హోమ్ /వార్తలు /బిజినెస్ /

How to add beneficiary in Yono SBI: యోనో ఎస్‌బీఐలో బెనిఫీషియరీని యాడ్ చేయండి ఇలా

How to add beneficiary in Yono SBI: యోనో ఎస్‌బీఐలో బెనిఫీషియరీని యాడ్ చేయండి ఇలా

How to add beneficiary in Yono SBI: యోనో ఎస్‌బీఐలో బెనిఫీషియరీని యాడ్ చేయండి ఇలా
(ప్రతీకాత్మక చిత్రం)

How to add beneficiary in Yono SBI: యోనో ఎస్‌బీఐలో బెనిఫీషియరీని యాడ్ చేయండి ఇలా (ప్రతీకాత్మక చిత్రం)

How to add beneficiary in Yono SBI | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కస్టమర్లు యోనో ఎస్‌బీఐ యాప్ ద్వారా డబ్బులు ట్రాన్స్‌ఫర్ (Money Transfer) చేయాలనుకుంటే ముందుగా బెనిఫీషియరీ అకౌంట్‌ను యాడ్ చేయల్సి ఉంటుంది.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తమ కస్టమర్లకు ఎస్‌బీఐ యోనో, ఎస్‌బీఐ యోనో లైట్ యాప్స్ ద్వారా బ్యాంకింగ్ సేవల్ని అందిస్తోంది. ఎస్‌బీఐ బ్యాంకింగ్ సేవల్ని పొందాలనుకుంటే కస్టమర్లు ఈ ఎస్‌బీఐ ఆన్‌లైన్ బ్యాంకింగ్ యాప్స్ (SBI Online Banking Apps) ఉపయోగించుకోవచ్చు. ఈ యాప్స్ ద్వారా మనీ ట్సాన్‌ఫర్ నుంచి లోన్ అప్లికేషన్ వరకు అన్నీ సాధ్యమే. ఈ యాప్‌లోనే వెహికిల్ లోన్ తీసుకొని వాహనాలు కూడా బుక్ చేయొచ్చు. ట్రైన్ టికెట్స్, ఫ్లైట్ టికెట్స్ కూడా బుక్ చేయొచ్చు. ఎస్‌బీఐ యోనో యాప్ ద్వారా ఎవరికైనా డబ్బులు పంపాలనుకుంటే ముందుగా బెనిఫీషియరీ అకౌంట్ యాడ్ చేయాల్సి ఉంటుంది. యోనో ఎస్‌బీఐ యాప్‌లో బెనిఫీషియరీ ఎలా యాడ్ చేయాలి? (How to add beneficiary in Yono SBI) అన్న సందేహాలు యూజర్లలో ఉంటాయి. యోనో ఎస్‌బీఐ యాప్‌లో బెనిఫీషియరీని ఈ స్టెప్స్‌తో యాడ్ చేయండి.

Loan: గంటలోపే పర్సనల్ లోన్, బిజినెస్ లోన్, ఆటో లోన్... ఇలా అప్లై చేస్తే చాలు

యోనో ఎస్‌బీఐ యాప్‌లో బెనిఫీషియరీని యాడ్ చేయండిలా


Step 1- ముందుగా ఎస్‌బీఐ ఖాతాదారులు తమ స్మార్ట్‌ఫోన్‌లో యోనో ఎస్‌బీఐ యాడ్ ఇన్‌స్టాల్ చేయాలి.

Step 2- తమ అకౌంట్ వివరాలతో లాగిన్ కావాలి.

Step 3- ఆ తర్వాత Yono Pay పైన క్లిక్ చేయాలి.

Step 4- ఆ తర్వాత Profile Management సెలెక్ట్ చేయాలి.

Step 5- Add/Manage Beneficiary ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.

Step 6- ఎస్‌బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ప్రొఫైల్ పాస్‌వర్డ్ ఎంటర్ చేయాలి.

Step 7- మీరు డబ్బులు పంపాలనుకునే ప్రాసెస్ సెలెక్ట్ చేయండి.

Step 8- ఆ తర్వాత అకౌంట్ నెంబర్ యాడ్ చేసి నెక్స్‌ట్ పైన క్లిక్ చేయండి.

Step 9- మీరు ఎస్‌బీఐ అకౌంట్ యాడ్ చేయాలనుకుంటే ఎస్‌బీఐ అకౌంట్ సెలెక్ట్ చేయండి.

Step 10- అకౌంట్ వివరాలు ఎంటర్ చేసి నెక్స్‌ట్ పైన క్లిక్ చేయండి.

Step 11- ఒకవేళ ఇతర బ్యాంక్ అకౌంట్ యాడ్ చేయాలనుకుంటే బ్యాంక్ అకౌంట్ పైన క్లిక్ చేయండి.

Step 12- అకౌంట్ విరాలు ఎంటర్ చేసి నెక్స్‌ట్ పైన క్లిక్ చేయండి.

Step 13- బెనిఫీషియరీకి రూ.1 ట్రాన్స్‌ఫర్ చేయాల్సి ఉంటుంది.

Step 14- మీ రిమార్క్ యాడ్ చేసి పే ఆప్షన్ పైన క్లిక్ చేయండి.

Step 15- మీ స్క్రీన్‌పైన కన్ఫర్మేషన్ మెసేజ్ కనిపిస్తుంది. కన్ఫామ్ చేయండి.

Step 16- మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.

Step 17- ఓటీపీ ఎంటర్ చేసి నెక్స్‌ట్ పైన క్లిక్ చేయండి.

Step 18- బెనిఫీషియరీ అకౌంట్ రాబోయే 24 గంటల్లో యాడ్ అవుతుంది.

ఇలా బెనిఫీషియరీ అకౌంట్ చేసిన తర్వాత ఇక ఎప్పుడైనా ఆ అకౌంట్‌కు డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు.

Published by:Santhosh Kumar S
First published:

Tags: Money Transfer, Personal Finance, Sbi, Sbi yono, State bank of india

ఉత్తమ కథలు