HOW PPF SSY OTHER POST OFFICE SAVINGS ACCOUNT HOLDERS CAN USE IVR FACILITY GH VB
Indian Post Office: మీకు పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్ ఉందా.. అయితే ఇది తప్పక తెలుసుకోండి..
ప్రతీకాత్మక చిత్రం
ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్కు దేశంలోనే అతిపెద్ద నెట్వర్క్ ఉంది. పోస్టల్, కొరియర్ సేవలతో పాటు బ్యాంకింగ్ సేవలను కూడా పోస్టాఫీసులు అందిస్తున్నాయి. తాజాగా ఇండియా పోస్ట్ తమ బ్యాంకింగ్ కస్టమర్ల కోసం ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ (IVR-ఐవీఆర్)ను అందుబాటులోకి తెచ్చింది.
ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్కు దేశంలోనే అతిపెద్ద నెట్వర్క్ ఉంది. పోస్టల్, కొరియర్ సేవలతో పాటు బ్యాంకింగ్ సేవలను కూడా పోస్టాఫీసులు అందిస్తున్నాయి. తాజాగా ఇండియా పోస్ట్ తమ బ్యాంకింగ్ కస్టమర్ల కోసం ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ (IVR-ఐవీఆర్)ను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా ఉన్నచోటు నుంచి పోస్టాఫీస్ సేవలను ఉమయోగించుకునే వీలుంది. మీ మొబైల్ నుంచి 18002666868 నంబర్‌కు కాల్ (Call) చేసి... మీ పోస్టల్ అకౌంట్లో ఉన్న డబ్బు వివరాలనే కాకుండా అనేక సేవలను ఉపయోగించుకోవచ్చు. కొత్త వడ్డీ రేట్లను, పోయిన మీ పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్ ఏటీఎంను బ్లాక్ చేయడం, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) గురించి వివరాలను, సుకన్య సమృద్ది యోజన (SSY) వివరాలను క్షణాల్లో తెలుసుకునే వీలుంది. ఇప్పుడు ఐవీఆర్ సర్వీస్‌ను ఎలా ఉపయోగించాలో నేర్చుకుందాం.
ఐవీఆర్ సేవల కోసం ఈ విధంగా చేయండి
తమ సేవింగ్స్ అకౌంట్ హోల్డర్ల కోసం పోస్టాఫీస్ ఐవీఆర్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఇంగ్లీష్, హిందీ భాషలతో పాటు తెలుగు లాంటి ఇతర ప్రాంతీయ భాషలతో తమ కస్టమర్లకు మరింత చేరువయ్యేందుకు ప్రయత్నిస్తోంది. మీరు ఒక వేళ ఐవీఆర్ సేవలను ఉపయోగించుకోవాలంటే కింది పద్ధతులను పాటించండి.
1. ముందుగా మీరు మీ మొబైల్ ఫోన్లో 18002666868 నంబర్‌కు కాల్ చేయండి.
2. మీకు హిందీ భాష కావాలంటే 1ని లేదా తెలుగు కోసం 2ను ప్రెస్ చేయండి.
3. ఇప్పుడు మీరు ఎంచుకున్న భాషలో ఇండియన్ పోస్టల్ సర్వీస్ వారు మీకు స్వాగతం పలుకుతారు.
4. మీరు మీ అకౌంట్లోని బ్యాలన్స్‌ను తెలుసుకోవాలనుకుంటే 5 నంబర్ నొక్కి... మీ అకౌంట్ నంబర్‌ను ఎంటర్ చేసి #ను ప్రెస్ చేయండి. వెంటనే మీ అకౌంట్లోని బ్యాలన్స్‌ను వినిపిస్తుంది.
5. ఒకవేళ మీ అకౌంట్‌కు సంబంధించిన ఏటీఎంను బ్లాక్ చేయాల్సి వస్తే 6 నంబర్‌ను నొక్కి మీ ఏటీఎం కార్డు నంబర్‌ను టైప్ చేయండి... అనంతరం అకౌంట్ నంబర్... కస్టమర్ ఐడీ నంబర్ టైప్ చేసి మూడు నొక్కండి. అంతే మీ ఏటీఎం బ్లాక్ అయినట్లే.
వీటితో పాటు పోస్టల్ సర్వీస్ సేవలను కూడా తెలుసుకోవచ్చు. మీరు పంపిన పార్సిల్ ప్రస్తుతం ఎక్కడుందో.. అది ఎప్పటికి మీరు పంపిన అడ్రస్‌కు చేరుకుంటుందో ఐవీఆర్ సర్వీసెస్ ద్వారా చిటికెలో తెలుసుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా జాతీయ సేవింగ్ సర్టిఫికేట్ (NSC), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), కిసాన్ వికాస్ పత్రా (KVP), సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ (SSY) వంటి పథకాల గురించి క్షణాల్లో తెలుసుకోవచ్చు. వీటికి సంబంధించిన వడ్డీ రేట్లను కేంద్రం ప్రతి ఏడాదీ మారుస్తూ ఉంటుంది. వీటి వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేలా ఐవీఆర్ సేవలు ఉపయోగపడతాయి. వీటితో పాటు దేని గురించైనా ఫిర్యాదు చేయాలనుకుంటే ఐవీఆర్ ద్వారా కస్టమర్ కేర్ (Customer Care) కు నేరుగా కనెక్ట్ (Connect) అయ్యి తమ సమస్యను వివరించి అందుకు సత్వరమే పరిష్కారాన్ని పొందవచ్చు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.