మీ ఇంటి వద్దే బంగారంపై రుణాలు పొందడం ఎలా?

మీ ఇంటి దగ్గరకే వచ్చి బంగారం కుదువపై రుణాలు అందజేసే కొత్త సేవలను మణప్పురం ఫైనాన్స్ ప్రారంభిస్తోంది. దీని ద్వారా తమ సేవలను మరింత విస్తరింపజేయాలని ఆ సంస్థ భావిస్తోంది.

news18-telugu
Updated: March 8, 2019, 7:47 PM IST
మీ ఇంటి వద్దే బంగారంపై రుణాలు పొందడం ఎలా?
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: March 8, 2019, 7:47 PM IST
వినియోగదారులకు అందిస్తున్న సేవలను మరింత విస్తృతం చేసే దిశగా మణప్పురం ఫైనాల్స్ చర్యలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా వినియోగదారులకు వారి ఇంటి దగ్గరే బంగారాన్ని కుదువపై తీసుకుని, రుణాలు అందజేస్తుంది. ఢిల్లీ, ముంబైలో 50కి పైగా ఉన్న తమ శాఖల్లో ఈ కొత్త సేవలను ఆ సంస్థ ప్రారంభించింది. చెన్నై, బెంగుళూరులో ఇప్పటికే అందిస్తున్న ఈ సేవలకు మంచి స్పందన లభిస్తుండడంతో దీన్ని ఢిల్లీ, ముంబైకి కూడా విస్తరించినట్లు ఆ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.

ప్రయాణ సమయంలో తమ బంగారు ఆభరణాల భద్రత, వాటిని కుదువపెట్టిన తర్వాత ఇచ్చే నగదు రుణాల భద్రత పట్ల ఆందోళన లేకుండా వినియోగదారులు ఈ సేవలను వినియోగించుకోవచ్చు. మణప్పురం ఫైనాన్స్ సిబ్బంది స్వయంగా వెళ్లి ఇంటి వద్దే వినియోగదారుల నుంచి కుదువ బంగారాన్ని తీసుకుంటారు. దానికి సంబంధించిన రుణాలను వారి బ్యాంక్ అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేస్తారు.

ఇంటి దగ్గరే బంగారంపై రుణం పొందడం ఎలా?

1.ఢిల్లీ, ముంబైలో ఈ సేవలను వినియోగించుకోవాలనుకునే వారు..ఆఫీస్ సమయాల్లో ముంబై-09072606215, ఢిల్లీ-09072606202 ఫోన్ నెంబర్లకు కాల్ చేయాలి.


2. మీ ఇంటికి సమీపంలోని మణప్పురం ఫైనాన్స్‌ శాఖకు చెందిన ఇద్దరు సిబ్బంది తగిన గుర్తింపు కార్డులతో వినియోగదారుల ఇళ్లకు చేరుకుంటారు.
3.వినియోగదారుల బంగార ఆభరణాల నాణ్యత, బరువు ఆధారంగా దాని విలువను లెక్కిస్తారు.
4.ఆ మేరకు సదరు రుణాన్ని వెంటనే నెఫ్ట్ లేదా ఐఎంపీఎస్ ద్వారా వినియోగదారుల బ్యాంక్ ఖాతాలోకి ట్రాన్స్‌ఫర్ చేస్తారు.
Loading...
5.మీ ఆభరణాలను సీల్ చేసి వారి వెంట తీసుకెళ్తారు.

ఈ సేవల కోసం ఢిల్లీ, ముంబైలోని తమ శాఖల్లో ప్రత్యేక సిబ్బందిని నియమించుకోనున్నట్లు ఆ సంస్థ తెలిపింది. తద్వారా నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. ముందు ముందు దేశంలోని మరిన్ని నగరాలకు ఈ సేవలను విస్తరించే యోచనలో ఉన్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు.
First published: March 8, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...