హోమ్ /వార్తలు /బిజినెస్ /

Online Shopping: ఆన్‌లైన్‌ షాపింగ్‌లో బెస్ట్‌ డీల్స్‌ పొందడం ఎలా?.. ఈ ట్రిక్స్ తెలుసుకోండి..

Online Shopping: ఆన్‌లైన్‌ షాపింగ్‌లో బెస్ట్‌ డీల్స్‌ పొందడం ఎలా?.. ఈ ట్రిక్స్ తెలుసుకోండి..

4. అంతే కాకుండా దేశీయంగా ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్ల వినియోగం పెరిగే కొద్దీ ఆన్‌లైన్‌ కొనుగోళ్లు కూడా పెరుగుతున్నాయని సింగ్‌ తెలిపారు.  అయితే, ఈ-కామర్స్‌ సైట్లలో కనిపించే నకిలీ రివ్యూల వల్ల వినియోగదారులు పలు సందర్భాల్లో నష్టపోవాల్సి వస్తోందని సింగ్‌ వివరించారు.  (ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

4. అంతే కాకుండా దేశీయంగా ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్ల వినియోగం పెరిగే కొద్దీ ఆన్‌లైన్‌ కొనుగోళ్లు కూడా పెరుగుతున్నాయని సింగ్‌ తెలిపారు. అయితే, ఈ-కామర్స్‌ సైట్లలో కనిపించే నకిలీ రివ్యూల వల్ల వినియోగదారులు పలు సందర్భాల్లో నష్టపోవాల్సి వస్తోందని సింగ్‌ వివరించారు. (ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

ఆన్‌లైన్‌ షాపింగ్‌కు భారతీయుల్లో చాలా మంది అలవాటు పడిపోయారు. కరోనా పుణ్యమా అని ఇంట్లోంచి అడుగుపెట్టేందుకు భయపడే వారికి ఆన్‌లైన్‌ షాపింగ్‌ నిజంగా ఒక వరం. ఈ విధానంలో కొనుగోళ్లపై ప్రధాన సంస్థలు మంచి ఆఫర్లను అందిస్తున్నాయి.

ఆన్‌లైన్‌ షాపింగ్‌కు భారతీయుల్లో చాలా మంది అలవాటు పడిపోయారు. కరోనా పుణ్యమా అని ఇంట్లోంచి అడుగుపెట్టేందుకు భయపడే వారికి ఆన్‌లైన్‌ షాపింగ్‌ (Online Shopping) నిజంగా ఒక వరం. ఈ విధానంలో కొనుగోళ్లపై ప్రధాన సంస్థలు మంచి ఆఫర్లను అందిస్తున్నాయి. 2025 నాటికి భారతదేశంలో ఆన్‌లైన్‌ షాపింగ్ మార్కెట్‌ విలువ $ 111.40 బిలియన్లకు చేరుతుందని అంచనా. ఇంటికే డెలివరీ చేస్తుండటం (delivery to home), ఎంచుకునేందుకు ఎన్నో రకాలు అందుబాటులో ఉండటం, తక్కువ ధరలు, నచ్చకపోతే రిటర్న్‌ చేసే సౌకర్యం ఉండటంతో చాలా మంది భారతీయులు ఆన్‌లైన్‌ షాపింగ్‌ను ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్‌లో చక్కని డీల్స్‌ పొంది, డబ్బు ఎలా పొదుపు చేసుకోవచ్చో తెలుసుకుందాం.

* కూపన్స్ ఉపయోగించడం

ఆన్‌లైన్‌ షాపింగ్‌లో డబ్బు పొదుపు చేసుకునేందుకు సులభమైన మార్గం కూపన్లను ఉపయోగించడం. ప్రోమోకోడ్స్, క్రెడిట్‌ కార్డు (credit cards) పాయింట్స్‌ ద్వారా కూడా మీరు కూపన్స్ పొందవచ్చు. ప్రత్యేకంగా కూపన్స్‌ అందించే వెబ్‌ సైట్స్‌ ఉన్నాయి. కూపన్‌దునియా, గ్రాబాన్‌, కూపన్‌ రాజా వంటివి మీరు పరిశీలించవచ్చు. ఆ మేరకు ఆన్‌లైన్ కొనుగోళ్లపై తగ్గింపు పొందవచ్చు.

RIL Partnership: గ్రీన్ హైడ్రోజన్ వైపు రిలయన్స్ అడుగులు... డెన్మార్క్ కంపెనీతో RNESL ఒప్పందం


* క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్

ఆన్‌లైన్‌లో షాపింగ్‌ చేసినప్పుడు క్యాష్‌ బ్యాక్‌ (Cashback) అందించే వెబ్‌సైట్స్‌ ఉన్నాయి. ఇందుకు క్యాష్‌కరో (CashKaro) లేదా గోపైసా (GoPaisa) వంటి సైట్స్‌కు వెళ్లి సైనప్‌ అవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆ సైట్‌కు వెళ్లి దాని ద్వారా మీకు నచ్చిన ఆన్‌లైన్‌ షాపింగ్‌ సైట్స్‌కు వెళ్లి హాయిగా షాపింగ్‌ చేసుకోవచ్చు. క్యాష్‌ బ్యాక్‌ సైట్‌, ఈ-కామర్స్‌ సైటుకు మధ్య ఉండే అవగాహనకు అనుగుణంగా క్యాష్‌ బ్యాక్‌ ఉంటుంది. నిర్దేశిత మొత్తంలో క్యాష్‌ బ్యాక్‌ జమ అయితే.. ఆ మొత్తాన్ని బ్యాంకు అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్‌ చేసుకోవచ్చు లేదా గిఫ్ట్‌ కార్డులు కొనుగోలు చేయవచ్చు.

Bajaj Pulsar 250: మీరు పల్సర్ బైక్ ప్రేమికులా...అయితే వచ్చేస్తోంది..Pulsar 250..ధర ఎంతంటే..


* ఎక్స్‌ట్రా డిస్కౌంట్స్‌

కొన్నేళ్ల క్రితం ఈ-కామర్స్‌ సైట్స్‌ సంవత్సరంలో ఒకసారి మాత్రమే సేల్స్ ఈవెంట్స్‌ నిర్వహించేవి. ఇప్పుడా పరిస్థితి లేదు. ప్రతీ పండగ, వేడుకలకు ఈ సైట్స్‌ డిస్కౌంట్స్‌ అందిస్తున్నాయి. ఈ సేల్స్‌ సందర్భంగా చాలా చాలా వస్తువులు తక్కువ ధరకు దొరుకుతాయి. కొన్ని క్రెడిట్స్‌ కార్డ్స్‌పై అదనపు డిస్కౌంట్స్‌ ఉంటాయి.

* ధరలు పోల్చుకోవడం

ఒక వస్తువు ధర అన్ని ఈ-కామర్స్ సైట్స్‌లో ఒకేలా ఉంటుంది. ఇది తెలుసుకునేందుకు అనేక మార్గాలున్నాయి. మైస్మార్ట్‌ ప్రైస్‌, బైహట్కే లేదా కంపేర్‌రాజా వంటి వెబ్‌సైట్స్‌ ఈ విషయంలో మీకు బాగా సాయపడతాయి.

* బ్రౌజర్ ఎక్స్‌టెన్షన్స్‌ ఉపయోగించడం

ధరలు పోల్చేందుకు, కూపన్లు అందించేందుకు, డబ్బు పొదుపు చేసుకునేందుకు ప్రముఖ బ్రౌజర్లన్నీ ఎక్స్‌టెన్షన్స్‌ అందిస్తున్నాయి.

Maruti Suzuki Alto: నమ్మక తప్పదు...కానీ ఇది నిజం.. మారుతి ఆల్టోపై రూ.43 వేల డిస్కౌంట్..


* తప్పనిసరిగా ఉండాల్సిన ఎక్స్‌టెన్షన్లు:

హనీ- మీరు ఒపెన్‌ చేసిన వెబ్‌సైట్‌లో ఏమైనా కూపన్స్‌ అందుబాటులో ఉన్నాయా అన్నది ఇది క్షణాల్లో కనిపెడుతుంది. మీరు వస్తువులు తక్కువ ధరకు కొనేలా చూస్తుంది.

కీప్- ఇది కేవలం అమెజాన్‌ ఇండియా వెబ్‌సైట్‌కు మాత్రమే పనిచేస్తుంది. ఇది ఒక వస్తువుకు సంబంధించి గతంలో ఉన్న ధర, ప్రస్తుత ధరను చూపుతుంది.

మక్కీచూస్‌- మీరు చూస్తున్న ఆన్‌లైన్‌ వెబ్‌సైట్స్‌లోని వస్తువుల ధరలు ఏయే ఈ-కామర్స్‌ సైట్స్‌లో ఎంతుందనేది ఇది చూపుతుంది.

First published:

Tags: Home delivery, Online shopping

ఉత్తమ కథలు