Home /News /business /

HOW NEW CREDIT DEBIT CARD RULES FOR ONLINE PAYMENTS WILL AFFECT YOU DETAILS HERE GH VB

Online Payments: క్రెడిట్​, డెబిట్​ కార్డు పేమెంట్ నిబంధనల్లో మార్పులు.. జనవరి 1 నుంచి అమల్లోకి.. వివరాలివే..

(ప్రతీకాత్మ‌క చిత్రం)

(ప్రతీకాత్మ‌క చిత్రం)

Online Payments: ఆన్‌లైన్ చెల్లింపులను సురక్షితం చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. వ్యాపారులు తమ పేమెంట్​ గేట్​వేల నుంచి కస్టమర్ల డేటాను తొలగించాలని ఆదేశించింది. లావాదేవాలను కొనసాగించడానికి డేటాకు బదులుగా ఎన్‌క్రిప్టెడ్ టోకెన్‌‌లను ఉపయోగించాలని సూచించింది.

ఇంకా చదవండి ...
ఆన్‌లైన్ చెల్లింపులను సురక్షితం చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. వ్యాపారులు తమ పేమెంట్​ గేట్​వేల నుంచి కస్టమర్ల డేటాను తొలగించాలని ఆదేశించింది. లావాదేవాలను కొనసాగించడానికి డేటాకు బదులుగా ఎన్‌క్రిప్టెడ్ టోకెన్‌‌లను ఉపయోగించాలని సూచించింది. ఈ కొత్త నిబంధనలను 2022 జనవరి 1 నుంచి తప్పనిసరిగా అమలు చేయాలని కోరింది. కాగా, ఆర్​బీఐ ఆదేశాలను అమలు చేసేందుకు బ్యాంకులు ఇప్పటికే చర్యలు చేపట్టాయి. క్రెడిట్​, డెబిట్​ కార్డల సమాచారాన్ని తమ డేటా బేస్​ నుంచి తొలగిస్తున్నామని బ్యాంకులు ఇప్పటికే కస్టమర్లకు సందేశాలు పంపిస్తున్నాయి.

Hyundai Verna: లాటిన్ NCAP క్రాష్ టెస్ట్‌లో హ్యుందాయ్ వెర్నా పేలవం.. కేవలం జీరో స్టార్ సేఫ్టీ రేటింగ్‌ సొంతం..


‘‘మా వెబ్​సైట్​/యాప్​లో సేవ్​ అయిన మీ హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ కార్డు వివరాలను తొలగిస్తున్నాం. ఇకపై మీరు చెల్లింపులు చేసేందుకు కార్డుల వివరాలు ఇచ్చే బదులు టోకెనైజేషన్​ ఉపయోగించుకోవాలి. ఆర్​బీఐ ఆదేశాల మేరకు జనవరి 1 నుంచి దీన్ని అమలు చేయనున్నాం.” అని హెచ్​డీఎఫ్​సీ బ్యాంకు తన కస్టమర్ల మొబైల్​ నంబర్లకు ఎస్​ఎంఎస్​లు పంపిస్తోంది.

Amazon: అమెజాన్‌లో స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్ టీవీలపై మరో ఎక్స్‌క్లూజివ్‌ సేల్‌.. డీల్స్ ఇవే..!


ఆర్​బీఐ ఏం చెప్పింది?
2020 మార్చిలోనే ఆర్​బీఐ టోకెనైజేషన్​ మార్గదర్శకాలను జారీ చేసింది. ఇకపై వ్యాపారులు కస్టమర్ల కార్డు వివరాలను తమ వెబ్​సైట్లు, యాప్స్​లో సేవ్​ చేయవద్దని ఆదేశించింది. టోకెనైజేషన్​కు సంబంధించిన నిబంధనలు అమలు చేసేందుకు ఈ ఏడాది చివరి వరకు అవకాశం ఇస్తున్నట్లు 2021 సెప్టెంబర్​లో ఆర్​బీఐ తెలిపింది. ఇప్పటి వరకు భద్రపర్చిన సమాచారాన్ని 2022, జనవరి 1లోపు తొలగించాలని అన్ని మర్చెంట్​లను కోరింది.

టోకెనైజేషన్ అంటే ఏమిటి?
మీరు ట్రాన్సాక్షన్స్​ చేసేటప్పుడు డెబిట్​ లేదా క్రెడిట్​ కార్డు వివరాలను నమోదు చేస్తుంటారు. కార్డు మీద ఉన్న 16 అంకెలు, కార్డు ఎక్స్​పైరీ డేట్​, సీవీవీ, వన్​టైమ్​ పాస్​వర్డ్, పిన్​ వివరాలు ఎంటర్​ చేస్తుంటారు. అవన్నీ సరిగ్గా ఉంటేనే ట్రాన్సాక్షన్​ విజయవంతంగా పూర్తవుతుంది. అయితే ఈ ప్రక్రియ ఇకపై మరింత సులభతరం కానుంది. ఈ ప్రక్రియనంతా ఇకపై టోకెనైజేషన్​ భర్తీ చేస్తుంది. ఇప్పటి నుంచి ట్రాన్సాక్షన్స్​ కోసం మీ కార్డు వివరాలు నమోదు చేయాల్సిన అవసరం లేదు.

WazirX Survey: మహిళల ప్రాధాన్యం బిట్‌కాయిన్‌, మగవాళ్లకు షిబా ఇను.. భారీగా పెరిగిన క్రిప్టో ఇన్వెస్ట్‌మెంట్లు..


బదులుగా మీ కార్డుకు సంబంధించిన టోకెన్​ను నమోదు చేస్తే చాలు. జనవరి నుంచి కార్డుల ద్వారా మీరు లావాదేవీలు చేపట్టాలంటే మొదటిసారి మీ అంగీకారం తెలియజేస్తూ అదనపు అథెంటికేషన్​ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మీ కార్డు నెట్​వర్క్​ సంస్థకు టోకెనైజేషన్ రిక్వెస్ట్ వెళ్తుంది. వారు టోకెన్‌​ సృష్టించి మర్చంట్​కు పంపిస్తారు. అప్పుడు మర్చెంట్​ మీ టోకెన్‌​ నంబర్ సేవ్​ చేసుకుంటాడు. మీ సీవీవీ, ఓటీపీ ఎంటర్​ చేస్తే చాలు మీ ట్రాన్సాక్షన్​ పూర్తవుతుంది.

Ambulance Driver: అతడు ఒక అంబులెన్స్ డ్రైవర్.. ఉదయం లేవగానే కోటీశ్వరుడు అయ్యాడు.. ఎలా అంటే..


టోకెనైజేషన్ సురక్షితమేనా?
టోకెనైజేషన్ ద్వారా కార్డ్ వివరాలను ఎన్‌క్రిప్టెడ్ పద్ధతిలో సేవ్ చేసినప్పుడు మీ డేటాకు మరింత భద్రత లభిస్తుంది. అంతేకాదు, ఈ విధానంతో ట్రాన్సాక్షన్​లో మోసం జరిగే అవకాశం ఉండదు. సులభంగా చెప్పాలంటే, మీరు మీ డెబిట్/క్రెడిట్ కార్డ్ వివరాలను టోకెన్‌ రూపంలో షేర్ చేసినప్పుడు రిస్క్ తగ్గుతుంది. కార్డ్ లావాదేవీలను మరింత సురక్షితంగా, వినియోగదారులకు సౌకర్యవంతంగా చేసేందుకు రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా ఈ చొరవ తీసుకుంది.
Published by:Veera Babu
First published:

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు