Tax Calculator: ఇన్‌కం ట్యాక్స్‌ను(Income tax) ఫైల్ చేసే ప్రక్రియను సులువుగా మార్చడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. చాలా మందికి ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్(ITR) దాఖలు చేయడంపై అవగాహన ఉండదు. ఎక్కువ శాతం నిపుణుల సాయంతో ఫైల్ చేస్తారు. మొదటిసారి ఫైల్ చేస్తున్న వారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. వారికి పాత, కొత్త పన్ను విధానాలను సెలక్ట్ చేసుకోవడమే పెద్ద సమస్యలా అనిపిస్తుంది. ఇలాంటి వారికి సాయం చేసేలా కేంద్ర ప్రభుత్వం కొన్ని సంస్కరణలు తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉంది. కామన్ ఐటీఆర్ ఫారం వంటివి ప్రకటించింది. ఈ ప్రయత్నాల్లో భాగంగానే ట్యాక్స్ క్యాలిక్యులేటర్‌ను తీసుకొచ్చింది.
పన్ను విధానాన్ని సెలక్ట్ చేసుకోవడంలో క్యాలిక్యులేటర్ సహాయపడుతుంది. రెండు విధానాల్లో దీని ద్వారా పన్ను ఎంతనేది లెక్కించవచ్చు. పాత పన్ను విధానంలో ట్యాక్స్ లెక్కిస్తున్నప్పుడు డిడక్షన్‌లు, ఎగ్జమ్షన్స్ కూడా అప్లై చేయవచ్చు. ట్యాక్స్ క్యాలిక్యులేటర్‌ని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు చూద్దాం.
* ఆదాయ పన్ను క్యాలిక్యులేటర్‌ను ఎందుకు ఉపయోగించాలి?
ఆదాయ పన్నును లెక్కించడం వలన ఆర్థిక స్థితిని అదుపులో ఉంచుకోవచ్చు. ఎంత పన్ను చెల్లించాలనే అంశంపై స్పష్టత ఉంటే.. ఖర్చులను, పొదుపును మేనేజ్ చేసుకోవచ్చు. కొత్త పన్ను విధానం ఎంచుకునే వారి ఆదాయం రూ. రూ.7 లక్షల లోపు ఉంటే వారికి రాయితీ లభిస్తుంది. బడ్జెట్ 2023 ప్రకటన ప్రకారం.. పాత పన్ను విధానంలో భాగమైన రూ.50,000 స్టాండర్డ్ డిడక్షన్‌ను కూడా కొత్త పన్ను విధానంలో పొందవచ్చు.
అదే విధంగా పాత పన్ను విధానంలో అందుబాటులో ఉన్న రూ.2.5 లక్షల ట్యాక్స్ ఎగ్జమ్షన్ లిమిట్‌ను రూ.3 లక్షలకు పెంచారు. కొత్త పన్ను విధానాన్ని ఎంచుకునే వారి ఆదాయం రూ.7 లక్షలలోపు రూ.33,800 ఆదా అవుతుంది. వార్షిక ఆదాయం రూ.10 లక్షల వరకు ఉంటే, రూ.23,400 సేవ్ అవుతుంది. సంవత్సరానికి రూ.15 లక్షల వరకు సంపాదిస్తున్న వ్యక్తులకు రూ.49,400 వరకు ఆదా చేసే అవకాశం ఉంటుంది.
Unacademy Layoffs: మరోసారి అన్‌అకాడమీ లేఆఫ్స్..380 మంది ఉద్యోగులపై వేటు..!
* ఇన్‌కం ట్యాక్స్ క్యాలిక్యులేటర్‌ని ఎలా ఉపయోగించాలి?
ముందుగా ఆదాయ పన్నుశాఖ అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి. ‘క్విక్ లింక్స్’లో ఇన్‌కం ట్యాక్స్ క్యాలిక్యులేటర్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అనంతరం బేసిక్ క్యాలిక్యులేటర్, అడ్వాన్స్‌డ్ క్యాలిక్యులేటర్ అనే రెండు ఆప్షన్‌లు కనిపిస్తాయి. వీటి రెండింటి ద్వారా ట్యాక్స్‌ను క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు.
క్యాలిక్యులేటర్ ఉపయోగించే సమయంలో.. ట్యాక్స్ పేయర్ టైప్, మేల్/ ఫీమేల్/ సీనియర్ సిటిజన్ / సూపర్ సీనియర్ సిటిజన్, రెసిడెన్షియల్ స్టేటస్ వంటి వివరాలను ఎంటర్ చేయాలి. అదే విధంగా శాలరీ కాకుండా పొందే ఇన్‌కం, స్పెషల్ రేట్ ఇన్‌కం వివరాలు పొందుపరచాలి. సెల్ఫ్-ఆక్యుపైడ్ హౌస్ ప్రాపర్టీపై వడ్డీ, ఇన్‌కం ఫ్రమ్ సెల్ఫ్ ఆక్యుపైడ్ హౌస్ ప్రాపర్టీ, గ్రాస్ టోటల్ ఇన్‌కం, లెస్ ఎలిజిబుల్ ఇన్‌కం, టోటల్ ఇన్‌కం ఎంటర్ చేయాలి.
ఈ ట్యాక్స్ క్యాలిక్యులేటర్‌పై ఐటీ శాఖ పూర్తిగా ఆధారపడకూడదని స్పష్టం చేసింది. పన్ను చెల్లింపుదారులకు బేసిక్ ట్యాక్స్ క్యాలిక్యులేషన్‌ను వేగంగా, సులభంగా అందించే ఉద్దేశంతో తీసుకొచ్చినట్లు స్పష్టం చేసింది. రిటర్న్‌లను ఫైల్ చేసేటప్పుడు సంబంధిత చట్టాలు, నియమాలు మొదలైన వాటినే అనుసరించాలని పేర్కొంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Income tax, ITR, Taxes