• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • HOW TO RENEW YOUR LAPSED LIFE HEALTH AND MOTOR INSURANCE POLICY MK GH

Renew Policies: బీమా పాలసీలు ఎలా పునరుద్ధరించుకోవాలి.. గడుపు పూర్తయితే పరిస్థితి ఏంటి?

Renew Policies: బీమా పాలసీలు ఎలా పునరుద్ధరించుకోవాలి.. గడుపు పూర్తయితే పరిస్థితి ఏంటి?

New Rules in April: సామాన్యులకు అలర్ట్... రేపటి నుంచి అమల్లోకి రానున్న కొత్త రూల్స్ ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

ఇన్సురెన్స్ పాలసీలు తీసుకునే వారు రోజురోజుకు పెరుగుతున్నారు. అయితే పాలసీల విషయంలో కొన్ని నిబంధనలు సరిగ్గా తెలుసుకోకపోతే పాలసీ ?

  • Last Updated:
  • Share this:
ఇన్సురెన్స్ పాలసీలు తీసుకునే వారు రోజురోజుకు పెరుగుతున్నారు. అయితే పాలసీల విషయంలో కొన్ని నిబంధనలు సరిగ్గా తెలుసుకోకపోతే పాలసీ తిరస్కరించడమే కాకుండా దానికి అనుసంధానమై ఉన్న ఇతర బీమా పాలసీలు కూడా నష్టపోవాల్సి ఉంది. రాకేశ్ గులాటీ అనే వ్యక్తి సాఫ్ట్ వేర్ ఇంజీనీర్ గా పనిచేస్తుండేవాడు. 2015లో అతడు టర్మ్ లైఫ్ ఇన్సురెన్స్ పాలసీని కొనుగోలు చేశాడు. పాలసీకి సంబంధించిన ప్రీమియంలు అన్నీ సమయానికి కట్టాడు. దురదృష్టవశాత్తు ఇటీవలే ప్రమాదంలో మరణించాడు. అయితే కుటుంబ సభ్యులు బీమాను క్లెయిమ్ చేసుకోవడానికి దరఖాస్తు చేసుకోగా.. అది రిజెక్ట్ అయింది. ఇందుకు కారణం అతడు గడువుకు ముందే తన చివరి ప్రీమియం చెల్లించకుండా చనిపోవడం.. దీని వల్ల కుటుంబ సభ్యులు దాదాపు కోటి రూపాయలను నష్టపోవాల్సి వచ్చింది.

ఈ విధంగా రాకేశ్ ఒక్క కుటుంబమే కాదు దేశంలో చాలా మంది కుటుంబాలు ఇలాంటి ఆర్థిక అవరోధాలు ఎదుర్కొంటున్నారు. ఆప్తులు చనిపోయిన బాధలో వారుంటే మరోపక్క ఈ బీమా పాలసీల కారణంగా అంతులేని ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. ఈ లోపం వల్ల బీమా క్లెయిమ్ కోల్పోవడమే కాకుండా దానికి అనుసంధానించి ఉన్న ఇతర ప్రయోజనాలు కూడా నష్టపోతున్నారు. ముఖ్యంగా జీవిత, ఆరోగ్య, మోటార్ ఇన్సురెన్స్ లాంటి అన్నీ పాలసీ గడువుతో పాటు అందుబాటులోకి వ్తాయి. పాలసీని ముందుగానే పునరుద్ధరించడం పాలసీదారుడు మర్చిపోతే బీమా కవర్ చేసుకోలేరు. అంటే దాదాపు పాలసీ లేకపోవడంతో అది సమానం. మీ పాలసీ గడువు ముగిసిన తర్వాత బీమా సంస్థ కూడా ఆర్థిక సహాయం అందించదు. అందువల్ల బీమా పాలసీని కోల్పోవడానికి ముందే దాన్ని రెన్యువల్ చేసుకోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఎందుకంటే ఇది ఆర్థిక చిక్కులను నివారించడంలో తోడ్పడుతుందని అంటున్నారు. అయినప్పటికీ కొన్ని అనివార్య పరిస్థితుల దృష్ట్యా మీ బీమా పాలసీలు ఏమైనా ముగిసిపోయినట్లయితే మీరు పాలసీని రివ్యూ లేదా రెన్యువల్ చేసుకునేందుకు కొన్ని మార్గాలు ఉన్నాయి.

టర్మ్ లైఫ్ ఇన్సురెన్స్ పాలసీ..
మీరు టర్మ్ లైఫ్ ఇన్సురెన్స్ పాలసీని కొనుగోలు చేసేటప్పుడు బీమా సంస్థ మీకు నెలవారీ ప్రీమియం లేదా త్రైమాసిక లేదా అర్ధ, వార్షిక వాయిదాల్లో లేదా ఏడాదికి ఒకేసారి చెల్లించే అవకాశాన్ని ఇస్తుంది. మీరు ఖర్చు చేసే సామర్థ్యం ప్రకారం మీరు ఏదైనా ఎంపికలను ఎంచుకోవచ్చు. మీ టర్మ్ లైఫ్ ఇన్సురెన్స్ ప్లాన్ ప్రీమియం చెల్లించడం ఆపివేసిన తర్వాత మీ పాలసీ ఇన్ యాక్టివ్ గా మారుతుంది. అంతమాత్రాన అది ముగిసినట్లు కాదు. మీ టర్మ్ ప్లాన్ ను తిరిగి యాక్టివ్ చేసుకోవడానికి మీరు నెలవారీ వాయిదాలు తీసుకుంటే 15 రోజుల గ్రేస్ పీరియడ్, త్రైమాసిక, అర్ధ, వార్షిక ప్రీమియం చెల్లిస్తుంటే 30 రోజుల గ్రేస్ పీరియడ్ లోపు చెల్లించే అవకాశాన్ని ఇస్తుంది. ఇప్పుడు కూడా మీరు మీ పాలసీ పునరుద్ధించుకోకపోతే అప్పుడు ఆగిపోతుంది.
ఇన్సురెన్స్ రెగ్యులేటర్ మార్గదర్శకాల ప్రకారం 2019 డిసెంబరుకు ముందు టర్మ్ ఇన్సురెన్స్ పాలసీల గరిష్ఠ పునరుద్ధరణ కాలం 2 ఏళ్లు కాగా.. 2019 డిసెంబరు తర్వాత జారీ చేసిన పాలసీలకు రివైవల్ కాలం 5 ఏళ్లుగా నిర్ణయించింది. అప్పుడు పాలసీ దారుడు చెల్లించని అన్నీ ప్రీమియంలను ఒకేసారి చెల్లించాలి. మొదట చెల్లించని ప్రీమియం తేదీ నుంచి పునరుద్ధరణ తేదీ వరకు అన్ని బకాయిలు, పన్నులు, లెవీలతో సహా వడ్డీలను కూడా చెల్లించాలి. కొన్ని సందర్భాల్లో పాలసీ పునరుద్ధరణ విషయంలో బీమా సంస్థ తిరిగి వైద్య పరీక్ష కోసం అడిగే అవకాశముంటుంది.

ఆరోగ్య బీమా పాలసీ..
పాలసీ నిలిపివేత ప్రభావం సాధారణంగా ఆరోగ్య బీమాపై ఎక్కువగా ఉంటుంది. ప్రీమియం సరిగ్గా చెల్లించకపోవడం వల్ల పాలసీదారుడిపై దుష్ప్రభావాలు ఉంటాయి. మీ ఆరోగ్య బీమా పాలసీని పునరుద్ధరించడానికి 30 రోజుల గ్రేస్ పీరియడ్ ను బీమా సంస్థ ఇస్తుంది. ఆ లోపు చెల్లిస్తే మీ పాలసీ పునరుద్ధరిస్తారు. లేకుంటే మీ పాలసీ ముగుస్తుంది. తర్వాత ఎప్పటికీ పునరుద్ధరించలేరు. అప్పుడు మీ ముందున్న ఏకైక పరిష్కార నూతన ఆరోగ్య బీమా కవరేజీని కొనుగోలు చేయడం. దీని కింద మీరు ఫ్రెష్ వెయిటింగ్ పీరియడ్ కు కూడా డబ్బు చెల్లించాల్సి ఉంటుంది.

మోటార్ బీమా పాలసీ..
మీరు నో క్లెయిమ్ బోనస్ కోల్పోకూడదు అనుకుంటే నిలిచిపోయిన మోటార్ పాలసీ 90 రోజుల్లోపు పునరుద్ధరించుకోవాలి. లేదంటే 65 శాతం వరకు డ్యామేజి ప్రీమియం కోల్పోతారు. ఈ నష్టం విలువ మిడ్ సైజ్ కారు విషయంలో అనేక రెట్లు విలువైంది. పాలసీ నిలిచిపోతే పునరుద్ధరించడానికి మీరు బీమా సంస్థను నేరుగా లేదా మధ్య వర్తుల ద్వారా సంప్రదించవచ్చు. అంతేకాకుండా కోవిడ్ మహమ్మారి ప్రభావం వల్ల మీ వాహనం ఫిజికల్ వెరిఫికేషన్ కోసం సెల్ఫ్ ఇన్స్ పెక్షన్(స్వీయ తనిఖీ) వీడియో ఉపయోగించుకోవచ్చు. దీని కోసం మీరు చేయాల్సిందల్లా మీ బీమా యాప్ లో ఓ వీడియోతో పాటు వాహనం చిత్రాలను అప్ లోడ్ చేయాలి. ఏజెంటును సంప్రదించాల్సిన అవసరం లేకుండా కొన్ని గంటల్లోనే ఈ విధంగా పాలసీని పునరుద్ధరించుకోండి.
First published:

అగ్ర కథనాలు