హోమ్ /వార్తలు /బిజినెస్ /

Multiple Health Plans: ఒకటి కంటే ఎక్కువ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్లు ఉన్నాయా? అయితే సింగిల్‌ క్లైయిమ్‌ ఎలా చేయాలో తెలుసుకోండి..

Multiple Health Plans: ఒకటి కంటే ఎక్కువ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్లు ఉన్నాయా? అయితే సింగిల్‌ క్లైయిమ్‌ ఎలా చేయాలో తెలుసుకోండి..

Health Insurance

Health Insurance

Multiple Health Plans: ఓ వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలను తీసుకోవచ్చు. ఒకటి కంటే ఎక్కువ పాలసీలను తీసుకోవడం ద్వారా కవరేజీ మెరుగుపడుతుంది. అయితే వాటిని ఎలా ఉపయోగించాలో తెలుసుకోవడం, మెడికల్ ఎమర్జెన్సీ సమయంలో క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రక్రియను అర్థం చేసుకోవడం అవసరం.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

వైద్య ఖర్చులు పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో హెల్త్‌ ఇన్సూరెన్స్‌ (Health Insurance) పాలసీల అవసరం పెరిగింది. పాలసీలు తీసుకునే వారి సంఖ్య పెరగడంతోపాటు.. ఎక్కువ మొత్తంలో కవరేజీని అందించేందుకు ఇన్సూరెన్స్‌ కంపెనీ (Insurance Companies)లు ముందుకు వస్తున్నాయి. కొన్ని సంస్థలు రూ.80 లక్షల నుంచి రూ.1 కోటి వరకు హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కవరేజీని అందిస్తున్నాయి. మరో పక్క కొన్ని ప్రత్యేక కారణాల వల్ల కొందరికి ఇన్సూరెన్స్‌ కంపెనీలు ఎక్కువ కవరేజీ అందించవు. అలాంటి పరిస్థితుల్లో వారు అవసరాలను తీర్చుకునేందుకు ఒకటి కంటే ఎక్కువ పాలసీలను తీసుకోవాల్సి వస్తుంది.

వాస్తవానికి ఓ వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలను తీసుకోవచ్చు. ఒకటి కంటే ఎక్కువ పాలసీలను తీసుకోవడం ద్వారా కవరేజీ మెరుగుపడుతుంది. అయితే వాటిని ఎలా ఉపయోగించాలో తెలుసుకోవడం, మెడికల్ ఎమర్జెన్సీ సమయంలో క్లైయిమ్ సెటిల్‌మెంట్ ప్రక్రియను అర్థం చేసుకోవడం అవసరం.

* ఒకటి కంటే ఎక్కువ పాలసీలు ఉంటే?

పెరుగుతున్న వైద్య ద్రవ్యోల్బణం, ఆరోగ్య సంరక్షణ ఖర్చులు ఒకటి కంటే ఎక్కువ పాలసీలను తీసుకొనేలా చేస్తున్నాయి. కొన్ని కార్పొరేట్ హెల్త్ పాలసీలు తక్కువ మొత్తం బీమాతో వస్తాయి. ఇవి కుటుంబం లేదా తల్లిదండ్రులను కవర్‌ చేయకపోవచ్చు.

అలాంటి సందర్భాల్లో మరొక పాలసీని కొనుగోలు చేయాల్సి వస్తుందని CNBC-TV18.comతో చెప్పారు డిజిటల్ ఇన్సూరెన్స్‌లో హెల్త్ అండ్ ట్రావెల్ హెడ్ సుధా రెడ్డి. కస్టమర్ వయస్సు, ఫిట్‌నెస్ స్థాయిలు, కంపెనీ మార్గదర్శకాల ఆధారంగా, బీమా సంస్థలు ఎక్కువ కవరేజీ లభించే పాలసీలను జారీ చేయకపోవచ్చు. అటువంటి వారు తమ కవరేజీని పెంచుకోవడానికి రెండో పాలసీని తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుందని సుధారెడ్డి తెలిపారు.

* క్లెయిమ్ చేయడం ఎలా?

క్లెయిమ్ సైజ్‌, ప్రతి పాలసీపై అందుతున్న బీమా మొత్తంపై క్లెయిమ్ ప్రాసెస్ ఆధారపడి ఉంటుంది. సింగిల్‌ పాలసీ అందించే బీమా మొత్తం కంటే క్లెయిమ్ మొత్తం ఎక్కువగా ఉన్నప్పుడు.. బీమా మొత్తం కంటే క్లెయిమ్ మొత్తం ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే కాంట్రిబ్యూషన్ నిబంధన వర్తిస్తుంది.

ఇది కూడా చదవండి : ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును పెంచాలన్న EPFO.. 2047 నాటికి అలాంటి పరిస్థితులు..

బీమా చేసిన వ్యక్తి ముందుగా క్లెయిమ్ చేయాలనుకుంటున్న బీమా సంస్థను ఎంచుకుని, రెండో పాలసీ నుంచి మిగిలిన మొత్తాన్ని క్లెయిమ్ చేయవచ్చు. క్లెయిమ్ చేస్తున్న మొత్తం ఒక పాలసీ అందించే బీమా కంటే తక్కువగా ఉంటే.. ఇది పూర్తిగా బీమా చేసిన వ్యక్తి ప్రాధాన్యతపై ఆధారపడి ఉంటుంది. కాంట్రిబ్యూషన్ నిబంధన వర్తించదు.

* గుర్తుంచుకోవాల్సిన విషయాలు

కొత్తగా హెల్త్ పాలసీ కొనుగోలు చేసేటప్పుడు, అప్పటికే ఏవైనా పాలసీలు ఉంటే స్పష్టం చేయాలి. అలాంటివి దాచడం నిబంధనలు, షరతుల ఉల్లంఘనగా పరిగణిస్తారు. వేర్వేరు కంపెనీలలో రెండు పాలసీలు ఉంటే సంబంధిత కంపెనీలకు వివరాలు తెలియజేయాలి. లేదంటే ఈ కారణంతో మల్టిపుల్ పాలసీలకు క్లెయిమ్స్ రిజెక్ట్ చేయవచ్చు.

Published by:Sridhar Reddy
First published:

Tags: Health Insurance, Personal Finance

ఉత్తమ కథలు