బీమా కంపెనీల సేవల్లో లోపాలు తలెత్తినప్పుడు బీమా పాలసీదారులు కంపెనీలపై ఫిర్యాదు చేయాలనుకోవడం సహజం. పాలసీదారులు పాలసీ కొనుగోలు ప్రక్రియ, క్లెయిమ్ ప్రాసెస్, చిరునామా మార్చడం, సంప్రదింపుల వివరాలు, నామినీలు, పన్ను ఆదా సర్టిఫికేట్ అందించడం, చెల్లింపు పద్దతి మార్పులు ఇలా అనేక అభ్యర్థనలపై ఫిర్యాదు చేయవచ్చు. బీమా కంపెనీలపై ఫిర్యాదు చేసేందుకు ఉన్న ఆరు మార్గాలను చూడండి.
ఐఆర్డీఏకు ఎలా ఫిర్యాదు చేయాలి
టోల్ ఫ్రీ నెంబరు 155255, 18004254732కు కాల్ చేయడం, @irda.gov.in కు మెయిల్ చేయడం ద్వారా పాలసీదారులు ఫిర్యాదు చేయవచ్చు. ఇవి కాకుండా ఇంటిగ్రేటెడ్ గ్రీవెన్స్ సెల్ (IGS) ద్వారా కూడా ఆన్ లైన్లో ఫిర్యాదు చేయవచ్చు.
ఐఆర్డీఏఐలో ఐజీఎంఎస్ సదుపాయం
ఐజీఎంఎస్ (IGMS) పాలసీదారులకు కేంద్రీకృత, ఆన్ లైన్ సేవలు అందిస్తుంది. పాలసీదారుల ఫిర్యాదులకు పర్యవేక్షించడానికి ఐఆర్డీఏఐ దీన్ని ఏర్పాటు చేసింది. పాలసీదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులను ఐజీఎంఎస్ వివిధ విభాగాలుగా విభజిస్తుంది. ఫిర్యాదుదారులకు ఐడీ నెంబరు కేటాయిస్తుంది. వాటిని ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తుంది. బీమా కంపెనీలు ఫిర్యాదులపై తీసుకున్న నిర్ణయాలను కూడా ఎప్పటికప్పుడు వెల్లడిస్తుంది.
ఐజీఎంఎస్ ఎలా ఉపయోగించాలి
ఐజీఎంఎస్ డాట్ ఐఆర్డీఏ డాట్ గవ్ డాట్ ఇన్ (irda.gov.in) వెబ్ సైట్ ద్వారా పాలసీదారులు వివరాలు నమోదు చేసి ఫిర్యాదులు చేయవచ్చు. ఇందుకు బీమా పాలసీలో ఉండే వివరాలను అందించాలి. పాలసీ పత్రాలను దగ్గర పెట్టుకుని పాలసీ నెంబరు, బీమాదారు పేరు, ఫిర్యాదుదారు సంప్రదింపుల వివరాల ద్వారా ఈ వ్యవస్థను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. ఫిర్యాదు చేసిన 15 రోజుల్లో బీమా కంపెనీ పరిష్కరించకుంటే నేరుగా ఐఆర్డీఏఐకు ఫిర్యాదు చేయవచ్చు.
ఐఆర్డీఏఐకు లేఖ ద్వారా ఫిర్యాదు
ఆన్ లైన్ ద్వారా మీరు ఫిర్యాదు చేయలేకపోతే ఫిర్యాదు వివరాలతో ఐఆర్డీఏఐకి లేఖ ద్వారా కంప్లైంట్ ను ఈ చిరునామాకు పంపవచ్చు.
జనరల్ మేనేజర్
కన్జ్యూమర్ అఫైర్స్ డిపార్టుమెంట్, గ్రీవెన్స్ రిడ్రెసల్ సెల్
ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI )
స్ట్రీట్ నెంబర్ 115/1, ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్, నానక్‌రామ్ గూడ
గచ్చిబౌలి, హైదరాబాద్ - 500032
అంబుడ్స్‌మన్‌లో ఫిర్యాదు
ఫిర్యాదుపై బీమా కంపెనీ స్పందించిన తీరుకు మీరు సంతృప్తి చెందకపోతే ఇన్సూరెన్స్ అంబుడ్స్ మన్ కు ఫిర్యాదు చేయవచ్చు. కోర్టుల బయట మీ ఫిర్యాదులను పరిష్కరించడానికి కేంద్రం అంబుడ్స్ మన్ ను ఏర్పాటు చేసింది.
చివరగా సివిల్ కోర్టు
ఇన్ని రకాలుగా ఫిర్యాదులు చేసినా మీ సమస్య పరిష్కారం కాకుంటే చివరగా వినియోగదారుల ఫోరం, సివిల్ కోర్టులో కేసు వేయవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Insurence, Irdai, Shocking complaint