Home /News /business /

HOW TO APPLY FOR A LOAN AGAINST FIXED DEPOSITS HERE IS THE ANSWER MS GH

Fixed Deposits: ఫిక్స్డ్ డిపాజిట్లపైనా లోన్ తీసుకోవచ్చని తెలుసా..? ఎలా దరఖాస్తు చేయాలంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Fixed Deposits: సాధారణంగా ఫిక్స్డ్ డిపాజిట్ల కింద 7 రోజుల నుంచి 10 ఏళ్ల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. డిపాజిట్ చేసే సమయంలోనే ఎన్ని రోజులు ఎఫ్డీ చేస్తారో స్పష్టంగా పేర్కొనాల్సి ఉంటుంది. దీనిలో ప్రీమెచ్యూర్ విత్డ్రా, మెచ్యూర్ విత్డ్రా అనే రెండు రకాల డిపాజిట్స్ ఉంటాయి.

ఇంకా చదవండి ...
  • News18
  • Last Updated :
ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డి).. అత్యంత ప్రాచుర్యం పొందిన, సురక్షిత పెట్టుబడి మార్గాల్లో ఒకటి. అందువల్లే, సీనియర్ సిటిజన్లు, పెన్షనర్లు ఎఫ్డీల్లో పెట్టుబడికి ఆసక్తి చూపుతుంటారు. దీనిలో పెట్టుబడికి స్థిరమైన వడ్డీ లభించడమే కాకుండా, ఎటువంటి నష్టభయం లేని రిటర్న్స్ ను  పొందవచ్చు. దేశంలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్లపై ఆకర్షణీయమైన వడ్డీరేట్లను అందిస్తున్నాయి. అయితే, కరోనా కారణంగా ప్రజల చేతిలో డబ్బు లేకపోవడంతో అత్యవసర వినియోగం కొరకు ఫిక్స్డిపాజిట్లను ఉపసంహరించుకునే వారి సంఖ్య ఈ మధ్యకాలంలో పెరిగింది. మీరు కూడా మీ ఫిక్స్డ్ డిపాజిట్లను ముందుగానే ఉపసంహరించుకుంటే.. దానిపై పెనాల్టీ చెల్లించాల్సి వస్తుంది. అందువల్ల, ఫిక్స్డ్ డిపాజిట్లపై లోన్ తీసుకోవడం ఉత్తమ మార్గంగా చెప్పవచ్చు.

ఎందుకంటే, సాధారణంగా ఫిక్స్డ్ డిపాజిట్ల కింద 7 రోజుల నుంచి 10 ఏళ్ల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. డిపాజిట్ చేసే సమయంలోనే ఎన్ని రోజులు ఎఫ్డీ చేస్తారో స్పష్టంగా పేర్కొనాల్సి ఉంటుంది. దీనిలో ప్రీమెచ్యూర్ విత్డ్రా, మెచ్యూర్ విత్డ్రా అనే రెండు రకాల డిపాజిట్స్ ఉంటాయి. ప్రీమెచ్యూర్ విత్డ్రా అంటే మీరు ఎప్పుడైనా మీ ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్ను క్లోజ్చేసి డబ్బు వెనక్కు తీసుకోవచ్చు. అదే మెచ్యూర్ విత్డ్రా కింద గడువులోపే మీరు డబ్బులు తీసుకుంటే పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది.

ఒకవేళ మీరు, మెచ్యూర్ విత్ డ్రా కింద అమౌంట్ ను వెనక్కి తీసుకుంటే.. మిగతా అమౌంట్ మీద వడ్డీ రేటు తక్కువగా వస్తుంది. ఇది, మీ పెట్టుబడి ప్రణాళికలకు అంతరాయం కలిగిస్తుంది. అందువల్ల, మీ అత్యవసర సమయంలో డబ్బు కోసం రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అది మీ పెట్టుబడులకు ఆటంకం కలిగించకుండా ఆర్థిక అవసరాలకు సులభంగా నిధులు సమకూర్చగలదు. ఎఫ్‌డికి వ్యతిరేకంగా రుణం కోసం దరఖాస్తు అనేది స్వల్పకాలిక రుణం పొందటానికి సమర్థవంతమైన మార్గంగా చెప్పవచ్చు. ఇది కనీస డాక్యుమెంటేషన్, హామీ అవసరం లేకుండానే పొందవచ్చు. ఈ సౌకర్యం ఒక వ్యక్తి పొదుపులను పెంచడానికి, అప్పటికప్పుడు డబ్బు సమకూర్చడానికి వీలు కల్పిస్తుంది. దీన్ని మీరు అత్యవసర నిధులుగా కూడా ఉపయోగించవచ్చు. అయితే, క్యుమిలేటివ్ స్థిర డిపాజిట్ల విషయంలో పెట్టుబడి పెట్టిన మొత్తంలో 75 శాతం వరకు రుణం తీసుకునే అవకాశం ఉంటుంది. అదే, నాన్ క్యుమిలేటివ్ ఫిక్స్డ్ డిపాజిట్ల విషయంలో, పెట్టుబడి పెట్టిన మొత్తంలో 60 శాతం వరకు మాత్రమే రుణం పొందవచ్చు.

కేవలం 24 గంటల్లోనే అకౌంట్లో జమ..

ఎఫ్డీ డిపాజిట్లపై పెట్టుకునే లోన్ మొత్తం కేవలం 24 గంటల్లోనే దరఖాస్తుదారుడి అకౌంట్లో జమ చేయబడుతుంది. దీనికి ఎటువంటి అదనపు ఛార్జీలు ఉండవు. ఇది మీ ఆర్థిక అవసరాలను తీర్చడానికి ఎంతో సౌకర్యంగా ఉంటుంది. కేవలం ఒక దరఖాస్తు ఫారమ్ నింపడం ద్వారా ఈ లోన్ను సులభంగా పొందవచ్చు. అన్ని ఫిక్స్డ్ డిపాజిట్ హోల్డర్లు ఈ రుణం తీసుకోవడానికి అర్హులు. కానీ, మైనర్ల పేరిట ఎఫ్‌డిలు ఉంటే మాత్రం దీనికి అర్హత ఉండదని గుర్తించుకోవాలి. అయితే, తీసుకున్న రుణాన్ని ఫిక్స్డ్ డిపాజిట్‌కు మెచ్యూరిటీ తీరే ముందే తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.
Published by:Srinivas Munigala
First published:

Tags: Bank loans, Investment Plans, Money

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు