బాధ్యతగల భారతీయ పౌరులు అందరూ ఆదాయ పన్ను రిటర్న్(ITR) దాఖలు చేయాలి. 2021-22 ఆర్థిక సంవత్సరం (అసెస్‌మెంట్ ఇయర్ 2022-23)కి సంబంధించి ఆదాయ పన్ను రిటర్న్(ITR) ఫైల్ చేయడానికి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా.. ముందే ఐటీఆర్ ఫైల్ చేయడం మేలని నిపుణులు సూచిస్తున్నారు. ఐటీఆర్‌ని సమర్పించిన తర్వాత, పన్ను శాఖ ఈ వివరాలన్నీ సరిపోలుతున్నాయో లేదో తెలుసుకోవడానికి డిక్లరేషన్‌లు, చెల్లించిన పన్నులను పరిశీలిస్తుంది. ట్యాక్స్ పేయర్స్ చెల్లించాల్సిన దానికంటే తక్కువ మొత్తం ట్యాక్స్ కడితే.. ఆదాయ పన్ను శాఖ అవుట్ స్టాండింగ్ ట్యాక్స్ డిమాండ్(Outstanding Tax Demand) నోటీసు జారీ చేస్తుంది. అటువంటి నోటీసు అందుకున్న వారు ఎలా ప్రతి స్పందించాలో తెలుసుకోండి.
ఇలాంటి డిమాండ్లకు ఆన్‌లైన్‌లో ఈ-ఫైలింగ్ వెబ్‌సైట్ ద్వారా సమాధానం ఇచ్చే అవకాశం ఉంది. ఈ-ఫైలింగ్ పోర్టల్ ద్వారా ఇలా స్పందించవచ్చు..
- మొదట ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో లాగిన్ అవ్వాలి.
- పెండింగ్ యాక్షన్స్ మెనూపై క్లిక్ చేయాలి. ఆ తర్వాత రెస్పాన్స్ టూ అవుట్ స్టాండింగ్ డిమాండ్ టూ వ్యూ ఏ లిస్ట్ ఆఫ్ ఆల్ అవుట్ స్టాండింగ్ డాక్యుమెంట్స్ ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. ఆ తర్వాత డిమాండ్ చెల్లించడానికి పే నౌ క్లిక్ చేయాలి.
- 'రెస్పాన్స్ టూ అవుట్ స్టాండింగ్ అమౌంట్’ పేజీలో అవుట్ స్టాండింగ్ డిమాండ్‌కు ప్రతిస్పందించడానికి 'సబ్మిట్ రెస్పాన్స్ టూ అవుట్ స్టాండింగ్ డిమాండ్ క్లిక్ చేయాలి.
దాని తర్వాత కనిపించే అంశాల ఆధారంగా చెల్లింపుదారులు సంబంధిత విభాగానికి వెళ్లవచ్చు:
(ఎ) డిమాండ్ సరైనది, కానీ పన్ను చెల్లింపుదారులు పన్ను చెల్లించలేదు: ఈ సందర్భంలో పన్ను చెల్లింపుదారులు డిమాండ్ సరైనదని సమర్పించవచ్చు. ఈ-పే ట్యాక్స్ పేజీలో పన్ను చెల్లింపు చేయవచ్చు. చెల్లింపు విజయవంతంగా పూర్తయిన తర్వాత.. ట్రాన్సాక్షన్ ఐడీతోపాటు మెసేజ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
(బి) డిమాండ్ సరైనది, పన్ను చెల్లించారు: డిమాండ్ సరైనది, పన్ను చెల్లింపుదారులు ఇప్పటికే పన్ను చెల్లించారు. ఈ సందర్భంలో పన్ను చెల్లింపుదారులు ‘యాడ్ చలాన్ డీటైల్స్’ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి చలాన్, టైప్ ఆఫ్ పేమెంట్, చలాన్ అమౌంట్, BSR కోడ్, సీరియల్ నంబర్, పేమెంట్ డేట్ తదితర వివరాలను నమోదు చేయాలి. ఆ తర్వాత ‘అటాచ్‌మెంట్’ బటన్‌పై క్లిక్ చేసి చలాన్(PDF) కాపీని అప్‌లోడ్ చేయాలి. ప్రక్రియ అంతా విజయవంతంగా పూర్తయిన తర్వాత ట్రాన్సాక్షన్ ఐడీతో స్క్రీన్‌పై మెసేజ్ కనిపిస్తుంది.
(సి) పన్ను చెల్లింపుదారులు డిమాండ్‌తో ఏకీభవించకపోతే: పన్ను చెల్లింపుదారులు డిమాండ్‌తో ఏకీభవించని(పూర్తిగా లేదా పాక్షికంగా) సందర్భంలో కారణాలు తెలియజేయవచ్చు. ఇందుకు పేజీలో ‘యాడ్ రీజన్స్’ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అక్కడ కనిపించే రీజన్స్‌లో సరైన దానిని సెలక్ట్ చేయాలి. అనంతరం అవసరమైన వివరాలను ఎంటర్ చేయాలి. చివరిగా కనఫర్మ్ సబ్‌మిషన్ బటన్‌పై క్లిక్ చేయాలి. ప్రక్రియ విజయవంతంగా పూర్తయిన తర్వాత స్క్రీన్‌పై ట్రాన్సాక్షన్ ఐడీతో మెసేజ్ కనిపిస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Income tax, IT Returns, ITR, ITR Filing