంటే ఏం చేయాలి..
  సిమెంట్ డీలర్ షిప్ వ్యాపారాన్ని ప్రారంభించే ముందు మీరు ఆయా సిమెంట్ కంపెనీలకు సంబంధించిన రీజనల్ మేనేజర్, సేల్స్ మేనేజర్ లను సంప్రదించవలసి ఉంటుంది. వారి వివరాలను ఆయా సిమెంట్ కంపెనీలకు సంబంధించిన అధికారిక వెబ్ సైట్ ను సంధర్శించి, Contact Us పేజీ ద్వారా తెలుసుకోవచ్చు. మీరు ఎంచుకున్న ఏరియాలో 3 కి.మీ. పరిధిలో ఆయా సిమెంట్ కంపెనీలకు సంబంధించిన మరెవరైనా డీలర్ గా ఉన్నారా లేదా అనే వాటిని పరిగణలోకి తీసుకుంటారు. ఎవరైనా ఉన్నట్లయితే మీకు డీలర్ షిప్ దక్కదు. కాబట్టి మీరు ముందుగానే ఈ అంశాలను పరిగణలోకి తీసుకోవాలి.

  ఆధాయం ఎంత వస్తుంది..
  పెద్ద సిమెంట్ కంపెనీ దాదాపు 3 నుండి 8 శాతం లాభాలను అందిస్తుంది. అయితే ఈ కమీషన్ తో పాటు మీరు ఎక్కువ అమ్మకాలు చేసినట్లయితే కంపెనీ కొన్ని ఆఫర్లు, గిఫ్టులను కూడా అందిస్తుంది. దీంతో మీకు ఆధాయంతో పాటు బోనస్ కూడా లభిస్తుంది. సాధారణంగా ప్రస్తుతం మార్కెట్లో ఒక కంపెనీ సిమెంట్ బస్తా 300 ఉన్నట్లయితే మనకు 3 నుండి 8 శాతం కమీషన్ అంటే ఒక బస్తా మీద 10 రూపాయల నుండి 24 రూపాయల వరకు కమీషన్ దక్కుతుంది. హమాలీలను కూడా మెయిన్ టెయిన్ చేయాలి. మీరు ఎంపిక చేసుకున్న ఏరియాలో డిమాండును బట్టి సుమారు 30,000 రూపాయల నుండి లక్ష రూపాయల వరకు ఆధాయం పొందవచ్చు.

  సిమెంట్ డీలర్ షిప్ కోసం ఎలా అప్లై చేయాలి..
  మీరు సిమెంట్ డీలర్ షిప్ వ్యాపారాన్ని ఏ కంపెనీ ద్వారా పొందాలని భావిస్తున్నారో ఆయా కంపెనీ అఫీషియల్ వెబ్ సైట్ ను సంధర్శించి మీ డీలర్ షిప్ ను నమోదు చేసుకోవాలి. మీరు నమోదు చేసుకున్న తర్వాత కంపెనీ వారు ఒక ప్రతినిధిని మీ వద్దకు పంపి అన్ని పరిశీలిస్తారు. అవసరమైన డాక్యుమెంట్లు, అగ్రిమెంట్, కమీషన్ తదితర వివరాలను చెప్పి మీ రిజిస్ట్రేషన్ ను ఫైనల్ చేస్తారు. మీ ఏరియాలో ఎక్కువగా అమ్ముడు పోయే దానిని ఎంచుకోవడం ద్వారా మీ మార్కెట్ ఎక్కవ ఉండి మీకు లాభాలు అధికంగా రావవడానికి ఉపయోగపడుతుంది. మార్కెటింగ్ ద్వారా మీ వ్యాపారం మరింత వృద్ధి చెందుతుంది.
  Published by:Krishna Adithya
  First published:

  Tags: Business Ideas

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు