ఇంటర్నెట్‌లో షాపింగ్‌ చేస్తుంటే మోసపోయారా..అయితే ఇలా చేయండి ?

50 శాతం నుంచి ఏకంగా 90 శాతం వరకూ డిస్కౌంట్స్ ఇస్తామని ఫేక్ ఈ కామర్స్ సైట్స్ ఆఫర్లు ఇస్తున్నాయి. ఎవరైనా కస్టమర్లు ఈ ఆఫర్లను చూసి ఆకర్షితులైతే మాత్రం బురిడీ కొట్టినట్లే..

news18-telugu
Updated: March 23, 2019, 1:05 PM IST
ఇంటర్నెట్‌లో షాపింగ్‌ చేస్తుంటే మోసపోయారా..అయితే ఇలా చేయండి ?
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: March 23, 2019, 1:05 PM IST
ఈ-కామర్స్ షాపింగ్ సైట్లలో రోజు రోజుకి ఫేక్ వెబ్ సైట్ల సంఖ్య నానాటికి పెరిగిపోతున్నాయి. ఫలితంగా ఫేక్ ఆఫర్స్ ప్రకటించి కస్టమర్లను బురిడీ కొట్టించి డబ్బులు కొట్టేస్తున్న కేసులు ఈ మధ్యకాలం ఎక్కువవుతున్నాయి. ఇటీవల పీడబ్ల్యుసీ ఇండియా, నాస్కామ్ వెలువరించిందిన ఒక రిపోర్టులో ఈ కామర్స్ మోసాలు భారీగా పెరుగుతున్నాయి. 2022 నాటికి ఈ కామర్స్ షాపింగ్ బిజినెస్ 100 బిలియన్ డాలర్లకు చేరుకోనుంది. ముఖ్యంగా కస్టమర్లు ఎక్కువగా ఆఫర్లను చూసి ఎక్కువగా మోసపోతున్నట్లు తెలుస్తోంది. 50 శాతం నుంచి ఏకంగా 90 శాతం వరకూ తగ్గిస్తామని ఈ ఫేక్ షాపింగ్ సైట్స్ ఆఫర్లు ఇస్తున్నాయి. ఎవరైనా కస్టమర్లు ఈ ఆఫర్లను చూసి ఆకర్షితులైతే మాత్రం బురిడీ కొట్టినట్లే..ఈ ఫ్రాడ్ సైట్స్ ఎక్కువగా అన్ని రకాల పేమెంట్ ఆప్షన్లను వాడుకుంటున్నారు. అంతే కాదు యూపీఐ పద్ధతి ద్వారా కూడా ఈ ట్రాన్సాక్షన్లు జరుగడం గమనార్హం.

ఫేక్ సైట్ల మాయలో పడి డబ్బులు పోయాయా ? అయితే ఇలా చేయండి..

ముఖ్యంగా కస్టమర్ల అలసత్వమే మోసగాళ్ల పాలిట వరంగా మారుతోంది. బ్యాంకులు పలుమార్లు హెచ్చరికలు జారి చేస్తున్నప్పటికీ ఈ సైబర్ ఆగడాల ఉచ్చులో కస్టమర్లు పడుతూనే ఉన్నారు.

- ముందుగా మీరు విజిట్ చేసిన ఈ కామర్స్ షాపింగ్ సైట్ యూఆర్ఎల్ గమనించండి. ఒక సెక్యూర్ వెబ్ సైట్‌ యూఆర్ఎల్ ముందు ఒక లాక్ సింబల్ ఉంటుంది. అలాగే 'హెచ్‌టిటిపీఎస్'తో ప్రారంభమైందో లేదో చూసుకోండి.


- రివ్యూస్ పూర్తిగా చదివిన తర్వాతనే ఈ కామర్స్ వెబ్‌సైట్ ను విజిట్ చేయండి.
- సైబర్ మాయగాళ్లు ఈ మధ్యకాలంలో ఫేక్ కస్టమర్ కేర్ నెంబర్లను కూడా వాడుతూ బురిడీ కొట్టిస్తున్నారు. ఇలాంటి వాటిపై సైబర్ క్రైమ్ వారికి కంప్లైంట్ ఇవ్వండి.
- భారీ డిస్కౌంట్స్ ఆశలో పడకండి. అలాగే మీ పర్సనల్ డిటైల్స్ ముఖ్యంగా యూపీఐ పాస్‌వర్డ్, క్రెడిట్, డెబిట్ కార్డు డిటైల్స్ తొందరపడి ఇవ్వకండి.
- ఒక్కోసారి మీ ప్రమేయం లేకుండానే ఓటీపీ, పాస్‌వర్డ్ కనుక మీ మొబైల్ ఫోన్‌కు వస్తే వెంటనే మీ కార్డును బ్లాక్ చేయమని బ్యాంకు వారిని సంప్రదించండి.
- అలాగే ఫేక్ సైట్స్‌ను గుర్తిస్తే మాత్రం ట్రాయ్ అథారిటీకి ఫిర్యాదు చేయవచ్చు.
- నేషనల్ కన్జ్యూమర్ హెల్ప్‌లైన్ ను సంప్రదించండి. లేకపోతే నేషనల్ కన్స్యూమర్ హెల్ప్‌లైన్ వారి పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.
First published: March 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...