Demat Account: మీ డీమ్యాట్‌ అకౌంట్‌ డీయాక్టివేట్ కాకుండా ఉండాలా ?.. వెంటనే ఇలా చేయండి

ప్రతీకాత్మక చిత్రం

Demat Account: ట్రేడింగ్‌, డీమ్యాట్‌ ఖాతాదారులకు నామినేషన్‌ సదుపాయం ఉండాలనే విషయాన్ని కూడా సెబీ గుర్తించింది. ప్రస్తుత ఖాతాదారులతో పాటు కొత్తగా ఖాతాలు ప్రారంభించే వారి నుంచి నామినేషన్‌కు సంబంధించిన సమ్మతిని బ్రోకర్‌ పొందడం తప్పనిసరి చేసింది సెబీ.

  • Share this:
మీరు స్టాక్‌మార్కెట్‌లో లావాదేవీలు నిర్వహిస్తారా? మీకు డీమ్యాట్‌ అకౌంట్‌ ఉందా? దానికి సంబంధించి కేవైసీ అప్‌డేట్‌ చేశారా? చేయకపోతే వెంటనే ఆ పని చేయండి. సెప్టెంబర్‌ 30, 2021 నాటికి డీమ్యాట్‌ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరి కేవైసీ వివరాలు అప్‌డేట్‌గా ఉండేలా చూడాలని అన్ని స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లు, డిపాజిటరీలకు సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI ) సూచనలు చేసింది. ఈ గడువును ఎట్టి పరిస్థితుల్లోనూ మీరొద్దని కస్టమర్లను స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లు, డిపాజిటరీలు కోరాయి. గతంలో ఇచ్చిన గడువును ఇప్పటికే రెండుసార్లు పొడిగించామని, ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదని పేర్కొన్నాయి.

డీమ్యాట్‌ అకౌంట్‌కు సంబంధించి పాన్‌, ఆధార్‌ లింకు చేసుకోవడం కూడా తప్పనిసరి కాబోతోంది. దీనికి గడువు 2022 మార్చి వరకు ఉంది. ఒకవేళ ఆ లోపు వీటిని లింక్ చేసుకోకపోతే పాన్ నంబర్ డీయాక్టివేట్‌ అయిపోతుంది. దాంతో డీమ్యాట్ అకౌంట్‌ డార్మెంట్‌ అవుతుంది.

ట్రేడింగ్‌, డీమ్యాట్‌ ఖాతాదారులకు నామినేషన్‌ సదుపాయం ఉండాలనే విషయాన్ని కూడా సెబీ గుర్తించింది. ప్రస్తుత ఖాతాదారులతో పాటు కొత్తగా ఖాతాలు ప్రారంభించే వారి నుంచి నామినేషన్‌కు సంబంధించిన సమ్మతిని బ్రోకర్‌ పొందడం తప్పనిసరి చేసింది సెబీ. నామినేషన్‌కు ఖాతాదారు అంగీకరిస్తే.. క్లైంట్ల నుంచి ఆ వివరాలన్నీ సేకరించి బ్రోకర్‌ తన రికార్డుల్లో మెయింటెయిన్ చేయాల్సి ఉంటుంది. కొత్త ఖాతాల విషయంలో ఈ నిబంధన 2021 అక్టోబర్‌ 1 నుంచి అమల్లోకి రానుంది. ప్రస్తుత ఖాతాదారులకు ఈ గడువు మార్చి 31, 2022 వరకు ఉంది.

IT Return: ఆఖరి నిమిషం వరకు ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్ దాఖలు చేయలేదా?.. ఫైన్ కట్టాల్సిందే.. ఎంతంటే..

LPG Cylinder: కొత్త గ్యాస్ కనెక్షన్ కావాలా ? ఈ నంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే చాలు..

కేవైసీ కోసం క్లైంట్లు బ్రోకర్‌ దగ్గరకు వెళ్లే ఇబ్బందులు నివారించడానికి డిజిటల్‌ కేవైకీకి సెబీ అనుమతి ఇచ్చింది. సెబీ మార్గదర్శకాలకు అనుగుణంగా డిజిటల్‌ కెవైసీ వ్యవస్థ ఏర్పాటవుతోంది. ఇది అందుబాటులోకి వచ్చిన తర్వాత క్లైంట్లు బ్రోకర్‌ దగ్గరకు వెళ్లకుండానే తమ వివరాలు అప్‌డేట్‌ చేసుకోవచ్చు.

కెవైసీ వివరాల అప్‌డేషన్‌ కోసం ఆరు డాక్యుమెంట్లు అవసరం. పాన్ కార్డు, వ్యక్తి పేరు, చిరునామా, మొబైల్‌ నెంబర్‌, ఈమెయిల్‌ ఐడీ, ఆర్థిక వివరాలు.. వంటివన్నీ ఖాతాదారులు అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. ఈ వివరాలు అప్‌డేట్‌ చేయకపోతే ఆ అకౌంట్‌ను బ్రోకర్‌ డార్మెంట్‌గా మార్క్‌ చేస్తారు. గతంలో ఈ ఆరు వివరాలు అందించడం తప్పనిసరి కాదు. ఆర్థిక మోసాలు, మనీ లాండరింగ్‌ నిరోధించడానికి వీటిని ఇప్పుడు సెబీ తప్పనిసరి చేసింది. ఈ చర్యలన్నీ అమలైతే క్లైంట్ల రిస్క్‌ తగ్గడంతో పాటు మోసాల నుంచి కూడా వారికి రక్షణ లభిస్తుంది.
Published by:Kishore Akkaladevi
First published: