• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • HOW TO INCREASE SBI CREDIT CARD LIMIT HERE ARE TWO WAYS BA GH

కాల్ మనీ యాప్స్ బారిన పడొద్దు.. అదనంగా డబ్బులు పొందండిలా

కాల్ మనీ యాప్స్ బారిన పడొద్దు.. అదనంగా డబ్బులు పొందండిలా

ప్రతీకాత్మక చిత్రం

ప్రస్తుతం మనీ యాప్స్ పెరిగిపోయి డబ్బుల కోసం జనం వాటి దగ్గర ఎక్కువ వడ్డీలకు రుణాలు తీసుకుంటున్నారు. అలా చేయవద్దు. మీ క్రెడిట్ కార్డులోనే రుణ పరిమితిని ఇలా పెంచుకోండి.

  • Share this:
ఈ రోజుల్లో క్రెడిట్ కార్డు వినియోగం సర్వసాధారణమైపోయింది. అయితే దీన్ని ఉపయోగించానికి క్రమశిక్షణ, ఉపయోగం అవసరం కాబట్టి లేకపోతే మీరు బయటకు రావడం చాలా కష్టం. ఎందుకంటే క్రెడిట్ కార్డు పరిమితి ఆధారంగా డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. అంటే నిర్ణయించిన వ్యక్తి రిస్క్ ప్రొఫైల్, ఫైనాన్షియల్ స్టాండింగ్ మొదలైనవి ఇందులో ఉంటాయి. అంతేకాకుండా క్రెడిట్ కార్డును ఉపయోగించి ఖర్చు చేయగల గరిష్ఠ సొమ్మే ఈ క్రెడిట్ కార్డు పరిమితి. ఒకవేళ వ్యక్తుల రిస్క్ ప్రొఫైల్ తక్కువగా ఉంటే గరిష్ఠ క్రెడిట్ పరిమితిని కార్డు జారీ దారుడు లేదా లెండర్ అందజేస్తాడు. మీరు క్రెడిట్ కార్డు మొదటిసారి దరఖాస్తుదారులైతే క్రమంగా మీరు నెమ్మదిగా ఈ పరిమితిని పెంచుకోవచ్చు. అలాగే మీ సూచన కోసం 3 క్రెడిట్ పరిమితి రకాలు ఉన్నాయి. మొత్తం క్రెడిట్ పరిమితి.. ఇది మీ క్రెడిట్ కార్డులో మీరు పొందగల గరిష్ఠ క్రెడిట్ పరిమితి. అందుబాటులో ఉన్న క్రెడిట్ పరిమితి- తేదీ నాటికి కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్న క్రెడిట్ మొత్తం. SBI క్రెడిట్ కార్డు పరిమితి పెంచుకోవడానికి ఇక్కడ కొన్ని మార్గాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం.

ప్రీ అప్రూవ్డ్ క్రెడిట్ లిమిట్ ఆఫర్ (జీరో డాక్యూమెంట్ ప్రాసెస్)..
మీరు ఎస్బీఐ క్రెడిట్ కార్డు హోల్డర్ అయితే మీ క్రెడిట్ కార్డు పరిమితిని పెంచడానికి ఇక్కడ రెండు మార్గాలు ఉన్నాయి. తొలుత ముందుగా ఆమెదించిన క్రెడిట్ పెరుగుదల మీకు అందుబాటులో ఉందో లేదో తనిఖీ చేయాలి? బ్యాంక్ అంతర్గత విధానం ఆధారంగా ఇది ఎక్కువగా నిర్ణయించబడుతుంది. దీనికోసం SBI బ్యాంకు వ్యక్తుల రిజిస్టర్డ్ మొబైల్ నెంబరు, ఈమెయిల్స్ కు సమాచారమిస్తుంది. మీరు దాన్ని సొంతంగా ఎలా తనిఖీ చేయవచ్చో కూడా మీకు ఎంపిక ఉంటుంది.

-మీరు sbicard.com లోకి లాగిన్ అయి ఎడమ వైపు ఉన్న ఆఫర్స్ లేదా బెనిఫిట్స్ ట్యాబ్ పై క్లిక్ చేయాలి. మీ ఖాతాలో ఏదైనా క్రెడిట్ పరిమితి పెరుగుదల ఆఫర్ ఉందో లేదో చూడండి. అనంతరం సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి.
-ఇది మీకు అందుబాటులో ఉంటే మీరు ఇప్పుడు మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబరు నుంచి 5676791కు INCRXXXX(కార్డు చివరి నాలుగు అంకెలు)ను ఎస్ఎంఎస్ చేయాలి. లేదా sbicard.com కు మెయిల్ చేయాలి.
- 39 02 02 02 (స్థానిక ఎస్టీడీ కోడ్) లేదా 1860 180 1290 వద్ద హెల్ప్ లైన్ నెంబరుకు కాల్ చేయవచ్చు.

క్రెడిట్ లిమిట్ కోసం ఎస్బీఐ క్రెడిట్ కార్డుతో ఇంకమ్ డాక్యూమెంటేషన్ ను చేయించాలి...

ఇందులో ఎస్బీఐ ఆఫర్ చేసిందాని కంటే ఎక్కువ క్రెడిట్ లిమిట్ కోసం మీ అర్హతను నిరూపించుకోవడం. ఈ దశలోనూ మీరు sbicard.com లేదా కార్డు జారీచేసిన కంపెనీకు ఈమెయిల్ చేయవచ్చు. వారు 2 రోజుల్లో మీకు రిప్లై ఇస్తారు. అంతేకాకుండా మీరు ఎస్బీఐ క్రెడిట్ కార్డు హెల్ప్ లైన్ నెంబరు 39 02 02 02 లేదా 1860 180 1290కు కాల్ చేయవచ్చు. ఇది మీరు క్రెడిట్ పరిమితి పెరుగుదల ఉంటుంది. ప్రాతిపాదిక ఆదాయ పత్రాలకు అర్హత ఉంటే కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటీవ్ తో తనిఖీ చేయవచ్చు. క్రెడిట్ పరిమితి ఎక్కువ కావాలనుకుంటే అవసరమైన పత్రాలైన ఫారం 16, ఐటీఆర్ VI, చివరి రెండు నెలల శాలరీ స్లిప్స్, ఈ పత్రాల సాఫ్ట్ కాపీలను ఈమెయిల్ ద్వారా www.sbicard.com/email కు పంపవచ్చు.

అలాగే ఈ పత్రాలను భౌతికంగా కరస్పాండెట్స్ విభాగం డీఎల్ఎఫ్ ఇన్ఫినిటీ టవర్స్, టవర్-సీ, 10-12 అంతస్తు, బ్లాక్-2, బిడీజీ-3, డీఎల్ఎఫ్ సైబర్ సిటీ గుర్గావ్-122002కు పంపవచ్చు. పోస్ట్ రసీదు, ఆదాయ పత్రాల సమీక్ష, క్రెడిట్ రిస్క్ పెంపు కోసం అభ్యర్థన లాంటివి అంతర్గత పాలసీకి అనుగుణంగా నెరవేరుతుంది.
Published by:Ashok Kumar Bonepalli
First published:

అగ్ర కథనాలు