Home /News /business /

HOW TO BUY A HOME FOR THE FIRST TIME STEP BY STEP MK

Real Estate: కొత్త Flat లేదా ఇండిపెండెంట్ ఇల్లు కొంటున్నారా...అయితే ఇది మీ కోసం...

ఫ్రతీకాత్మకచిత్రం

ఫ్రతీకాత్మకచిత్రం

తొలిసారి ఇంటిని కొనేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా పట్టణాల్లో అయితే ఫ్లాట్ కొనుగోలుచేసే సమయంలో బిల్డర్ చరిత్ర, అలాగే బిల్డింగ్ సామర్థ్యం, అలాగే స్థలం ఎంపిక, నాణ్యత, వంటివి పరిగణలోకి తీసుకోవాలి.

  ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు.. అని అన్నారు పెద్దలు...ఎందుకంటే ఇల్లు కట్టడం లేదా కొనడం రెండూ చాలా కష్టమైన పనులు.  తొలిసారి ఇంటిని కొనేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా పట్టణాల్లో అయితే ఫ్లాట్ కొనుగోలుచేసే సమయంలో బిల్డర్ చరిత్ర, అలాగే బిల్డింగ్ సామర్థ్యం, అలాగే స్థలం ఎంపిక, నాణ్యత, వంటివి పరిగణలోకి తీసుకోవాలి. ఇక ఇండిపెండెంట్ హౌస్ తీసుకునేవారు అయితే ఏ రకమైన ప్రాపర్టీని కొనాలనుకుంటున్నారో ముందుగానే నిర్ణయించుకోవాలి. ఎంత బడ్జెట్‌లో, ఏ రకంగా ఇంటిని కొనాలని భావిస్తున్నారు అనే విషయాలను ముందుగానే పరిగణలోకి తీసుకోవాలి. ఇక ఇండిపెండెంట్ ఇల్లు కొనుగోలు చేస్తే సమయంలో పైపు లైన్స్, డ్రైనేజ్, వెంటిలేషన్ తదితరాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. ఇక అన్నింటికన్నా ముందు సెక్యూరిటీ అనేది చాలా ముఖ్యం.

  సరైన ప్రదేశం చూసుకోండి...

  ముందుగా మీ బడ్జెట్ కు అనుగుణంగా మాత్రమే కాదు. అసలు ఆ ప్రదేశం నివాస యోగ్యమా కాదా అనేది చాలా ముఖ్యం. ఎందుకుంటే మీరు దీర్ఘకాలం నివాసం ఉండటానికి ఇంటిని కొనుగోలు చేస్తున్నారనే సంగతి గుర్తుంచుకోవాలి. లేకపోతే మీరు అద్దె ఆదాయం కోసం ఇల్లు కొనుగోలు చేసినప్పుడు కూడా మంచి ప్రైమ్ లొకేషన్ అయితేనే లాభసాటి అవుతుంది. ఇక మీరు నివాసం ఉండేందుకు ఇంటిని కొనుగోలు చేస్తే మాత్రం, మీరు నివసించే ఇంటికి  హస్పిటల్స్, స్కూల్స్, షాపింగ్ సెంటర్లు దగ్గరలో ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి. అలాగే ఇల్లు మీ ఆఫీసుకు ఎంత దూరంలో ఉంటుంది అనేది కూడా ప్రధానంగా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.

  పేరున్న రియల్టర్లను సంప్రదించండి

  మీరు కొత్త ఫ్లాట్ కొనుగోలు చేస్తున్నారా, అయితే నేరుగా బిల్డర్ దగ్గరి నుంచే ఫ్లాట్  కొనుగోలు చేస్తే, కమీషన్ చెల్లించే అవసరం ఉండదు. డబ్బులు ఆదా చేయొచ్చు. అయితే రియల్ ఎస్టేట్ మార్కెట్‌పై సరైన అవగాహన లేకపోతే మాత్రం డెరైక్ట్‌గా కాకుండా ఎవరైనా ఒక మంచి రియల్టర్ ద్వారా ఇంటిని కొనుగోలు చేయడం ఉత్తమం. మీరు సెకండ్ సేల్ ఇల్లు కొంటే మాత్రం ఖచ్చితంగా రియల్టీ రంగ నిపుణుల సలహాలను తీసుకోవాల్సి ఉంటుంది.

  బడ్జెట్‌ కూడా చాలా ముఖ్యం...

  ఇక ఇల్లు కొనాలని డిసైడ్ అయ్యాక అన్నింటికన్నా ముఖ్యమైనది మీ బడ్జెట్. మీ బడ్జెట్ పరిమితి లోగా మంచి ఇంటిని కొనుగోలు చేస్తే మంచిది. అనవసరంగా ఇతర ప్రైవేటు వ్యక్తుల నుంచి అప్పులు తెచ్చి తర్వాత వాటిని తిరిగి చెల్లించే సమయంలో ఇబ్బందులు పడకూడదు. ఇంటిని కొనాలి అని నిర్ణయం తీసుకున్నాక... అనవసరపు ఖర్చులను తగ్గించుకోవాలి. డబ్బులు తక్కువగా ఉన్నప్పుడు ఇంట్లో డెకరేషన్, ఇతరత్రా ఖర్చులు తగ్గించుకుంటే మంచిది.

  డాక్యుమెంట్లు పక్కాగా ఉంటేనే ముందుకు కదలండి..

  ఇల్లు కొనేముందు అవసరమైన పత్రాలను మీ వద్ద రెడీగా ఉంచుకోండి. ఇలా చేయడం వల్ల డాక్యుమెంట్ల సమర్పణలో ఎలాంటి సమయం వృథా కాదు. ఇంటి కొనుగోలుతో సంబంధం ఉన్న అన్ని లీగల్ అంశాలపై జాగ్రత్త వహించండి. వీలైతే లీగల్ నిపుణుల అభిప్రాయం తీసుకుంటే మంచింది. ఇక ఇండిపెండెంట్ ఇల్లు విషయంలో అయితే టైటిల్ డీడ్ విషయంలో చాలా జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది. డబుల్ రిజిస్ట్రేషన్లు, అసైన్డ్ భూములు అంటగట్టే ప్రమాదం ఉంది. న్యాయనిపుణులకు పూర్తిగా డాక్యుమెంట్లు చూపిస్తే మంచిది.

  మంచి ఫైనాన్స్ కంపెనీని ఎంచుకోండి

  మీరు ఉద్యోగస్తులు అయితే మాత్రం తప్పనిసరిగా బ్యాంకులు, లేదా ఇతర నాన్ బ్యాంకింగ్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల నుంచి రుణాలను పొందడానికి ప్రయత్నించండి. అందుకు సరిపోయే డాక్యుమెంట్లును సిద్ధం చేసుకోండి. సరైన ఫైనాన్షియల్ సర్వీస్ ప్రొవైడర్‌ను ఎంపిక చేసుకోవాలి. ఒక్కో ప్రొవైడర్ ఒక్కోరకమైన వడ్డీ రేట్లకు ఇంటి రుణాలను అందిస్తుంటారు. ప్రస్తుతం బ్యాంకులు అత్యంత తక్కువ వడ్డీ రేటుతో ఫైనాన్స్ అందిస్తున్నాయి. వడ్డీ రేట్లపై ఎప్పటికప్పుడు ఓ కన్నేసి ఉంచండి. అలాగే ఇతర ఫీజులు, డిస్కౌంట్లపై కూడా పూర్తి వివరాలు తెలుసుకోండి.
  Published by:Krishna Adithya
  First published:

  Tags: Real estate in Hyderabad

  తదుపరి వార్తలు