HOW NOKIA IS RIDING THE 5G WAVE IN INDIA WHAT ARE THE PLANS FROM COMPANY TO START 5G SERVICES FROM 2020 NK
ఇండియాలో 5జీ విప్లవం తేబోతున్న నోకియా... 4జీ కంటే భారీగా... పక్కాగా... ఎలా అంటే
ప్రతీకాత్మక చిత్రం
Nokia 5G Technology : నోకియాకి చెందిన చెన్నై ప్లాంట్‌లో 5జీ టెక్నాలజీ ఎక్విప్మెంట్ తయారవుతోంది. దాన్ని అమెరికా సహా చాలా దేశాలకు ఎక్స్పోర్ట్ చేసేందుకు కంపెనీ రెడీ అవుతోంది.
ఒకప్పుడు టెలికం రంగంలో బ్రాండెడ్ మొబైళ్లతో విప్లవం సృష్టించిన ఫిన్లాండ్ కంపెనీ నోకియా... చాలా కాలం తర్వాత తిరిగి తన మార్క్ చూపించేందుకు రెడీ అవుతోంది. ఈసారి మొబైళ్లతో కాకుండా... 5జీ టెక్నాలజీతో వస్తున్న ఈ కంపెనీ... ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు ఎండ్-టు-ఎండ్ సొల్యూషన్స్ ఆఫర్ చేస్తోంది. ఇలాంటి సర్వీసులతో డిసెంబర్ 2018 నుంచీ వృద్ధిరేటును పెంచుకుంటూ పోతోంది. ప్రస్తుతం నోకియా... మొబిలిటీ సర్వీసులు, ఇంటర్నెట్ ప్రోటోకాల్ (IP), ఆప్టిక్స్ అండ్ ఫిక్స్డ్ నెట్వర్క్ సొల్యూషన్స్, కేబుల్ ఆపరేటర్లకు సొల్యూషన్స్ వంటి సర్వీసులతో డెవెలప్ అవుతోంది. ఇండియాలో లాంగ్ టెర్మ్ ఇవల్యూషన్ (LTE), వాయిస్ ఓవర్ ఎల్టీఈ (VoLTE), ఆప్టిక్స్ మార్కెట్లో నోకియా అతి పెద్ద కంపెనీగా నిలిచింది. IP సెగ్మెంట్లో రెండో అతి పెద్ద కంపెనీ స్థానాన్ని దక్కించుకుంది.
5జీ టెలికం సర్వీసులు అందించేందుకు, మొబైల్ డేటా వినియోగాన్ని పెంచేందుకు... టెలికం సర్వీస్ ప్రొవైడింగ్ సంస్థలు తమ నెట్వర్క్స్ని ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ చేసుకుంటున్నాయి. ఇండియాలో ప్రస్తుతం ఉన్న అన్ని టెలికం సర్వీస్ కంపెనీలతో కలిసి పనిచేస్తున్న నోకియా... 5జీ టెక్నాలజీని త్వరగా వాడుకలోకి తెచ్చేందుకు అన్నివిధాలా ప్రయత్నిస్తోంది.
నోకియా ప్రయత్నాల వల్ల సర్వీస్ ప్రొవైడింగ్ కంపెనీలు... మరింత బెటర్ నెట్వర్క్, సర్వీసులను అందించగలవు. కొత్త టెక్నాలజీలను అందించేందుకు బెటర్ ఎక్విప్మెంట్ పొందగలవు. ఈ దిశగా ప్రయత్నిస్తున్న నోకియా... అంచనాల కంటే ముందే ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు తెలిపింది.
5జీ టెక్నాలజీ వల్ల టెలికం సేవలతోపాటూ... డైరెక్ట్ టు హోం (DTH), వైర్డ్ ఇంటర్నెట్ బ్రాడ్‌బ్యాండ్, డేటా సర్వీస్ సెక్టార్లకు ఎంటర్ప్రైజ్ సర్వీసులు, బ్యాంకులు, బిజినెస్ సంస్థలకు అవుట్సోర్సింగ్ ప్రాసెస్, క్లౌడ్ నెట్వర్క్స్ నిర్మాణం, విస్తరణ... సెల్ఫ్ ఆర్గనైజింగ్ నెట్వర్క్స్ విస్తరించేందుకు అవకాశాలు మెరుగవ్వబోతున్నాయి.
నోకియాకి చెందిన చెన్నై ప్లాంట్‌లో ఇప్పటికే 5జీ టెక్నాలజీ ఎక్విప్మెంట్ తయారవుతోంది. దాన్ని కంపెనీ... అమెరికా సహా చాలా దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తోంది. ఇప్పటికే 25కి పైగా దేశాలకు ఈ టెక్నాలజీ ఇండియా నుంచీ ఎగుమతి అయ్యింది.
2020 నుంచీ ఇండియాలో 5జీ సర్వీసులు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. ఈ ఏడాది జులై నుంచీ 5జీ టెక్నాలజీ ట్రయల్ రన్స్ మొదలవ్వబోతున్నాయి. ఇందుకు సంబంధించిన ల్యాబ్‌ను ఇప్పటికే సిద్ధం చేసింది. మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ మార్కెట్తోపాటూ... మాన్యుఫాక్చరింగ్, హెల్త్ కేర్, లాజిస్టిక్స్, ఎడ్యుకేషన్ సెక్టార్ కూడా అవకాశాలు మెరుగవ్వనున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.