ఎక్కువ క్రెడిట్ కార్డులుంటే సిబిల్ స్కోర్‌ తగ్గుతుందా?

ఎక్కువగా క్రెడిట్ కార్డులున్నా, లోన్స్ ఉన్నా మీ క్రెడిట్ స్కోర్ తగ్గిపోతుంది. వీలైనంత వరకు ఎక్కువ క్రెడిట్ కార్డులు, లోన్లకు దూరంగా ఉండటమే మంచిది.

news18-telugu
Updated: September 25, 2018, 1:19 PM IST
ఎక్కువ క్రెడిట్ కార్డులుంటే సిబిల్ స్కోర్‌ తగ్గుతుందా?
ప్రతీకాత్మక చిత్రం
 • Share this:
ఒకప్పుడు క్రెడిట్ కార్డులు రావాలంటే చాలా కష్టం. బ్యాంకులు అనేక రకాలుగా పరీక్షించి, పరిశీలించి కార్డులు ఇచ్చేవి. కానీ ఇప్పుడు బ్యాంకుల మధ్య పోటీ పెరిగిపోవడంతో క్రెడిట్ కార్డులు ఇచ్చే పద్ధతి కాస్త సులువైంది. బ్యాంకులు ఇస్తున్నాయి కదా అని ఒక్కొక్కరు నాలుగైదు క్రెడిట్ కార్డులు తీసుకుంటున్నారు. విచ్చలవిడిగా వాడుతున్నారు. అప్పులు చెల్లించలేక తిప్పలు పడుతున్నారు. అయితే ఇలా ఎక్కువగా క్రెడిట్ కార్డులు ఉండటంతో చాలా నష్టాలున్నాయి. క్రెడిట్ స్కోర్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.

ఎక్కువగా క్రెడిట్ కార్డులు, లోన్లు ఉంటే నష్టాలేంటీ?


 • మీరు ఎక్కువగా క్రెడిట్ కార్డు వాడుతున్నారంటే... ఎక్కువగా అప్పులు చేసేవారి జాబితాలో ఉన్నట్టే.

 • మీ ఆదాయానికి మించి అప్పులు చేస్తున్నారంటే లేట్ పేమెంట్స్ చేసే అవకాశాలెక్కువ.

 • ఎక్కువగా క్రెడిట్ కార్డులున్నా, లోన్స్ ఉన్నా మీ క్రెడిట్ స్కోర్ తగ్గిపోతుంది.

 • ఆ తర్వాత ఏవైనా లోన్స్‌కి దరఖాస్తు చేసుకున్నా హై-రిస్క్ కస్టమర్‌గా బ్యాంకు భావిస్తుంది.
 • 2-3 క్రెడిట్ కార్డులు లేదా లోన్స్ ఉండటం వల్ల క్రెడిట్ స్కోర్‌కు వచ్చే ఇబ్బందేమీ లేదు.

 • అంతకన్నా ఎక్కువగా కార్డులు ఉంటే క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం చూపిస్తుంది.

 • మీ చెల్లింపుల చరిత్ర క్రెడిట్ స్కోర్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.

 • గడువులోగా వాయిదాలు చెల్లిస్తే క్రెడిట్ స్కోర్‌ పెరుగుతుంది.

 • అందుకే క్రెడిట్ కార్డ్ బిల్లులు, ఈఎంఐలు ఆలస్యంగా చెల్లించొద్దు.

 • ఒక్కసారి గడువులోగా చెల్లించకపోయినా సిబిల్ స్కోర్ 80-110 పాయింట్లు పడిపోతుంది.

 • క్రెడిట్ స్కోర్‌పై చెల్లింపుల చరిత్ర ప్రభావం 35 శాతం ఉంటుంది.

 • ఎక్కువ క్రెడిట్ అకౌంట్లు ఉంటే క్రెడిట్ స్కోర్‌పై 30 శాతం ప్రభావం చూపిస్తుంది.

 • మీ క్రెడిట్ లిమిట్‌లో 60 శాతం కన్నా ఎక్కువ వాడకపోవడం మంచిది.

 • లోన్లకు, క్రెడిట్ కార్డులకు ఎక్కువగా దరఖాస్తులు చేసినా క్రెడిట్ స్కోర్ తగ్గిపోతుంది.

 • వీలైనంత వరకు ఎక్కువ క్రెడిట్ కార్డులు, లోన్లకు దూరంగా ఉండటమే మంచిది.ఇవి కూడా చదవండి:

అప్పు కావాలా? అమెజాన్ ఇస్తుంది!

క్రెడిట్ కార్డులో ఈ ఛార్జీలు మీకు తెలుసా?

క్రెడిట్ కార్డ్ పేమెంట్స్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు!

క్రెడిట్ కార్డు ఉపయోగిస్తే లాభాలేంటో తెలుసా?
Published by: Santhosh Kumar S
First published: September 25, 2018, 11:17 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading