హోమ్ /వార్తలు /బిజినెస్ /

How To Bounce Back: జాబ్‌ పోయిన తర్వాత బౌన్స్‌బ్యాక్‌ అవ్వడం ఎలా? నిపుణులు సూచిస్తున్న ఈ 5 అంశాలు మీ కోసమే..

How To Bounce Back: జాబ్‌ పోయిన తర్వాత బౌన్స్‌బ్యాక్‌ అవ్వడం ఎలా? నిపుణులు సూచిస్తున్న ఈ 5 అంశాలు మీ కోసమే..

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

హఠాత్తుగా ఉద్యోగం(Job) కోల్పోవడం షాక్‌గా ఉంటుంది. ఇలాంటి పరిణామాలు జీవిత, ఆర్థిక ప్రణాళికలను ప్రభావితం చేస్తాయి. ఇలాంటి సమయాల్లో చాలా మంది మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. అయితే తమ సామర్థ్యం, నైపుణ్యంపై పూర్తి నమ్మకం ఉంటేనే ఈ పరిస్థితులను అధిగమించగలరు.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

How To Bounce Back: ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల తొలగింపు(Lay off) కొనసాగుతోంది. ద్రవ్యోల్బణం, ఖర్చుల తగ్గింపు వంటి కారణాలతో కంపెనీలు వర్క్‌ఫోర్స్‌ను తగ్గించుకుంటున్నాయి. అమెజాన్‌, ట్విట్టర్‌, మెటా వంటి గ్లోబల్‌ కంపెనీలు ఇప్పటికే వర్క్‌ఫోర్స్‌ను తగ్గించుకునే ప్రణాళికలు దాదాపు అమలు చేశాయి. మెటాలో ఉద్యోగాలు కోల్పోయిన 13 శాతం మందిలో భారతీయులు ఉన్నారు. ఇండియన్ ఎడ్యుకేషన్‌ స్టార్టప్‌లు BYJU'S, Unacademy కూడా చాలా మంది ఉద్యోగులను తొలగించాయి. తొలగింపులు కొనసాగుతుండటంతో చాలా మందిలో గందరగోళం నెలకొంది. హఠాత్తుగా ఉద్యోగం(Job) కోల్పోవడం షాక్‌గా ఉంటుంది. ఇలాంటి పరిణామాలు జీవిత, ఆర్థిక ప్రణాళికలను ప్రభావితం చేస్తాయి. ఇలాంటి సమయాల్లో చాలా మంది మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. అయితే తమ సామర్థ్యం, నైపుణ్యంపై పూర్తి నమ్మకం ఉంటేనే ఈ పరిస్థితులను అధిగమించగలరు. బయట ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని గుర్తించాలి. ఉద్యోగాలు కోల్పోయిన వారు తిరిగి బౌన్స్ అవ్వడానికి నిపుణులు తెలియజేస్తున్న కొన్ని సూచనలు ఇప్పుడు తెలుసుకుందాం.

అవసరాలను అర్థం చేసుకోవాలి

షార్ట్‌ నోటీస్‌లో ఉద్యోగం కోల్పోతే.. వీలైనంత త్వరగా మరొక ఉద్యోగం కోసం వెతకాలి. జాబ్‌ కోల్పోవడం ఎప్పుడూ బాధాకరమే.. అయితే ఈ పరిస్థితులు ఏది కావాలనే దానిపై పునరాలోచించే అవకాశం ఇస్తాయి. తగిన ఉద్యోగం కోసం ఇంటర్నెట్‌లో వెతకడంతోపాటు.. మళ్లీ కార్పొరేట్ ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా? వ్యాపారం లేదా మరేదైనా స్టార్ట్‌ చేయడం మంచిదని భావిస్తున్నారా? వంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సమయాన్ని ఉపయోగించుకోవాలి.

విజయాల(Accomplishments)ను సమీక్షించుకోవాలి

ఉద్యోగ జీవితంలో సాధించిన ఎక్స్‌పీరియన్స్‌, గత ఉద్యోగాలలో సంపాదించిన నైపుణ్యాలు ఎప్పటికీ వృథా కావు. ఉద్యోగ వేటను ప్రారంభించే ముందు, వృత్తి జీవితంలో సాధించిన విజయాలను సమీక్షించాలి, వాటిని ఓ పేపర్‌ రాయాలి. ఇలా చేయడం ద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నిరాశను అధిగమించడంలో సహాయపడుతుంది. భవిష్యత్ ఇంటర్వ్యూలకు ప్రిపేర్‌ అవ్వడానికి ప్రోత్సాహకంగా పని చేస్తుంది.

Indian Navy: మహిళా అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌.. వచ్చే ఏడాది నుంచి నేవీ అన్ని విభాగాల్లో మహిళల రిక్రూట్‌మెంట్‌

 పాజిటివ్‌గా ఆలోచించాలి

పాజిటివ్‌ మైండ్‌సెట్‌తో ఇంటర్వ్యూలకు హాజరుకావాలి.

ఉద్యోగం కోల్పోవడం ఇబ్బందే అయినా.. సానుకూల వైఖరితో ముందుకు వెళ్లాలి. వేచి చూస్తున్న అవకాశాలను అందుకొనే ప్రయత్నం చేయాలి. అతిగా ఆలోచించి, ఆత్మపరిశీలన చేసుకుంటుంటే ఉద్యోగ వేట నుంచి కొంత విరామం తీసుకోవాలి. కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడపాలి. మానసిక పరిస్థితిని మెరుగుపరుచుకునేందుకు నచ్చిన పనులు చేయాలి.

నెట్‌వర్క్‌ని ఉపయోగించుకోవాలి

సామూహిక తొలగింపులతో చాలా మంది ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తుంటారు. ఈ సమయంలో మాజీ సహోద్యోగులతో మాట్లాడాలి. ఏవైనా అవకాశాలు ఉన్నాయా? అలాంటి పొజిషన్‌కి సరిపోతారా? లేదా? వంటి అంశాల గురించి చర్చించాలి. ఉపాధి కోసం ఇంతకుముందు పనిచేసిన కంపెనీల బాస్‌లను సంప్రదించడానికి కూడా వెనుకాడకూడదు.

నైపుణ్యాలు పెంచుకోవాలి

ఉద్యోగం కోల్పోవడానికి యోగ్యతతో ఎలాంటి సంబంధం లేకపోయినా.. ఎల్లప్పుడూ నేర్చుకుంటూ ఉండాలి. తదుపరి ఉద్యోగాన్ని పొందే ముందు, అవసరమైన నైపుణ్యాలను పెంపొందించుకోవాలి. ఇలా చేయడం ద్వారా మంచి అవకాశాలను అందుకోవచ్చు.

First published:

Tags: Career opportunities, Lay offs

ఉత్తమ కథలు