E-Aadhaar card డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారా.. ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి

యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యుఐడిఎఐ) జారీచేసే ఈ కీలకమైన డాక్యుమెంట్ ను కేవలం ఐడీ ప్రూఫ్ గానే కాకుండా ఇన్నో రకాల సేవలకు ఉపయోగించుకోవచ్చు.

news18-telugu
Updated: November 3, 2020, 10:10 PM IST
E-Aadhaar card  డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారా.. ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి
(ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ఆధార్ కార్డు ఇప్పుడు అన్నింటికి ఆధారంగా మారిపోయింది. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యుఐడిఎఐ) జారీచేసే ఈ కీలకమైన డాక్యుమెంట్ ను కేవలం ఐడీ ప్రూఫ్ గానే కాకుండా ఇన్నో రకాల సేవలకు ఉపయోగించుకోవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందాలంటే ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాల్సిందే. అంతటి ప్రాధాన్యత ఉన్న ఈ కార్డు ఆధార్ లెటర్, ఈ–ఆధార్, పీవీసీ కార్డు వంటి మూడు రకాలుగా అందుబాటులో ఉంది. ప్రజలు తమకు ఏది సౌకర్యంగా ఉంటే దాన్ని ఉపయోగించుకోవచ్చు. అయితే, ఈ మూడింటిలో కెల్లా ఈ–ఆధార్లో ఎక్కువ సమాచారం ఉంటుంది. అందువల్ల దీన్ని ఎక్కువ మంది ఈ–ఆధార్ను డౌన్లోడ్ చేసుకోవడానికి ప్రాధాన్యతనిస్తారు. స్వయంగా ఆధార్ అధికారిక వెబ్‌సైట్ - uidai.gov.in through ద్వారా లేదా mAadhaar మొబైల్ యాప్ ద్వారా దీన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీరు కూడా మీ ఈ–ఆధార్ను డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే, ఈ స్టెప్స్ను ఫాలో అవ్వండి.

ఆధార్ నెంబర్ ద్వారా..

స్టెప్ 1: ఆధార్ అధికారిక వెబ్‌సైట్‌ -uidai.gov.in ను సందర్శించండి.

స్టెప్ 2: 'మై ఆధార్' ఆప్షన్ లోకి వెళ్లి ‘డౌన్‌లోడ్ ఆధార్’ పై క్లిక్ చేయండి.

స్టెప్ 3: 'ఐ హావ్' సెక్షన్ కింద ఉన్న 'ఆధార్' ఆప్షన్ను ఎంచుకోండి.

స్టెప్ 4: ఇప్పుడు, మీ 12- అంకెల ఆధార్ సంఖ్యను ఎంటర్ చేయండి.

స్టెప్ 5: క్యాప్చా వెరిఫికేషన్ కోడ్‌ను ఎంటర్ చేయండి. ఆ తర్వాత, వన్ టైమ్ పాస్‌వర్ట్ పొందడానికి 'సెండ్ OTP' ఆప్షన్పై క్లిక్ చేయండి.

స్టెప్ 6: మీరు రిజిస్టర్ మొబైల్ కు అందుకున్న OTP ని ఎంటర్ చేయండి.

స్టెప్ 7: 'వెరిఫై అండ్ డౌన్‌లోడ్' ఆప్షన్ పై క్లిక్ చేసి, మీ ఆధార్ ఎలక్ట్రానిక్ కాపీని డౌన్‌లోడ్ చేసుకోండి.

వర్చువల్ ఐడి ద్వారా..

దశ 1: UIDAI ఆన్‌లైన్ పోర్టల్‌ను సందర్శించండి.

దశ 2: 'డౌన్‌లోడ్ ఆధార్' పై క్లిక్ చేయండి.

దశ 3: 'ఐ హావ్' సెక్షన్  కింద ఉన్న వర్చువల్ ఐడి ఆప్షన్ను ఎంచుకోండి.

దశ 4: వర్చువల్ ఐడి, పూర్తి పేరు, పిన్ కోడ్, సెక్యూరిటి కోడ్‌ను ఎంటర్ చేయండి.

దశ 5: OTP ని జెనరేట్ చేయడానికి ‘సెండ్ OTP’పై క్లిక్ చేయండి.

దశ 6: OTPని ఎంటర్ చేసి, ఈ–ఆధార్ ను డౌన్‌లోడ్ చేసుకోండి.

ఎన్ రోల్మెంట్ నెంబర్ (EID)  ద్వారా..

దశ 1: UIDAI అధికారిక వెబ్‌సైట్‌ uidai.gov.in ను సందర్శించండి. -

దశ 2: 'డౌన్‌లోడ్ ఆధార్' ఆప్షన్ పై క్లిక్ చేయండి.

దశ 3: క్రొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ, ఎన్ రోల్మెంట్ ID నెంబర్, 14 -అంకెల సమయం, తేదీ విలువలను ఎంటర్ చేయండి.

దశ 4: పూర్తి పేరు, పిన్ కోడ్, క్యాప్ చా ఇమేజ్ కోడ్‌ను ఎంటర్ చేయండి.

దశ 5: OTP ను జెనరేట్ చేయడానికి 'రిక్వెస్ట్ OTP' పై క్లిక్ చేయండి.

దశ 7: 'నిర్ధారించండి' ఆప్షన్పై క్లిక్ చేయండి.

దశ 8: OTP ఎంటర్ చేసి, 'డౌన్‌లోడ్ ఆధార్' ఆప్షన్ పై క్లిక్ చేసి ఈ–ఆధార్ ను డౌన్ లోడ్ చేసుకోండి.
Published by: Krishna Adithya
First published: November 3, 2020, 10:10 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading