HOME »NEWS »BUSINESS »how to buy dream home with lowest price here are 3 smart tips ba

Home Loan Tips: తక్కువ ధరకే సొంతిల్లు కొనుక్కోవడం ఎలా? 3 చిట్కాలు

Home Loan Tips: తక్కువ ధరకే సొంతిల్లు కొనుక్కోవడం ఎలా? 3 చిట్కాలు
Home Loan: ప్రతీకాత్మక చిత్రం

సొంత ఇల్లు కొనుక్కోవాలనేది ప్రతి ఒక్కరి కల. అందు కోసం ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు ప్రజలు. నాలుగు రాళ్లు వెనకేసి.. ఇల్లు కొందామనుకునే లోపు మళ్లీ రియల్ ఎస్టేట్ ధరలు ఆకాశానికి అంటుతూ ఉంటాయి.

  • Share this:
    సొంత ఇల్లు కొనుక్కోవాలనేది ప్రతి ఒక్కరి కల. అందు కోసం ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు ప్రజలు. నాలుగు రాళ్లు వెనకేసి.. ఇల్లు కొందామనుకునే లోపు మళ్లీ రియల్ ఎస్టేట్ ధరలు ఆకాశానికి అంటుతూ ఉంటాయి. ధరలు పైపైకి ఎగబాకుతూ ఉంటాయి. తక్కువ జీతాలు వచ్చే వారికి బ్యాంకులు ఎక్కువ లోన్లు ఇవ్వవు. కాబట్టి ఎక్కువ క్యాష్ పెట్టి ఇల్లు కొనుక్కోవాల్సి వస్తుంది. మరి ఎక్కువ డబ్బు పెట్టేదెలా? కాబట్టి, చాలా మంది కొత్త వాటి కంటే రీ సేల్ ఇళ్లపై దృష్టి పెడుతూ ఉంటారు. అయితే, కొందరు మాత్రం మళ్లీ మళ్లీ కొనేది కాదుగా అంటూ కొంచెం డేర్ చేసి కొత్త ఇళ్లను కొంచెం ఎక్కువ ధర పెట్టి కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే, అన్ని సందర్బాల్లోనూ కొనుగోలుదారులు ఒకటి గమనించాలి. తక్కువ ధరకు ఎలా ఇల్లు కొనుక్కోవచ్చు అనేది ఇక్కడ మూడు చిట్కాలు ఉన్నాయి.

    రియల్ ఎస్టేట్ బ్రోకర్లను ఆశ్రయించవద్దు


    ఇది ప్రాథమిక సూత్రం. రియల్ ఎస్టేట్ బ్రోకర్లను మాత్రం ఆశ్రయించకూడదు. సాధారణంగా బిల్డర్ చెప్పే ధర కంటే కూడా ఈ మధ్యవర్తులు మరో రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు ఎక్కువ చెబుతారు. ఎలాగూ బేరం ఆడతారు కాబట్టి, కొంచెం తగ్గిస్తారని వాళ్లు అలా చెబుతారు. కాబట్టి, బ్రోకర్లను ఆశ్రయించకుండా నేరుగా బిల్డర్ లేదా ఓనర్‌తో మాట్లాడాలి. అందు కోసం కొంత శ్రమించారు. కొన్ని చోట్ల ‘ఇల్లు అమ్మబడును’ అని బోర్డులు పెడతారు. మరికొన్ని చోట్ల అలాంటి బోర్డులు ఏవీ ఉండవు. కానీ, ఇల్లు కొనాలనుకున్నప్పుడు తిరిగి తిరిగి నాలుగైదు చోట్ల అడిగి ఆ తర్వాత ముందడుగు వేయాలి.

    నిర్మాణం ప్రారంభం కాకముందే ఇల్లు బుక్ చేసుకోవడం
    ఇది రెండో పద్ధతి. ఇల్లు పూర్తయిన తర్వాత రేటు పెరుగుతుంది. అదే, నిర్మాణం ప్రారంభం కాకముందే, అంటే భవన నిర్మాణం ప్రారంభమయ్యే సమయంలోనే ఇల్లు బుక్ చేసుకోవాలి. అప్పుడు చాలా వరకు తక్కువ ధరకే వస్తుంది. ఎందుకంటే మీరు కొంత అడ్వాన్స్ ఇస్తారు. అలాగే, లోన్ కూడా వస్తుంది. మీరు ఇచ్చిన డబ్బులు, బ్యాంకు లోన్ సాయంతో బిల్డర్ ఇల్లు పూర్తి చేసి ఇస్తాడు. ఎలాగూ ఇన్నేళ్లు అద్దెకున్నాం. ఇంకో ఏడాది, ఏడాదిన్నర కాలం అద్దెకు ఉందాం అని భావిస్తే ఇలాంటి మార్గం సుగమం. ఇంట్లో దిగకముందే హోమ్ లోన్ తీసుకుంటే, మరి ఇటు అద్దె కట్టాలి, అటు ఈఎంఐ కట్టాలి కదా అనే అభిప్రాయం మీకు రావొచ్చు. అయితే, ఇల్లు పూర్తయ్యే వరకు హోంలోన్ ఈఎంఐ తామే చెల్లించే నిర్మాణ కంపెనీలు కూడా ఉంటాయి. అలాంటి వాటిని సెలక్ట్ చేసుకుంటే మీకు లాభం.

    బ్యాంకుల వేలం ద్వారా కొనుక్కోవడం
    ఇది అత్యంత చవకగా ఇల్లు కొనుక్కోవడానికి ఒక మార్గం. గతంలో ఇల్లు కొనుక్కుని, ఆ తర్వాత వివిధ కారణాల వల్ల బ్యాంకు రుణాలు తిరిగి చెల్లించలేని వారి ఆస్తులను బ్యాంకులు జప్తు చేస్తాయి. వాటిని వేలం వేస్తాయి. అలాంటి వాటిని కరెక్టుగా పట్టుకోగలిగితే చాలా చౌకగా ఇళ్లు దొరుకుతాయి. ఇలాంటి వాటి కోసం బ్యాంకులు పేపర్లలో ప్రకటనలు కూడా ఇస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు అలాంటివి గమనిస్తూ ఉండాలి. అలాగే, బ్యాంకుల వేలం ద్వారా కొనుగోలు చేసే ఆస్తులకు భద్రత ఉంటుంది. ఎలాంటి సమస్యలు లేని వాటికే బ్యాంకులు రుణాలు ఇస్తాయి కాబట్టి భవిష్యత్తులో లీగల్ సమస్యలు ఉండవు. అంటే, తక్కువకే ఎలాంటి తలనొప్పులు ఉండని ఇల్లు సొంతం అవుతుందన్నమాట.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:December 23, 2020, 22:23 IST