• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • HOW TO SAVE TAX THROUGH FAMILY MEMBERS HERE ARE SOME TIPS BA GH

Tax Saving Tips: మీ ఫ్యామిలీ పేరుతో ట్యాక్స్ ఆదా చేసుకునే 9 మార్గాలు..

Tax Saving Tips: మీ ఫ్యామిలీ పేరుతో ట్యాక్స్ ఆదా చేసుకునే 9 మార్గాలు..

Tax Saving Tips: ప్రతీకాత్మక చిత్రం

పన్ను ఆదా చేసుకోవడానికి చాలా మంది రకరకాల మార్గాలు అన్వేషిస్తుంటారు. అయితే, మీ కుటుంబసభ్యుల ద్వారా మీరు పన్ను ఆదా చేసుకునే మార్గాలను ఇక్కడ తెలుసుకోవచ్చు.

  • Share this:
ఆర్థిక సంవత్సరం ముగియనుండటంతో ఇప్పుడు అందరి చూపు పన్ను ఆదాపై పడింది. పన్ను చెల్లింపుదారుడు పన్ను భారాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయడం సహజం. దాని కోసం అందుబాటులో ఉన్న అన్ని ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తుంటారు. అయితే, చట్ట ప్రకారం అందుబాటులో ఉన్న అనేక పెట్టుబడి మార్గాల మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చు. దీని కోసం భార్య, పిల్లలు, తల్లిదండ్రులపై పెట్టుబడి పెట్టడం తెలివైన నిర్ణయంగా చెప్పవచ్చు. తద్వారా మీకు సెక్షన్ 80 సి లభించే పన్ను మినహాయింపుతో పాటు మీ కుటుంబ సభ్యుల పేరిట కూడా అనేక పన్ను ప్రయోజనాలను పొందవచ్చు.

జీవిత భాగస్వామి ద్వారా పన్ను ఆదా
1. వ్యాపారం
మీరు, మీ భార్య ఇద్దరూ కలిసి వ్యాపారం చేస్తూ పన్ను చెల్లిస్తున్న క్రమంలో, మొత్తం ఖర్చులను ఇద్దరూ సమానంగా విభజించుకోవడం లాభిస్తుంది. ఎందుకంటే, మీ జీవిత భాగస్వామి వ్యాపారం లేదా వృత్తి ద్వారా వచ్చే ఆదాయంపై ఆదాయపు పన్ను స్లాబ్ ప్రయోజనం పొందవచ్చు. ఉదాహరణకు భార్యాభర్తలిద్దరూ వైద్యులుగా పనిచేస్తున్న క్రమంలో రోగులకు జారీ చేసిన ఇన్వాయిస్‌లను సమానంగా విభజించుకోండి. తద్వారా, ఇద్దరూ పన్ను ప్రయోజనాలను పొందవచ్చు. ఇది తెలివైన నిర్ణయం.
2. ఎల్​టీఏ ప్రయోజనం
సహజంగా ఒక వ్యక్తికి 4 సంవత్సరాల వ్యవధిలో రెండు ప్రయాణాలకు సంబంధించిన LTA ప్రయోజనాలు లభిస్తాయి. అయితే, భార్యాభర్తలిద్దరూ ఉద్యోగం చేస్తున్నట్లైతే.. వారిద్దరూ కలిసి 4 ఏళ్లలో మొత్తం 4 ప్రయాణాలకు సంబంధించిన LTA ను క్లెయిమ్ చేయవచ్చు.
3. రుణాలు
మీరు మీ భార్యకు డబ్బును బహుమతిగా ఇచ్చి, దాన్ని పెట్టుబడిగా పెడితే, దానిపై వచ్చే వడ్డీపై పన్ను విధించబడుతుంది. అందువల్ల, ఏదైనా బ్యాంకులో మీ భాగస్వామి పేరిట లోన్​ తీసుకొని, ఆమెకు ఇవ్వండి. తద్వారా అదనపు పన్ను ప్రయోజనాలు పొందవచ్చు.
4. క్యాపిటల్​ గెయిన్స్​
సెక్షన్ 112 ఎ కింద లిస్టెడ్ ఈక్విటీ అమ్మకాలతో పాటు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ల యూనిట్లపై లభించే దీర్ఘకాలిక మూలధన లాభాలపై లక్ష రూపాయల వరకు పన్ను మినహాయింపు ఇవ్వబడింది. అందువల్ల, ప్రతి ఆర్థిక సంవత్సరంలో భార్యాభర్తల పేరిట పన్ను ప్రయోజనాలు పొందవచ్చు.

పిల్లల ద్వారా పన్ను ఆదా
1. ట్యూషన్ ఫీజు
ఇద్దరు పిల్లలకు చెల్లించే ట్యూషన్ ఫీజుపై తల్లిదండ్రులు పన్ను మినహాయింపును క్లెయిమ్ చేయవచ్చు. సెక్షన్ 80 సి కింద ఈ పన్ను మినహాయింపు ప్రయోజనం పొందవచ్చు.
2. పెట్టుబడులు
మీరు మీ పిల్లల పేరుతో పీపీఎఫ్, మ్యూచువల్ ఫండ్స్, సాంప్రదాయ బీమా పాలసీలు లేదా యులిప్​లలో పెట్టుబడులు పెడితే, రూ. సెక్షన్ 80 సి మీరు ఏటా గరిష్టంగా 1.5 లక్షల పన్ను ప్రయోజనాలను పొందవచ్చు.
3. లోన్
మీ పిల్లల ఉన్నత చుదువుల కోసం తీసుకున్న ఎడ్యుకేషన్​ లోన్​పై కూడా పన్ను ప్రయోజనం పొందవచ్చు. తీసుకున్న లోన్​పై వడ్డీ ప్రారంభమైన సంవత్సరం నుండి 8 సంవత్సరాల వరకు సెక్షన్ 80 ఈ కింద పన్ను మినహాయింపు లభిస్తుంది.

తల్లిదండ్రుల ద్వారా పన్ను ఆదా
1. ఇంటి అద్దె
మీరు తల్లిదండ్రులతోనే కలిసి ఉంటూ వారి పేరిట పన్ను ప్రయోజనం పొందవచ్చు. మీరు వారికి అద్దె చెల్లిస్తూ.. హోమ్​ రెంట్​ అలవెన్స్​ (HRA) రూపంలో క్లెయిమ్ చేయవచ్చు.
2. పెట్టుబడులు
సహజంగా సీనియర్​ సిటిజన్లకు ఎక్కువ పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. అందువల్ల, మీరు మీ డబ్బును వారి బ్యాంక్ ఖాతాలోకి బదిలీ చేయండి. అంతేకాక, వారి పేరిట పెట్టుబడులు పెట్టండి. మీ డబ్బును SCSS లేదా సీనియర్ సిటిజన్ పొదుపు పథకం, పోస్ట్ ఆఫీస్ MIS లేదా అధిక రాబడినిచ్చే ఇతర పెట్టుబడి మార్గాలను అన్వేషించవచ్చు. ఫిక్స్​డ్​ డిపాజిట్ల నుంచి వచ్చే వడ్డీ ఆదాయంపై సీనియర్ సిటిజన్లకు ఏటా రూ. 50,000 పన్ను మినహాయింపు లభిస్తుంది.
Published by:Ashok Kumar Bonepalli
First published:

అగ్ర కథనాలు