హోమ్ /వార్తలు /బిజినెస్ /

Saving Scheme: బ్యాంక్, పోస్టాఫీస్‌లో సూపర్ స్కీమ్‌.. చేరితే రూ.25 లక్షలు మీవే!

Saving Scheme: బ్యాంక్, పోస్టాఫీస్‌లో సూపర్ స్కీమ్‌.. చేరితే రూ.25 లక్షలు మీవే!

Saving Scheme: బ్యాంక్, పోస్టాఫీస్‌లో సూపర్ స్కీమ్‌.. చేరితే రూ.25 లక్షలు మీవే!

Saving Scheme: బ్యాంక్, పోస్టాఫీస్‌లో సూపర్ స్కీమ్‌.. చేరితే రూ.25 లక్షలు మీవే!

Sukanya Samriddhi Scheme | మీరు ఇన్వెస్ట్ చేయాలని భావిస్తున్నారా? అయితే ఈ స్కీమ్ గురించి తెలుసుకోండి. ఇందులో చేరితే ఏకంగా రూ. 25 లక్షల వరకు మెచ్యూరిటీ అమౌంట్ పొందొచ్చు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

Small Saving Schemes | మీరు రిస్క్ లేకుండా రాబడి పొందాలని భావిస్తున్నారా? అయితే చాలా ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సేవింగ్ స్కీమ్ కూడా ఒకటి. ఇందులో చేరితే సూపర్ ప్రాఫిట్ పొందొచ్చు. భారత ప్రభుత్వం సుకన్య సమృద్ధి స్కీమ్‌ను (Scheme) అందిస్తోంది. ఇంట్లో పదేళ్లలోపు ఆడ పిల్లలను ఈ స్కీమ్‌లో చేర్పించొచ్చు. ఈ పథకంలో చేరడం ద్వారా పలు రకాల ప్రయోజనాలు పొందొచ్చు. రాబడి వస్తుంది. అలాగే ట్యాక్స్ (Tax) బెనిఫిట్స్ పొందొచ్చు.

ప్రస్తుతం సుకన్య సమృద్ధి స్కీమ్‌పై 7.6 శాతం వడ్డీ లభిస్తోంది. ఇది ఆకర్షణీయ వడ్డీ రేటు అని చెప్పుకోవచ్చు. ఈ స్కీమ్ మెచ్యూరిటీ కాలం 21 ఏళ్లు. ఇందులో చేరిన వారు 15 ఏళ్లు డబ్బులు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ. 1.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. ప్రతి నెలా ఈ పరిమితిలో మీరు ప్రతి నెలా డబ్బులు డిపాజిట్ చేసుకోవచ్చు. మీరు ఇన్వెస్ట్ చేసే మొత్తం ప్రాతిపదికన మీకు వచ్చే మెచ్యూరిటీ అమౌంట్ కూడా మారుతుంది.

ఉద్యోగులకు, పెన్షనర్లకు మోదీ అదిరిపోయే శుభవార్త?

ఉదాహరణకు మీరు మీ పాప పేరుపై నెలకు రూ. 5 వేలు డిపాజిట్ చేయాలని చూస్తున్నారు. ఇలా మీరు 15 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేయాలి. ఏడాదికి రూ. 60 వేల చొప్పున 15 ఏళ్లలో మీరు రూ. 9 లక్షలు ఇన్వెస్ట్ చేసినట్లు అవుతుంది. ప్రస్తుతం వడ్డీ రేటు 7.6 శాతంగా ఉంది. అంటే ఈ వడ్డీ రేటు ప్రకారం చూస్తే.. మీకు వడ్డీ రూపంలో రూ. 16.46 లక్షలు వస్తాయి. అంటే వడ్డీ, అసలు కలిగితే మీ చేతికి రూ. 25 లక్షలకు పైగా వస్తాయి. రిస్క్ ఉండదు. కచ్చితమైన రాబడి వస్తుంది.

ఎలక్ట్రిక్ స్కూటర్‌పై భారీ డిస్కౌంట్.. రూ.70,000 తగ్గింపు పొందండిలా!

అయితే మీరు ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి. వడ్డీ రేటు అనేది త్రైమాసికం చొప్పున మారుతూ ఉండొచ్చు. అందువల్ల వడ్డీ రేటు తగ్గితే.. మీకు వచ్చే రాబడి కూడా కాస్త తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ వడ్డీ రేటు పెరిగితే రాబడి కూడా పైకి చేరొచ్చు. అందువల్ల వడ్డీ రేటు ప్రకారం మీకు వచ్చే రాబడి కూడా మారుతుందని గుర్తించుకోవాలి. కాగా ఈ స్కీమ్‌లో చేరిన వారికి ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద ఏడాదికి రూ. 1.5 లక్షల వరకు పన్న ఆదా చేసుకోవచ్చు. మీరు ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ మెచ్యూరిటీ అమౌంట్ వస్తుంది.

First published:

Tags: Banks, Money, Schemes, Sukanya samriddhi yojana

ఉత్తమ కథలు