Home /News /business /

HOW TO BUY RESALE FLAT RESALE PROPERTY RESALE FLAT 2BHK AND 3BHK FLAT IN RESALE MK

Resale Flats Buying: రీసేల్ అపార్ట్ మెంట్ ఫ్లాట్ కొంటున్నారా...తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే...

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

మార్కెట్‌ విలువలో తక్కువ ధరకు మంచి లొకేషన్ లో పాత ఫ్లాట్ లభిస్తున్నపుడు రీసేల్‌ Flat కొనుగోలు చేసేందుకు నిర్ణయం తీసుకోవడం సహజం. రీసేల్‌ Flat విషయంలో ముందుగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి.

  కొత్త Flat ధరలు చూసి బేజారు అవుతున్నారా...అయితే మార్కెట్‌ విలువలో తక్కువ ధరకు మంచి లొకేషన్ లో పాత ఫ్లాట్  లభిస్తున్నపుడు రీసేల్‌ Flat కొనుగోలు చేసేందుకు నిర్ణయం తీసుకోవడం సహజం. రీసేల్‌ Flat విషయంలో ముందుగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి.. ఆ వివరాలు తెలుసుకుందాం. రీసేల్‌ యూనిట్స్‌ అంటే పాతవే కాదు, ఒక్కోసారి కొత్తగా నిర్మాణంలో ఉన్న ఫ్లాట్‌ను ఓ వ్మక్తి కొనుగోలు చేసి అది పూర్తయిన తర్వాత విక్రయానికి పెడుతుంటారు. అప్పుడు కూడా అది రీసేల్‌ ప్లాటే అవుతుంది. కొన్ని సార్లు బిల్డర్‌ తన వద్ద కొన్ని ఫ్లాట్స్ ఉంచుకొని ధర పెరిగిన తర్వాత విక్రయానికి పెట్టినా అది రీసేల్‌ ప్లాట్ కిందే లెక్క. ఇలాంటి ప్లాట్స్ కొనేముందు అన్ని వివరాలు తెలుసుకోవాలి. న్యాయ నిపుణులను సంప్రదించాలి. పాత అపార్ట్‌మెంట్‌ కొనేముందు చట్టపరమైన ప్రక్రియలను కూడా పూర్తి చేసుకోవాలి. ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంట్లను రిజిస్ట్రేషన్‌ రికార్డుల్లో సరిగ్గా నమోదు చేశారా, పేరు, ఇతర వివరాలు సరిగానే ఉన్నాయా? అన్నవి పరిశీలించాలి. రీసేల్‌ Flat టైటిల్‌ డీడ్‌ను చాలా స్పష్టంగా రాసుకోవాలి. కొనుగోలు ఒప్పందం, సేల్‌డీడ్, అపార్ట్‌మెంట్‌ సొసైటీ నుంచి ఎన్వోసీ, బిల్డర్‌–బయ్యర్‌ అగ్రిమెంట్‌ కాపీ అప్పటివరకు ఆ ఫ్లాట్‌కు యజమానులుగా వ్యవహరించిన వారి వివరాలు తెలియజేసే డాక్యుమెంట్లు అన్ని అవసరం. ముందుగా ఆ ఫ్లాట్‌ను యజమాని ఎందుకు అమ్ముతున్నారు అనే అంశాన్ని తెలుసుకోవాలి. చట్టపరమైన సమస్యలేవైనా ఉంటే వదిలించుకునేందుకు ఆ ఫ్లాట్‌ను విక్రయిస్తున్నారా..? లేక కన్ స్ట్రక్షన్ లో లోపాల వల్ల వదలించుకుంటున్నారా.. అనే కారణాలు తెలుసుకోవాలి.

  లోన్ ఉందా లేదా క్లియర్ అయ్యిందా తెలుసుకోవాలి...

  కొనుగోలు చేయబోతున్న Flat లేదా ఇంటిపైన రుణాలు ఏవైనా ఉన్నాయా, లేదా..? అన్న అంశం కూడా చూడాలి. బ్యాంకు నుంచి తీసుకున్న ఎన్వోసీ పత్రాన్ని తీసుకోవాలి. ఒకవేళ కొనుగోలు చేస్తున్న Flat బ్యాంకు తనఖాలో ఉంటే మాత్రం.. దానిపై ఉన్న రుణం మొత్తాన్ని తీర్చేసిన తర్వాత Flat డాక్యుమెంట్లను స్వాధీనం చేసేందుకు సమ్మతి పొందుతూ బ్యాంకు నుంచి ఆమోదాన్ని పొందాల్సి ఉంటుంది.

  రీసేల్ ఫ్లాట్ కు ఇలా లోన్ పొందాలి....

  రీసేల్‌ ఫ్లాట్‌/ఇంటికి బ్యాంకులు, ఆర్థిక సంస్థలు రుణాలిస్తున్నాయి. రుణాన్ని ఇచ్చే ముందు సాంకేతికపరంగా ఆ భవనం నాణ్యతను పరిశీలిస్తారు. భవనం స్థితిగతులను పరిశీలించిన తర్వాత సంబంధిత ఆస్తి కొనుగోలుకు ఎంత ఇవ్వాలన్నది బ్యాంక్‌ అధికారులు నిర్ణయిస్తారు. ఈ రుణం సేల్‌ డీడ్‌ విలువ కంటే మించకుండా ఉంటుంది.

  ఈ జాగ్రత్తలు పాటించాలి...

  15 ఏళ్ల వయసున్న రీసేల్‌ ఫ్లాట్‌ను కొనుగోలు చేస్తున్నట్టయితే పై అంతస్తునే ఎంచుకోవడమే నయం. అపార్ట్‌మెంట్‌ను నిర్మించి కొన్నేళ్లయితే డ్రైనేజీపరంగా లీకేజీలు చోటు చేసుకోవచ్చు. కింద ఫ్లోర్‌ నిర్మాణంలో మార్పులు జరగవచ్చు. పై అంతస్తులో కింద అంతస్తు మీద వెలుతురు వచ్చే అవకాశం ఉంది. ఏడాది నుంచి ఐదేళ్ల వయసున్న ఫ్లాట్‌ను కొనడం వల్ల ధర, విలువపరంగా ప్రయోజనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. రీసేల్‌ Flat విషయంలో మెయింటెనెన్స్‌ చార్జీలు గురించి వాకబు చేయాలి. నిర్మాణపరమైన నాణ్యత కూడా కీలకమే. ఎక్కడైనా నిర్మాణంలో నెర్రులు బారి ఉన్నాయేమో చూడాలి. రిజిస్టర్‌ డాక్యుమెంట్లలో ఉన్న ప్లాన్‌ ప్రకారమే Flat నిర్మించారా లేదా..? అన్నది చెక్‌ చేయాలి. పాతది అయితే ఎలక్ట్రికల్‌ వైరింగ్, ప్లంబింగ్‌ వంటి అంశాలు పరిశీలించుకోవాలి. నిర్మాణపరమైన మార్పులు చేయించాల్సి ఉంటే ఆ బడ్జెట్‌ను పరిగణనలోకి తీసుకోవాలి. ఇక అపార్ట్‌మెంట్‌ సొసైటీ నిబంధనలు ఏంటన్నదీ తెలుసుకోవాలి.

  పన్ను ప్రయోజనాలు ఉన్నాయి...

  రీసేల్‌ ఫ్లాట్‌పైనా పన్నుపరమైన ప్రయోజనా లున్నాయి. రుణం తీసుకుని రీసేల్‌ Flat కొనుగోలు చేస్తే (మొదటిసారి సొంతింటి కొనుగోలు), తిరిగి చేసే వాయిదాల చెల్లింపులో సెక్షన్‌ 80సీ కింద ఏడాదిలో రూ.లక్ష మినహాయింపు, వడ్డీ రూపంలో చెల్లింపులపై గరిష్టంగా రూ.1.5 లక్షల వరకూ ఆదాయ పన్ను చెల్లించే పనిలేదు.
  Published by:Krishna Adithya
  First published:

  Tags: Real estate

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు