Ola electric scooters: నేటి నుంచి ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలు ప్రారంభం.. ఆన్​లైన్​లో ఇలా కొనుగోలు చేయండి..

ప్రతీకాత్మక చిత్రం

భారత మార్కెట్​(Indian Market)లో ఎలక్ట్రిక్​ వాహనాల(Electric Vehicles) హవా మొదలైంది. ప్రభుత్వాలు కూడా ఈ–వెహికిల్స్​పై సబ్సిడీలు(Subsidy) ఇస్తుండటంతో వీటికి మంచి డిమాండ్​ ఏర్పడనుంది. ఈ మార్కెట్​ను క్యాష్ చేసుకోవడంలో క్యాబ్​ సర్వీసుల సంస్థ ఓలా ఇతర సంస్థల కంటే ముందుంది. ఓలా ఇటీవలే ఎలక్ట్రిక్​ వాహన రంగంలోకి అడుగుపెట్టి.. తన తొలి ఈ–వెహికిల్​ను లాంచ్​ చేసింది.

  • Share this:
భారత మార్కెట్​(Indian Market)లో ఎలక్ట్రిక్​ వాహనాల(Electric Vehicles) హవా మొదలైంది. ప్రభుత్వాలు కూడా ఈ–వెహికిల్స్​పై సబ్సిడీలు(Subsidy) ఇస్తుండటంతో వీటికి మంచి డిమాండ్​ ఏర్పడనుంది. ఈ మార్కెట్​ను క్యాష్ చేసుకోవడంలో క్యాబ్​ సర్వీసుల సంస్థ ఓలా ఇతర సంస్థల కంటే ముందుంది. ఓలా ఇటీవలే ఎలక్ట్రిక్​ వాహన రంగంలోకి అడుగుపెట్టి.. తన తొలి ఈ–వెహికిల్​ను లాంచ్​ చేసింది. కంపెనీ ఎంట్రీ లెవల్ S1 వేరియంట్​ను రూ. 99,999 వద్ద, టాప్-ఎండ్ S1 ప్రో ట్రిమ్ వేరియంట్​ను రూ. 1,29,999 వద్ద గత నెలలో విడుదల చేసింది. జులై నెలలోనే రూ. 499 వద్ద ప్రీబుకింగ్స్​ను ప్రారంభించింది. ఇప్పటికే బుకింగ్​ చేసుకున్న కస్టమర్లు నేటి నుంచి వెబ్​సైట్​లో ఈ–స్కూటర్​ను కొనుగోలు చేయవచ్చు.

Ola Electric Bikes: రూ.499కే ఓలా ఎలక్ట్రిక్ బైక్.. బుకింగ్స్ ప్రారంభం.. పూర్తి వివరాలిలా..


ఈ రోజు నుండి, కస్టమర్లు ఓలా అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఎస్ 1, ఎస్ 1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేయవచ్చు. మొత్తం ఒకేసారి చెల్లించి లేదా ఈఎంఐ ఆప్షన్ల ద్వారా కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇందుకోసం ఓలా పలు బ్యాంక్​లతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ–స్కూటర్ల డెలివరీలు అక్టోబర్​ నుంచి ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది. భారతదేశంలో ఓలా ఎస్ 1, ఎస్ 1 ప్రో లిమిటెడ్​ స్టాక్​ మాత్రమే ఉందని.. ప్రీబుకింగ్​ చేసుకున్న వారికి ఫస్ట్​ ప్రిఫరెన్స్​ ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఓలా ఈ–స్కూటర్లను ఎలా కొనుగోలు చేయాలో తెలుసుకుందాం.

ఓలా ఈ–స్కూటర్లను ఇలా కొనుగోలు చేయండి

1. మీరు ఇప్పటికే ఓలా ఈ–స్కూటర్​ను ప్రీబుకింగ్​ చేసుకోకపోతే ఓలా ఎలక్ట్రిక్ అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లి, ప్రీబుకింగ్ చేసుకోండి. ఎందుకంటే రిజర్వేషన్ చేసుకున్న వ్యక్తులు మాత్రమే ఓలా ఎస్ 1ను కొనుగోలు చేయగలరు.

Ola Electric Bikes: రూ.499కే ఓలా ఎలక్ట్రిక్ బైక్.. బుకింగ్స్ ప్రారంభం.. పూర్తి వివరాలిలా..


2. మీరు S1, S1 ప్రో అనే రెండు వేరియంట్ల మధ్య దేన్నైనా ఎంచుకోవచ్చు. మీకు మొత్తం 10 కలర్ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి.

3. ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి, టాటా క్యాపిటల్‌తో సహా వివిధ బ్యాంకుల సహకారం ద్వారా ఈఎంఐ విధానంలో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్​ను కొనుగోలు చేయవచ్చు. ఓలా S1 ఈఎంఐలు రూ. 2,999 నుండి, S1 ప్రో ఈఎంఐలు రూ. 3,199 వద్ద ప్రారంభమవుతాయి.

4. ఈఎంఐ కాకుండా మొత్తం ఒకేసారి చెల్లించే కస్టమర్లు ఓలా ఎస్ 1 కోసం రూ. 20,000 చెల్లించాలి. లేదా ఓలా ఎస్ 1 ప్రో కోసం రూ. 25,000 అడ్వాన్స్‌గా చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత స్కూటర్ ఇన్‌వాయిస్ టైమ్​లో మిగిలిన మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.

5. కస్టమర్లు తమ ఓలా ఎస్ 1 ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఓలా ఎలక్ట్రిక్ యాప్‌ల ద్వారా ఇన్సూరెన్స్​ చేసుకోవచ్చు. ICICI లోంబార్డ్‌తో ఓలా ఒప్పందం చేసుకుంది.
Published by:Veera Babu
First published: