ఇటీవలి కాలంలో క్రిప్టో కరెన్సీ (Crypto Currency) వినియోగం బాగా పెరుగుతోంది. ఇప్పటికే కొన్ని దేశాలు క్రిప్టో కరెన్సీ వినియోగానికి అనుమతులు ఇచ్చాయి. అయితే భారత్ వంటి మరికొన్ని దేశాలు మాత్రం క్రిప్టోలను అధికారికంగా నియంత్రించాలని భావిస్తున్నాయి. క్రమంగా ప్రపంచమంతటా క్రిప్టో కరెన్సీ చలామణిలోకి వస్తోంది. ఇతర దేశాల్లో అనేక కంపెనీలు క్రిప్టోకరెన్సీని యాక్సెప్ట్ కూడా చేస్తున్నాయి. ఈ తరుణంలో బిట్‌కాయిన్ (Bit Coin), ఈథర్ వంటి క్రిప్టోకరెన్సీలు ఆల్-టైమ్ గరిష్ఠాన్ని తాకుతున్నాయి. ఈ నేపథ్యంలో క్రిప్టోకరెన్సీ ప్రపంచంలోకి అడుగుపెట్టడానికి ఇంతకంటే మంచి సమయం దొరకదని నిపుణులు చెబుతున్నారు. అయితే క్రిప్టోకరెన్సీలో ట్రేడింగ్ చేయడానికి ముందు మీరు నో యువర్ కస్టమర్(KYC) ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.
ZebPay వంటి క్రిప్టో ఎక్స్ఛేంజీలు పెట్టుబడిదారుల ఫండ్‌లను రక్షించడానికి మొదటి నుంచి కేవైసీ స్ట్రాటజీని అనుసరిస్తూ వస్తున్నాయి. క్రిప్టో ఎక్స్ఛేంజీలలో కేవైసీ వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చాలా సులభం. కానీ కేవైసీ ప్రక్రియను పూర్తి చేసేటప్పుడు మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. కేవైసీ ప్రక్రియలు చాలా ఎక్స్ఛేంజీలలో ఒకే రకంగా ఉంటాయి. కాబట్టి ఒక్క క్రిప్టో కేవైసీ ప్రాసెస్ తెలుసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ZebPay లో ఎలా కేవైసి వెరిఫికేషన్ పూర్తి చేయాలో చూద్దాం.
Home loan : హోమ్ లోన్ తీసుకున్న వ్యక్తి చనిపోతే.. రీపేమెంట్ బాధ్యత ఎవరిది? బీమా వర్తిస్తుందా?
స్టెప్ 1: డాక్యుమెంట్స్
క్రిప్టో ఎక్స్ఛేంజీలో ఒక అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మీరు కేవైసీ వెరిఫికేషన్ కోసం పాన్ కార్డు, అడ్రస్ ప్రూఫ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అడ్రస్ ప్రూఫ్ అంటే ఆధార్ కార్డు లేదా పాస్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్ ఇలా ఏదైనా కావచ్చు. ZebPay ఎక్స్ఛేంజీ వెరిఫికేషన్ కోసం ఒక చెక్కు లేదా బ్యాంకు స్టేట్‌మెంట్ కూడా అడుగుతుంది.
స్టెప్ 2: డాక్యుమెంటేషన్ తరువాత అనుసరించాల్సిన విధానం
అవసరమైన అన్ని డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేశాక ఈ క్రింది స్టెప్స్ ఫాలో అవ్వండి.
1. మీ క్రిప్టో ఎక్స్ఛేంజీ ప్లాట్‌ఫాం సెట్టింగ్స్‌లోకి వెళ్ళండి. వెరిఫై ఐడెంటిటీ (Verify Identity) లేదా కంప్లీట్ కేవైసీ (Complete KYC) అనే ట్యాబ్ ను సెలక్ట్ చేయండి.
2. తరువాత మీరు ఐడీ ప్రూఫ్ అప్‌లోడ్ చేయాలి. మీ ఫోన్ గ్యాలరీ లేదా ఫోన్ కెమెరా నుంచి పాన్ కార్డు ఫొటో తీసి పాన్ కార్డ్ డీటెయిల్స్ అప్‌లోడ్ చేయవచ్చు.
3. అడ్రస్ ప్రూఫ్ అప్‌లోడ్ చేయండి. మీరు అడ్రస్ ప్రూఫ్ గా ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్ ఇలా ఏదైతే అప్‌లోడ్ చేస్తున్నారో దాన్ని ఐడెంటిఫికేషన్ ఆప్షన్ గా సెలక్ట్ చేయాలి.
4. డాక్యుమెంట్ల ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్‌ల ఫొటోలు అప్‌లోడ్ చేయాలని గుర్తుంచుకోండి. ఒకవేళ ఆధార్ కార్డ్ అప్‌లోడ్ చేస్తే.. ఆ కార్డు ముందు, వెనుక ఫొటోలు తీసి ఆ రెండు ఫొటోలు అప్‌లోడ్ చేయాలి.
5. కేవైసీ వివరాలు సబ్ మిట్ చేశాక బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేసి వెరిఫై చేయాల్సి ఉంటుంది. మీ క్రిప్టో ఎక్స్ఛేంజీ సెట్టింగ్స్‌లో బ్యాంకింగ్ ఆప్షన్ సెలెక్ట్ చేసి అక్కడి ఇన్‌స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేస్తే సరిపోతుంది.
6. ఒక్కోసారి మీ బ్యాంకు వివరాలతో పాటు మీ బ్యాంక్ చెక్కు ఫొటో లేదా బ్యాంక్ స్టేట్‌మెంట్ జతపరచాల్సి ఉంటుంది. మీ పేరు, ఖాతా నంబర్, ఐఎఫ్ఎస్సీ (IFSC) కోడ్ స్పష్టంగా కనిపించేలా మీ పాన్ కార్డ్‌ని కూడా యాడ్ చేయండి. ఇందుకు పైన పేర్కొన్న స్టెప్స్ ఫాలో అయితే సరిపోతుంది.
అంతే, మీరు కేవైసీ వెరిఫికేషన్ దాదాపు పూర్తి చేసినట్లే. మీరు డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత మీ క్రిప్టో ఎక్స్ఛేంజీ కేవైసీ, బ్యాంక్ డీటెయిల్స్ అప్రూవ్ చేస్తుంది. ఆ తర్వాత మీరు మీ క్రిప్టోకరెన్సీలో ఇన్వెస్ట్‌మెంట్ జర్నీని ప్రారంభించవచ్చు.
Life Insurance: అసలు లైఫ్ ఇన్సూరెన్స్‌లు ఎన్ని రకాలు.. ఎప్పుడైనా ఆలోచించారా ?.. పూర్తి వివరాలు
స్టెప్ 3: కేవైసీ ఎందుకు అవసరం?
కేవైసీ అనేది బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్స్ వంటి ఆర్థిక లావాదేవీలతో సహా క్రిప్టోకరెన్సీలో కూడా తప్పనిసరి ప్రక్రియగా ఉంటుంది. కేవైసీ మిమ్మల్ని, మీ వివరాలను వెరిఫై చేస్తుంది. క్రిప్టో ఎక్స్ఛేంజ్ మొత్తం భద్రతకు కేవైసీ ఒక వెన్నెముకగా నిలుస్తుంది.
స్టెప్ 4: కేవైసీ రిజెక్షన్ రిస్క్ తగ్గించండి
కేవైసీ రిజెక్షన్ అనేది ఎప్పుడో ఒకసారి జరుగుతుంది. మీ కేవైసీ అప్లికేషన్ రిజెక్షన్ కాకుండా ఉండాలంటే ఈ క్రింది స్టెప్స్ ఫాలో అవ్వండి.
1. మీరు అప్‌లోడ్ చేసిన ప్రతి ఇమేజ్ క్లారిటీగా ఉందో లేదో నిర్ధారించుకోండి. ఇవి వివరాలు కనిపించకుండా అస్పష్టంగా ఉంటే కేవైసీ రిజెక్ట్ అవుతుంది.
2. మీరు పొందుపరిచిన ఫొటో ఐడీ, పాస్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్ వ్యాలిడిటీ ఎక్స్‌పైర్ అయి ఉండకూడదు. అందుకే ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం.
3. మీరు సమర్పించిన బ్యాంక్ డీటెయిల్స్ సరిగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి.
ఎలాంటి మోసాలు జరగకుండా అరికట్టేందుకు, మీ ఐడెంటిటీ పూర్తి స్థాయిలో తెలుసుకునేందుకే ఈ కేవైసీ ఫార్మాలిటీస్ పూర్తి చేయాల్సిందిగా క్రిప్టో ఎక్స్ఛేంజీలు అడుగుతుంటాయి.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cryptocurrency, KYC submissionsn