HOW TO GET THE BEST OUT OF YOUR CREDIT CARDS REWARD POINTS GH VB
Credit Card Reward Points: క్రెడిట్ కార్డు రివార్డ్ పాయింట్లు చాలా ఉన్నాయా..? వీటిని ఇలా యూజ్ చేయండి..
ప్రతీకాత్మక చిత్రం
కొన్ని క్రెడిట్ కార్డు కంపెనీలు వివిధ రకాల సంస్థలతో కలిసి రివార్డ్ పాయింట్లను అందిస్తుంటాయి. కొన్ని కంపెనీలు గిఫ్ట్ వోచర్లను ప్రకటిస్తాయి. వాటితో ట్రావెల్ టికెట్లు, రెస్టారెంట్లలో డిస్కౌంట్లు పొందవచ్చు.
ఈ రోజుల్లో రోజువారీ అవసరాలకు క్రెడిట్ కార్డులు(Credit Card) మంచి ఆల్టర్నేటివ్స్‌గా మారిపోయాయి. అయితే క్రెడిట్ కార్డులను సరిగా వాడడం వల్ల ఎన్నో ఉపయోగాలుంటాయి. చాలామంది క్రెడిట్ కార్డులు వాడితే వచ్చే రివార్డు పాయింట్ల (Reward Points) గురించి పెద్దగా పట్టించుకోరు. కానీ ఈ రివార్డ్ పాయింట్స్‌తో ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి. ఎక్కువ రివార్డు పాయింట్ల కోసం ఎక్కువ షాపింగ్(Shopping) చేయాలనుకుంటారు చాలామంది. కానీ అది నిజం కాదు. కార్డులను తెలివిగా వాడుకోవడం ద్వారా ఎక్కువ పాయింట్లను సంపాదించవచ్చు. పండుగ రోజుల్లో బ్యాంకులు, క్రెడిట్ కార్డు కంపెనీలు ఆఫర్ల మెయిల్స్(Mails) పంపుతుంటాయి. కొన్నిక్రెడిట్ కార్డులు వెల్కమ్ ఆఫర్(Offer) కింద కార్డు తీసుకున్న వెంటనే కొన్ని పాయింట్లు ఇస్తాయి. వాటిని చెక్ చేస్తూ ఉండాలి.
కంపెనీలతో కలిసి..
కొన్ని క్రెడిట్ కార్డు కంపెనీలు వివిధ రకాల సంస్థలతో కలిసి రివార్డ్ పాయింట్లను అందిస్తుంటాయి. కొన్ని కంపెనీలు గిఫ్ట్ వోచర్లను ప్రకటిస్తాయి. వాటితో ట్రావెల్ టికెట్లు, రెస్టారెంట్లలో డిస్కౌంట్లు పొందవచ్చు. అలాగే కొన్ని కార్డులు ఆయిల్ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుని రివార్డు పాయింట్లు అందజేస్తాయి. ఇకపోతే తరుచూ విమాన ప్రయాణాలు చేసేవారికి, విమాన ప్రయాణ టికెట్లలో రాయితీలను పొందేందుకు కొన్ని కార్డులు అవకాశం కల్పిస్తున్నాయి. ఇలా ట్రావెల్, డీటీహెచ్ రీచార్జ్, హోటల్ బుకింగ్స్.. ఇలా రకరకాల రివార్డు పాయింట్లు అందుబాటులో ఉంటాయి. ఈ విషయాలన్నీ తెలుసుకోవడం ద్వారా రివార్డు పాయింట్లను సరిగ్గా వాడుకోవచ్చు.
బోనస్ రివార్డులు
మీరు ఖర్చు చేసిన దాన్ని బట్టి రివార్డు పాయింట్లు వచ్చి చేరుతుంటాయి. ఈ రివార్డు పాయింట్లకు కాలపరిమితి ఉంటుంది. అది దాటితే.. రివార్డు పాయింట్లు వేస్ట్ అయిపోతాయి. అందుకే ఎన్ని రివార్డు పాయింట్లు ఉన్నాయి? వాటిని ఎక్కడ వినియోగించుకోవచ్చు? అనే విషయాలు తరచూ చెక్ చేసుకుంటూ ఉండాలి. కొన్ని కంపెనీలు బోనస్ రివార్డు పాయింట్లు ఇస్తుంటాయి. నిర్ణీత వ్యవధిలో నిర్ధేశిత మొత్తాన్ని ఖర్చు చేస్తే అదనపు పాయింట్ల యాడ్ అవుతాయి. మీ అవసరాన్ని బట్టి ఆయా సందర్భాల్లో షాపింగ్ చేస్తే ఈ బోనస్ పాయింట్లు పొందే అవకాశం ఉంటుంది.
క్యాష్ బ్యాక్ ఆఫర్లు
అన్ని క్రెడిట్ కార్డుల్లో రివార్డు పాయింట్లు రాకపోవచ్చు. అందుకే కార్డు తీసుకునేటప్పుడే అన్ని వివరాలు తెలుసుకోవాలి. కొన్ని కార్డుల్లో పాయింట్లకు బదులు క్యాష్‌బ్యాక్ ఆఫర్లు లభిస్తాయి. కొన్నింట్లో డిస్కౌంట్లు లభిస్తాయి. ఇలా ప్రతి క్రెడిట్ కార్డుపై ఏదో రకమైన బెనిఫిట్ ఉంటుంది.
రిడీమ్ ఇలా..
మనకు లభించిన రివార్డు పాయింట్లను రిడీమ్ చేసుకునేటప్పుడు వాటి విలువను దృష్టిలో ఉంచుకోవాలి. అంటే ఒక వస్తువు కొనుగోలు చేసేటప్పుడు ఒక రివార్డ్ పాయింట్ విలువ 20 పైసలుగా ఉంటే, వేరే వస్తువు తీసుకుంటే అదే పాయింట్ 30 పైసలు విలువ ఉండొచ్చు. అలాగే కొన్నిసార్లు ప్రతి 2000 పాయింట్లను రూ. 500 గా పరిగణిస్తారు. ఈ విలువ కూడా ప్రొడక్ట్‌ను బట్టి మారుతుంటుంది. మనం తీసుకునే వస్తువు, దాని కంపెనీ, మనం వాడుతున్న కార్డు, వాడుతున్న సమయాన్ని బట్టి పాయింట్ల విలువ మారుతూ ఉంటుంది. ఈ విషయాలన్నీ చెక్ చేసుకుంటే ఎక్కువ బెనిఫిట్ పొందవచ్చు.
వాల్యూ చెక్ చేసుకుని..
రివార్డు పాయింట్లను విలైనంత తొందరగా రీడీమ్ చేసుకోవాలనుకుంటారు చాలామంది. అయితే అలా చేయడం కంటే.. మీ రివార్డు పాయింట్లకు ఎక్కడ, ఎప్పుడు ఎంత వాల్యూ లభిస్తుందో తెలుసుకుని అప్పుడు వాడితేనే మంచిది. రివార్డు పాయింట్ల గురించి తెలుసుకునేందుకు మీ క్రెడిట్ కార్డు కంపెనీ వెబ్సైట్లలో లేదా బ్యాంకు నెట్‌బ్యాంకింగ్ పోర్టల్‌లో లాగిన్ అవ్వాలి. క్రెడిట్ కార్డు నెంబర్‌ను ఎంటర్ చేసి, పాయింట్స్ రిడీమ్ ఆప్షన్ ఎంచుకోవడం ద్వారా మీ రివార్డు పాయింట్ల వివరాలు తెలుసుకునే అవకాశం కల్పిస్తున్నాయి కొన్ని కంపెనీలు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.