హోమ్ /వార్తలు /బిజినెస్ /

Link Aadhaar With Voter ID: ఓటరు ఐడీతో ఆధార్ లింక్ చేయడం ఎలా? స్టెప్‌ బై స్టెప్‌ సింపుల్ ప్రాసెస్ ఇదే.. ఓ లుక్కేయండి

Link Aadhaar With Voter ID: ఓటరు ఐడీతో ఆధార్ లింక్ చేయడం ఎలా? స్టెప్‌ బై స్టెప్‌ సింపుల్ ప్రాసెస్ ఇదే.. ఓ లుక్కేయండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఓటరు ఐడీతో ఆధార్ నంబర్‌ను లింక్ చేసుకునే గడువును ప్రభుత్వం పొడిగించింది. ఇప్పుడు ప్రజలు 2023 ఏప్రిల్ 1 నుంచి 2024 మార్చి 31 వరకు ఆధార్‌తో ఓటరు ఐడీని లింక్‌ చేసుకునే అవకాశం ఉంది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

ప్రభుత్వం వివిధ గుర్తింపు కార్డుల ద్వారానే లబ్ధిదారులను గుర్తిస్తుంది. అందుకే వివిధ అవసరాల కోసం కీలక పాన్‌కార్డ్‌, ఆధార్‌, ఓటరు ఐడీలను లింక్‌ చేయాలని సూచిస్తోంది. ఇప్పుడు ఓటరు ఐడీతో ఆధార్ నంబర్‌ను లింక్ చేసుకునే గడువును ప్రభుత్వం పొడిగించింది. ఇప్పుడు ప్రజలు 2023 ఏప్రిల్ 1 నుంచి 2024 మార్చి 31 వరకు ఆధార్‌తో ఓటరు ఐడీని లింక్‌ చేసుకునే అవకాశం ఉంది. ఓటర్లను గుర్తించడం, ఓటర్ల జాబితాలో నమోదులను ధ్రువీకరించడం కోసం ఈ కార్డ్‌లను లింక్‌ చేయాలని సూచిస్తున్నట్లు భారత ఎన్నికల సంఘం తెలిపింది. దీనికి సంబంధించి న్యాయ మంత్రిత్వ శాఖ 2023 మార్చి 21న ఓ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

ఓటరు ఐడీని ఆధార్‌తో లింక్ చేయడం ఎలా?

ముందుగా NVSP.in వెబ్‌సైట్‌ని ఓపెన్‌ చేయాలి. అక్కడ ‘ఫారమ్స్‌’ అనే ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి. ఇప్పటికే రిజిస్టర్‌ అయి ఉంటే, యూజర్‌ నేమ్‌, పాస్‌వర్డ్, క్యాప్చా కోడ్‌ని ఎంటర్‌ చేసి లాగిన్‌ అవ్వాలి. ఒకవేళ రిజిస్టర్ చేసుకోకపోతే.. ‘డోంట్‌ హ్యావ్‌ అకౌంట్‌, రిజిస్టెర్‌ యాజ్‌ ఎ న్యూ యూజర్‌’ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. ఇప్పుడు- ‘ఐ హ్యావ్‌ EPIC నంబర్’, ‘ఐ డోంట్‌ హ్యావ్‌ EPIC నంబర్ ’ అనే రెండు ట్యాబ్‌లు కనిపిస్తాయి. మొదటి ట్యాబ్‌లో, నచ్చిన EPIC నంబర్, ఇమెయిల్, పాస్‌వర్డ్‌ను నమోదు చేయాలి. రెండో ట్యాబ్‌లో పేరు, ఇమెయిల్ అడ్రెస్‌, మీకు నచ్చిన పాస్‌వర్డ్‌ను ఎంటర్‌ చేయాలి. ఈ ప్రాసెస్‌ తర్వాత 'రిజిస్టర్'పై క్లిక్ చేయాలి.

లాగిన్ అయిన తర్వాత, 'ఫారమ్స్‌' ట్యాబ్‌లోని 'ఫారమ్ 6B' ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి. తర్వాత 'సెల్ఫ్' సెలక్ట్‌ చేసుకోండి. రాష్ట్రం, అసెంబ్లీ/పార్లమెంటరీ నియోజకవర్గాన్ని ఎంచుకోవాలి. వ్యక్తిగత వివరాలు, OTP, ఆధార్ నంబర్‌ను నమోదు చేసి, ‘ప్రివ్యూ’ బటన్‌పై క్లిక్ చేయాలి. చివరిగా 'సబ్మిట్'పై క్లిక్ చేయాలి. దరఖాస్తును ట్రాక్ చేయడానికి రిఫరెన్స్ నంబర్ డిస్‌ప్లే అవుతుంది.

ఆధార్‌ని ఓటరు ఐడీతో లింక్ చేయడానికి, ఓటరు హెల్ప్‌లైన్ యాప్, ఓటరు ఐడీ లేదా ఇపిఐసి నంబర్, ఆధార్ నంబర్ అవసరమని గమనించాలి. ఏదైనా సందేహాలు ఉంటే, మరిన్ని వివరాల కోసం యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) అధికారిక వెబ్‌సైట్‌ను చెక్‌ చేయవచ్చు.

పాన్‌- ఆధార్‌ లింక్‌ చేశారా?

అదే విధంగా ఇంకా పాన్ కార్డ్‌ని ఆధార్‌తో లింక్ చేయకపోతే, 2023 మార్చి 31లోపు చేయాలి. ఒకవేళ లింక్‌ చేయకపోతే వారి పాన్‌కార్డ్‌ 2023 ఏప్రిల్‌ 1 నుంచి పని చేయదు. ఆదాయ పన్ను చట్టం, 1961లో కొత్త సెక్షన్ 139AAని ఆర్థిక చట్టం, 2017 యాడ్‌ చేసింది. ఆధార్ పొందేందుకు అర్హత ఉన్న ప్రతి వ్యక్తి పాన్ కోసం దరఖాస్తు చేస్తున్నప్పుడు లేదా 2017 జులై 1 నుంచి అమలులోకి వచ్చే ఆదాయ రిటర్న్‌ను అందించేటప్పుడు అతని/ఆమె ఆధార్ నంబర్‌ను పేర్కొనాల్సి ఉంటుంది.

First published:

ఉత్తమ కథలు