Home /News /business /

HOW TO APPLY FOR MINOR PASSPORT KNOW HOW PARENTS CAN APPLY PASSPORT FOR THEIR CHILDREN SS

How to Apply for Minor Passport: మీ పిల్లలకు మైనర్ పాస్‌పోర్ట్ తీసుకోండి ఇలా

How to Apply for Minor Passport: మీ పిల్లలకు మైనర్ పాస్‌పోర్ట్ తీసుకోండి ఇలా
(ప్రతీకాత్మక చిత్రం)

How to Apply for Minor Passport: మీ పిల్లలకు మైనర్ పాస్‌పోర్ట్ తీసుకోండి ఇలా (ప్రతీకాత్మక చిత్రం)

How to Apply for Minor Passport | విదేశాలకు వెళ్లాలంటే మైనర్లకు కూడా పాస్‌పోర్ట్ తప్పనిసరి. తల్లిదండ్రులు వారి పిల్లల పేర్ల మీద పాస్‌పోర్ట్ (Children Passport) సులువుగా తీసుకోవచ్చు.

విదేశాలకు వెళ్లాలంటే పాస్‌పోర్ట్ (Passport) కావాలి. అయితే తల్లిదండ్రులు ముందుగానే తమ పిల్లల పేరుతో పాస్‌పోర్టు తీసుకోరు. విదేశాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు హడావుడి పడుతుంటారు. అప్పటికప్పుడు పాస్‌పోర్టుకు అప్లై చేస్తుంటారు. గతంలో తండ్రి పాస్‌పోర్టులో పిల్లల పాస్‌పోర్ట్ ఉంటే సరిపోతుంది. పిల్లలకు పాస్‌పోర్ట్ అవసరం అయ్యేది కాదు. కానీ కొత్త గైడ్‌లైన్స్ ప్రకారం పిల్లలు విదేశాలకు వెళ్లాలంటే వారికి కూడా పాస్‌పోర్ట్ తప్పనిసరి. తల్లిదండ్రులు వారి పిల్లలకు ముందుగానే పాస్‌పోర్ట్ తీసుకోవచ్చు. మైనర్ పాస్‌పోర్టుకు ఎలా అప్లై చేయాలి? (How to Apply for Minor Passport) అన్న సందేహాలు తల్లిదండ్రుల్లో ఉంటాయి. చాలా సులువుగా మైనర్ పాస్‌పోర్ట్ పొందొచ్చు.

మైనర్ పాస్‌పోర్ట్ అంటే 18 ఏళ్ల లోపు వారందరికీ లభిస్తుంది. 18 ఏళ్ల లోపు వారు స్వయంగా పాస్‌పోర్టుకు అప్లై చేయడం కుదరదు. తల్లిదండ్రులు లేదా సంరక్షకుల అనుమతి తప్పినిసరి. అంతేకాదు... తల్లిదండ్రుల పాస్‍‌పోర్టులో పిల్లల పేర్లు ఉండటం కూడా తప్పనిసరి. మైనర్ పాస్‌పోర్ట్ పొందడానికి బర్త్ సర్టిఫికెట్, అడ్రస్ ప్రూఫ్ తప్పనిసరిగా కావాలి. మరి తల్లిదండ్రులు వారి పిల్లల పేర్లతో మైనర్ పాస్‌పోర్ట్ (Minor Passport) ఎలా తీసుకోవాలో తెలుసుకోండి.

Axis Bank Credit Card: ఈ క్రెడిట్ కార్డుతో 53 లీటర్ల పెట్రోల్ ఉచితం అంటున్న యాక్సిస్ బ్యాంక్

మైనర్ పాస్‌పోర్టుకు అప్లై చేయండి ఇలా


Step 1- ముందుగా పాస్‌పోర్ట్ సేవా వెబ్‌సైట్ https://www.passportindia.gov.in/ ఓపెన్ చేయాలి.

Step 2- హోమ్ పేజీలో ఎడమ వైపు New User Registration, Existing User Login ఆప్షన్స్ ఉంటాయి.

Step 3- ఇప్పటికే ఈ పోర్టల్‌లో రిజిస్టర్ చేసినవారు Existing User Login క్లిక్ చేయాలి.

Step 4- తమ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ కావాలి.

Step 5- కొత్త యూజర్ అయితే New User Registration పైన క్లిక్ చేయాలి.

Step 6- రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తి చేయాలి.

Step 7- లాగిన్ చేసిన తర్వాత మైనర్ పేరు మీద పాస్‌పోర్టుకు అప్లై చేయాలి.

Step 8- వివరాలన్నీ ఎంటర్ చేసిన తర్వాత పేమెంట్ చేయాలి.

Step 9- పేమెంట్ పూర్తి చేసి పాస్‌పోర్ట్ అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.

IRCTC QR Code: రైల్వే ప్రయాణికులకు అలర్ట్... క్యూఆర్ కోడ్ పేమెంట్ ప్రారంభించిన ఐఆర్‌సీటీసీ



మైనర్లకు 36 పేజీల పాస్‌పోర్ట్ లభిస్తుంది. మైనర్ పాస్‌పోర్ట్ వేలిడిటీ 5 ఏళ్లు లేదా వారికి 18 ఏళ్ల వయస్సు వచ్చే వరకు ఉంటుంది. వీటిలో ఏది ముందు పూర్తైతే అప్పటివరకే పాస్‌పోర్ట్ చెల్లుతుంది. విదేశాలకు వెళ్లడం కోసం తీసుకునే పాస్‌పోర్ట్ చాలా చోట్ల ఐడీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్‌గా ఉపయోగపడుతూ ఉంటుంది.
Published by:Santhosh Kumar S
First published:

Tags: Passport

తదుపరి వార్తలు