కొత్త ఉద్యోగంలోకి మారుతున్నారా...అయితే మీ Credit Score విషయంలో జాగ్రత్త..ఎందుకంటే

తాజాగా కొత్తగా ఉద్యోగం కోసం అప్లై చేసుకున్న అభ్యర్థుల క్రెడిట్ స్కోరును కూడా పరిగణలోకి తీసుకుంటున్నట్లు పలు జాబ్ పోర్టల్స్ పేర్కొంటున్నాయి. అంటే కేవలం మీరు ఇంటర్వ్యూల్లో రాణిస్తే సరిపోదు...మీ క్రెడిట్ స్కోరు విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి.


Updated: November 14, 2020, 2:46 PM IST
కొత్త ఉద్యోగంలోకి మారుతున్నారా...అయితే మీ Credit Score విషయంలో జాగ్రత్త..ఎందుకంటే
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
కొత్త ఉద్యోగంలోకి మారుతున్నారా...అయితే మీరు ఓ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రస్తుతం చాలా సంస్థలు కేవలం కారిక్యులం మాత్రమేకాదు మీ క్రెడిట్ స్కోరును కూడా చూస్తున్నాయన్న సంగతి తెలిస్తే ఆశ్చర్యపోతారు. కానీ ఇది నిజం. తాజాగా కొత్తగా ఉద్యోగం కోసం అప్లై చేసుకున్న అభ్యర్థుల క్రెడిట్ స్కోరును కూడా పరిగణలోకి తీసుకుంటున్నట్లు పలు జాబ్ పోర్టల్స్ పేర్కొంటున్నాయి. అంటే కేవలం మీరు ఇంటర్వ్యూల్లో రాణిస్తే సరిపోదు...మీ క్రెడిట్ స్కోరు విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. నిజానికి 700 పాయింట్లు ఉంటే మంచి స్కోరుగా పరిగణిస్తారు. అప్పుడే మీరు పలు క్రెడిట్ కార్డులు, పలురకాల లోన్స్ పొందేందుకు అర్హత పొందుతారు. అయితే రెగ్యులర్ గా క్రెడిట్ కార్డు బిల్లులు, అలాగే రుణ చెల్లింపులు సకాలంలో చేయకపోతే అది మీ క్రెడిట్ స్కోరు మీద చాలా నెగిటివ్ ప్రభావం చూపనుంది.

కొన్ని సంస్థల్లో తక్కువ క్రెడిట్ స్కోర్ ఉంటే వారికి ఆర్థిక క్రమశిక్షణ లేదని గుర్తించి కొన్ని సంస్థల్లో ఉద్యోగం ఇఛ్చేందుకు నిరాకరిస్తున్నాయి. ముఖ్యంగా రిక్రూట్మెంట్ సమయంలో ఈ తరహా క్రెడిట్ స్క్రీనింగ్ టెలికాం, బ్యాంకింగ్, బీమా, క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు, సెబీ, ఐఆర్డీఏఐ వంటి సంస్థల్లో ఉపాధి కోసం ప్రయత్నిస్తున్న వారి అవకాశాలపై ఇది నెగిటివ్ ఎఫెక్ట్ చూపే అవకాశం ఉంది. అయితే మున్ముందు సాఫ్ట్ వేర్ సహా, పలు రంగాలకు ఈ క్రెడిట్ స్క్రీనింగ్ పాకే వీలుందని నిపుణులు పేర్కొంటున్నారు.

మరి దీనికి పరిష్కారం ఏంటి అనే సందేహం రావచ్చు. ఎప్పటికప్పుడు ఈఎంఐలను సకాలంలో చెల్లించడం ఉత్తమం అని చెప్పవచ్చు. అలాగే క్రెడిట్ కార్డు బిల్లులను ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోవాలి. ముఖ్యంగా మీరు రెగ్యులర్ గా వాడని క్రెడిట్ కార్డులను తిరిగి ఇచ్చేయడమే మేలు. లేకపోతే మీరు ఒక్కోసారి కొన్ని క్రెడిట్ కార్డుల బిల్లులు కొద్ది మొత్తంలో ఉన్నప్పటికీ మరిచిపోయే అవకాశం ఉంది. అలాంటి సమయంలో మీరు తరచూ వాడని కార్డులను రిటర్న్ చేయడమే ఉత్తమం.

స్వల్పకాలిక రుణాలు, క్రెడిట్ కార్డుల ఆఫర్లకు లొంగవద్దు...

మీ క్రెడిట్ స్కోర్ ను తగ్గించే మోసపూరిత లావాదేవీలను ట్రాక్ చేయడం తప్పనిసరి. ఎప్పటికప్పుడు మీ క్రెడిట్ కార్డు స్టేట్ మెంట్స్ ను పరిశీలించుకోవాలి. అప్పుడే మీ క్రెడిట్ స్కోరుపై నెగిటివ్ ఎఫెక్ట్ పడకుండా జాగ్రత్త పడవచ్చు. ఇక ఈఎంఐలను, క్రెడిట్ కార్డు బకాయిలను గడువు తేదీలోగా చెల్లించండి. లేకపోతే మీ క్రెడిట్ సంస్థలు ఎప్పటికప్పుడు సిబిల్, ఈక్విఫాక్స్ వంటి క్రెడిట్ బ్యూరోలకు మీ క్రెడిట్ రిపోర్ట్ ను పంపిస్తారు. ఇది మీ క్రెడిట్ స్కోర్ ను మరింత ప్రభావితం అవుతుంది.

ఇక ఉద్యోగస్తులు స్వల్ప రుణాలు లేదా క్రెడిట్ కార్డులు తీసుకోవడం అంత మంచిది కాదు. క్రెడిట్ బ్యూరోలు వీటిని కూడా పరిగణించి మీ క్రెడిట్ స్కోరును తగ్గిస్తాయి. ఇలా జాగ్రత్తగా వ్యవహరించడం వల్లనే మీరు ఉద్యోగ అవకాశాన్ని కోల్పోకుండా ఉండటానికి మీ క్రెడిట్ స్కోర్ ను కలిగి ఉండడం మంచిది.
Published by: Krishna Adithya
First published: November 14, 2020, 2:46 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading