Demanding boss:  బాస్‌ను డీల్‌ చేయడం ఓ ఆర్ట్‌... ఎలా చేయాలో తెలుసుకోండి మరి!

ఉద్యోగాలు చేస్తున్న యువత మాట. పని చేయడం ఒకెత్తయితే... బాస్‌ను డీల్‌ చేయడం మరో ఎత్తు అంటున్నారు. ఈ రోజు ఈ విషయంలో మీకు కొన్ని టిప్స్‌ చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. వాటిని ట్రై చేసి చూడండి.

ఉద్యోగాలు చేస్తున్న యువత మాట. పని చేయడం ఒకెత్తయితే... బాస్‌ను డీల్‌ చేయడం మరో ఎత్తు అంటున్నారు. ఈ రోజు ఈ విషయంలో మీకు కొన్ని టిప్స్‌ చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. వాటిని ట్రై చేసి చూడండి.

  • Share this:
‘బాస్‌లు పలు రకములు... ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్‌’.. కరోనా ముందు వరకు చాలామంది ఉద్యోగులు ఇలానే అనుకునేవారు. కరోనా పరిస్థితుల తర్వాత ‘బాస్‌లు చాలా చాలా రకరకమలు.. ఒక్కొక్కరిది రకరకాల స్టైల్‌’ అని అనుకుంటున్నారట. ఇది మేమంటున్నది కాదు. ఉద్యోగాలు చేస్తున్న యువత మాట. పని చేయడం ఒకెత్తయితే... బాస్‌ను డీల్‌ చేయడం మరో ఎత్తు అంటున్నారు. ఈ రోజు ఈ విషయంలో మీకు కొన్ని టిప్స్‌ చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. వాటిని ట్రై చేసి చూడండి.

ముందుగా చెప్పినట్లు బాస్‌ల వ్యక్తిత్వాలు, వారి ఆలోచనలు రకరకాలుగా ఉంటాయి. అందులో కొందరైతే ఉద్యోగుల డైలీలైఫ్‌లో ఒత్తిడిని పెంచేస్తుంటారు. వారిని డిమాండింగ్‌ బాస్‌ అని అనొచ్చు. మీలో చాలామంది లాంటి బాస్‌లను చూసే ఉంటారు. ఊరికే కోపమవ్వడం, వ్యంగ్యంగా మాట్లాడటం, మీటింగ్స్‌లో రిమార్క్‌లు చేయడం లాంటివి చేస్తుంటారు. ఉద్యోగుల జీవితంలో వీళ్లు కలలోకి కూడా వస్తుంటారట. వీళ్లొక రకం అయితే ఇంకొందరు.. మీరు ఏ క్షణం ఏం చేస్తున్నారు అనేది చెక్‌ చేస్తూనే ఉంటారు. ఆఖరికి చిన్న టీ బ్రేక్‌కి వెళ్లినా ‘పని మానేసి ఏం చేస్తున్నారు’ అనేది ఆలోచిస్తుంటారు.

ఇలాంటి బాస్‌ల దగ్గర పని చేసేటప్పుడు విధిలో వైఫల్యం చెందామా అనే భావన కలుగుతుంది. విధి, పని విషయంలో ఆలోచనలు చెప్పినా, సూచనలు చేసినా ఇలాంటి బాస్‌లు అస్సలు స్వీకరించారు. అంతే కాకుండా ఆలోచన లేదా పనిని తక్కువ చేసి మాట్లాడటం లాంటివి చేస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో లేదా ఇలాంటి బాస్‌ల దగ్గర ఏం చేయాలో చూద్దాం!

* ముందుగా మనసు, శరీరం స్థిమితం చేసుకోవాలి. ఈ రెండూ కూల్‌ అండ్‌ కామ్‌గా ఉన్నప్పుడే మీరు బయటివారికి మిస్టర్ పర్‌ఫెక్ట్‌గా కనిపిస్తారు. ఐదు నిమిషాల సేపు ప్రశాంతంగా ఉండి... ఏం జరుగుతోందనేది ఆలోచించుకోవాలి.

* బాస్‌కి బాస్‌ ఇజం చూపించడానికి తేడాను ముందుగా గమనించుకోవాలి. మంచి బాస్‌ ఎప్పుడూ తన టీమ్‌కి అవసరమైనప్పుడు నిర్మాణాత్మకమైన సూచనలు ఇచ్చి ముందుకెళ్లేలా చూస్తాడు. బాస్‌ ఇజం చూపించేవాడు ఎప్పుడూ అంతా తన కంట్రోల్‌లో ఉండాలని అనుకుంటాడు.

* ఆచరణ సాధ్యం కాని డెడ్‌లైన్స్‌, అంచనాలు ఇస్తున్నప్పుడు మీలోని నిపుణుడు బయటకు వస్తాడనే విషయం గుర్తించాలి. ఇలాంటి సందర్భాన్ని ఎలా అధిగమించాలో మీకు మీరు అసెస్‌ చేసుకొని.. దానికి తగ్గట్టుగా సమయం కేటాయించుకుంటూ ముందుకెళ్లాలి. ప్రాజెక్టును పార్టులుగా విభజించుకుంటూ సాధించాలి.

* ఎక్కువగా మేనేజ్‌మెంట్‌ కల్చర్‌కు తగ్గట్టే బాస్‌లు నడుచుకుంటారు. బాస్‌ అప్రోచ్‌, స్టైల్‌ను అర్థం చేసుకోవడం ప్రారంభిస్తే మంచి స్పందన రావొచ్చు. అందుకే బాస్‌ స్టైల్‌ను క్షుణ్నంగా చదివితే లాభం ఉంటుంది. అప్పుడే అతని ఆలోచనలు, పని విధానం అర్థమైపోతుంది.

* బాస్‌ ఎదుర్కొంటున్న ఛాలెంజెస్‌ ఏంటి? ఆ రోల్‌లో ఆయన పనేంటి అనే విషయాలను తెలుసుకోవాలి. అప్పుడే ఆయన అలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు అనే విషయం తెలుస్తుంది. దాని బట్టి మీరు ఎలా ఉండాలి అనేది కూడా తెలుసుకోవచ్చు.

* అలాంటి బాస్‌తో ఏదైనా విషయం మీద చర్చించాలి అనుకున్నప్పుడు ముందు మీకు మీరు ట్రయల్‌ రన్‌ చేసుకోండి. అప్పుడు అందులో సమస్యలు లేనివి, ఆయనకు నచ్చనివి తీసేయొచ్చు. సాధ్యమవుతాయనుకునేవి మాత్రమే చూసుకొని చర్చకు రావడం మంచిది.
Published by:Krishna Adithya
First published: