హోమ్ /వార్తలు /బిజినెస్ /

Home Loan: హోమ్ లోన్ ప్రీపేమెంట్‌తో భారీగా డబ్బులు మిగులు.. ఇలా చేయండి..

Home Loan: హోమ్ లోన్ ప్రీపేమెంట్‌తో భారీగా డబ్బులు మిగులు.. ఇలా చేయండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆర్బీఐ రెపో రేటు పెంపు తర్వాత.. హోమ్ లోన్‌ను కాల వ్యవధికి ముందే పూర్తిగా తిరిగి చెల్లించే ఆప్షన్‌ గురించి రుణ గ్రహీతలు ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో హోమ్ లోన్ ప్రీ పేమెంట్ అంటే ఏంటి? ఈ నిర్ణయం సరైనదేనా? అంటే వివరాలివే..

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇటీవల రెపో రేటును 4 నుంచి 4.40 శాతానికి పెంచింది. రాబోయే మానిటరీ పాలసీ నిర్ణయాల్లో వడ్డీ రేట్లు మరింత పెరిగే అవకాశం ఉంది. కొత్తగా లోన్ తీసుకున్న వారిపై ఈ ప్రభావం పడనుంది. అయితే చాలామంది రుణ గ్రహీతలు ఇప్పుడు రుణదాతను ఎంచుకునేటప్పుడు ROI ఫ్యాక్టర్స్‌ను మించి ఆలోచించడం ప్రారంభించారు. త్వరగా రుణాలు తిరిగి చెల్లించేందుకు వినూత్న పరిష్కారాల కోసం చూస్తున్నారు.

ఆర్బీఐ రెపో రేటు పెంపు తర్వాత.. హోమ్ లోన్‌ను కాల వ్యవధికి ముందే పూర్తిగా తిరిగి చెల్లించే ఆప్షన్‌ గురించి రుణ గ్రహీతలు ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో హోమ్ లోన్ ప్రీ పేమెంట్ అంటే ఏంటి? ఈ నిర్ణయం సరైనదేనా? దీనితో ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? వంటి వివరాలు తెలుసుకుందాం.

India’s Cryptocurrency : ఇండియాకు సొంతగా డిజిటల్ కరెన్సీ.. RBI సంచలన ప్రణాళిక ఇదే..


* ముందస్తు చెల్లింపు (prepayment) అంటే ఏంటి? :  ముందస్తు చెల్లింపు అనేది రుణదాత అందించిన సదుపాయం. ఈ ఆప్షన్ ద్వారా రుణగ్రహీతలు తమ EMI బకాయిల కంటే ఎక్కువ మొత్తాన్ని రుణదాతలకు చెల్లించవచ్చు. ఈ ప్రీపేమెంట్ నిధులను నేరుగా రుణం తీసుకున్న అసలు మొత్తం నుంచి తీసివేస్తారు. తద్వారా మిగిలిన రుణ కాలవ్యవధికి దానిపై విధించే వడ్డీ తగ్గుతుంది. ఈ మేరకు రుణ గ్రహీత లబ్ధి పొందవచ్చు.

Lucky Zodiac Signs : అదృష్టమంటే ఈ రాశుల వారిదే.. వచ్చే నెలంతా డబ్బే డబ్బు.. అన్నింటా విజయాలు..


* లోన్ ప్రీపేమెంట్ ప్రయోజనాలు :  ఈ విధానంలో లోన్ అగ్రిమెంట్‌లో పేర్కొన్న కాలవ్యవధి కంటే ముందుగానే మొత్తం లోన్‌ను తిరిగి చెల్లించవచ్చు. ఈ ప్రక్రియలో లోన్‌ భారం త్వరగా తీరడమే కాకుండా, వడ్డీ రూపంలో చాలా వరకు డబ్బు ఆదా చేసుకోవచ్చు. సిస్టమాటిక్ ప్రీ పేమెంట్ ప్లాన్.. అంటే ప్రతి నెలా కొద్ది మొత్తంలో నిధులను ముందస్తుగా చెల్లించడం ద్వారా భవిష్యత్తులో పెద్ద మొత్తంలో పొదుపు చేసుకోవచ్చు. హోమ్ లోన్‌ను గడువు కంటే ముందుగానే చెల్లించడం వల్ల కస్టమర్ల క్రెడిట్ స్కోర్‌ కూడా మెరుగుపడుతుంది. తద్వారా భవిష్యత్తు అవసరాల కోసం క్రెడిట్ వర్తీనెస్ మెరుగవుతుంది.

* ముందస్తు చెల్లింపు రకాలు: రుణగ్రహీతల ఫైనాన్షియల్ హెల్త్ ఆధారంగా, వారు ఒకేసారి ఏకమొత్తంలో ప్రీపేమెంట్ చేయవచ్చు లేదా చిన్న మొత్తంలో ప్రతి నెలా కొంత మేరకు ప్రీపేమెంట్ చేయవచ్చు.

CM KCR : దేశయాత్రకు బ్రేక్!.. ఫామ్‌హౌస్‌కు కేసీఆర్.. దసరా నుంచి ఢిల్లీలో చక్రం.. PM అవుతారంటూ..


- లంప్ సమ్ ప్రీపేమెంట్ :  ఈ విధానంలో లోన్‌ బకాయి మొత్తాన్ని ఒకేసారి ముందస్తుగా చెల్లించవచ్చు. అయితే రుణదాతలు స్థిరమైన (ఫిక్స్‌డ్) వడ్డీ రేటుపై తీసుకున్న రుణాల ప్రీపేమెంట్‌పై కొంత ఫీజు వసూలు చేస్తారు. కాబట్టి మీ లోన్ వడ్డీ రేటు ఫ్లోటింగ్ రేటుగా ఉన్నట్లు నిర్ధారించుకోవడం మంచిది. ఈ సంవత్సరం పెద్దమొత్తంలో బోనస్‌ను పొందిన వారు తమ హోమ్ లోన్‌ను ముందస్తుగా చెల్లించడం మంచి ఆప్షన్. ఏవైనా పెట్టుబడులు, ఇతర మార్గాల నుంచి అదనపు నిధులు అందిన ప్రతిసారి ఆ మొత్తాన్ని లోన్ ప్రీపేమెంట్‌కు కేటాయించడం మంచిది.

Petrol Diesel : పెట్రోల్ లేదు నాయనా.. ఆ ఇద్దరి మధ్య గొడవతో వాహనదారులకు షాక్.. 31న బంద్


- సిస్టమాటిక్ ప్రీపేమెంట్స్ :  ఏకమొత్తంలో ముందస్తు చెల్లింపులు చేసేందుకు పెద్ద మొత్తంలో అదనపు నిధులు లేనప్పుడు.. ఈ ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. రుణ గ్రహీతల ఫిక్స్‌డ్ డిపాజిట్లు లేదా మరే ఇతర పెట్టుబడులకు ఆటకం కలిగించకుండానే ఈ విధానంలో రుణ భారాన్ని తగ్గించుకోవచ్చు. ప్రతి నెలా కేవలం EMIతో పాటు కొంత బకాయిని ముందస్తుగా చెల్లించడం వల్ల చాలా పెద్ద మార్పును గమనించవచ్చు.

First published:

Tags: EMI, Home loan, Interest rates, Rbi

ఉత్తమ కథలు