Home /News /business /

HOW MUCH TAX DO WE PAY ON EQUITY INVESTMENTS HERE DETAILS NS GH

Tax on equity investments: ఈక్విటీ పెట్టుబడులకు వర్తించే పన్ను నిబంధనలేంటి? ఏ వ్యవధికి ఎంత పన్ను చెల్లించాలి? తెలుసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

పెట్టుబడిదారుల పోర్టుఫోలియోలో ఈక్విటీ అన్నది ఒక ముఖ్యమైన భాగం. వేర్వేరు ఈక్విటీ ఇన్‌స్ట్రూమెంట్స్‌కు వేర్వేరు పన్ను నిబంధనలు ఉంటాయి.

ఈక్విటీ ఆస్తులకు సంబంధించి వేర్వేరు పన్ను (Tax) నిబంధనలు ఉంటాయి. కాబట్టి పెట్టుబడిదారు పన్నులపరంగా కూడా తమకు ఏది సరిపోతుందనే విషయాన్ని జాగ్రత్తగా చూడాలి. పెట్టుబడిదారుల పోర్టుఫోలియోలో ఈక్విటీ అన్నది ఒక ముఖ్యమైన భాగం. వేర్వేరు ఈక్విటీ ఇన్‌స్ట్రూమెంట్స్‌కు వేర్వేరు పన్ను నిబంధనలు ఉంటాయి. ఉదాహరణకు కేపిటల్‌ గెయిన్స్‌ పన్ను అన్నది హోల్డింగ్‌ వ్యవధిని బట్టి ఉంటుంది. స్టాక్స్‌, ఈక్విటీ సంబంధిత మ్యూచువల్‌ ఫండ్స్‌పరంగా చూస్తే ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలాన్ని దీర్ఘకాలంగా పరిగణిస్తారు. అదే, యూలిప్స్‌ విషయంలో ఇది వర్తించదు. ఒక ఉత్పత్తి నుంచి వచ్చే మొత్తం రాబడిని పన్నులు తగ్గిస్తాయి. ఈక్విటీ పెట్టుబడుల్లో వివిధ రకాల పన్నులనుఒకసారి పరిశీలిద్దాం.

లిస్ట్‌ అయిన స్టాక్స్‌ – (దీర్ఘకాలం: ఒక సంవత్సరం కంటే ఎక్కువ వ్యవధి)

సెక్యూరిటీ ట్రాన్సక్షన్‌ ట్యాక్స్

డెలివరీ 0.1% (విక్రేత, కొనుగోలుదారు చెల్లించాలి)

ఇంట్రా డే 0.0225% (విక్రేత చెల్లించాలి)

డివిడెండ్‌పై పన్ను :స్లాబ్‌ రేట్‌

స్వల్పకాలిక కేపిటల్‌ గెయిన్‌ పన్ను : 15.6%

దీర్ఘకాలిక కేపిటల్‌ గెయిన్‌ పన్ను : 10.4%
Income tax notices: ఈ రకంగా నగదు లావాదేవీలు జరిపితే.. ఐటీ నోటీసులు రావొచ్చు..

ఈక్విటీ ఆధారిత మ్యూచువల్‌ ఫండ్స్‌: (దీర్ఘకాలం: ఒక సంవత్సరం కంటే ఎక్కువ వ్యవధి)

సెక్యూరిటీ ట్రాన్సక్షన్‌ ట్యాక్స్ : 0.001%

డివిడెండ్‌పై పన్ను :స్లాబ్‌ రేట్‌

స్వల్పకాలిక కేపిటల్‌ గెయిన్‌ పన్ను : 15.6%

దీర్ఘకాలిక కేపిటల్‌ గెయిన్‌ పన్ను : 10.4%
New Tax Rules: వ్యాపారులకు అలర్ట్... జనవరి 1 నుంచి కొత్త జీఎస్‌టీ రూల్స్

యూనిట్‌ లింక్డ్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్స్: (దీర్ఘకాలం: ఒక సంవత్సరం కంటే ఎక్కువ వ్యవధి)

సెక్యూరిటీ ట్రాన్సక్షన్‌ ట్యాక్స్ : డెలివరీ 0.001% (విక్రేత చెల్లించాలి)

డివిడెండ్‌పై పన్ను :స్లాబ్‌ రేట్‌

స్వల్పకాలిక కేపిటల్‌ గెయిన్‌ పన్ను : 15.6%

దీర్ఘకాలిక కేపిటల్‌ గెయిన్‌ పన్ను : 10.4%
Income Tax: కొత్త, పాత పన్ను వ్యవస్థల్లో ఏది మంచిది ..? టాక్స్ ఎలా చెల్లిస్తే బెటర్. తెలుసుకోండి

ఫిబ్రవరి 2021 నుంచి అమ్మకం, సరెండర్‌ లేదా ఇన్సూరెన్స్‌ కంపెనీకి చెందిన ఈక్విటీ ఆధారిత ఫండ్‌ మ్యాచురిటీపై రిడెంప్షన్‌ లేదా యూనిట్‌ లింక్డ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ (యూలిప్‌) పాక్షిక విత్‌డ్రాయల్‌పైన సెక్యూరిటీ ట్రాన్సక్షన్ పన్ను వర్తిస్తుంది. ఫిబ్రవరి 1న లేదా ఆ తర్వాత యూలిప్స్‌ జారీ చేసే మ్యాచురిటీ మొత్తం, అది ఆ పాలసీ వ్యవధిలో ఏ సంవత్సరంలోనైనా చెల్లించే ప్రీమియం మొత్తం రూ.2.5 లక్షలు దాటినట్టు అయితే ఆ మొత్తంపై కేపిటల్‌ గెయిన్స్‌ పన్ను విధించడం జరుగుతుంది. ఒకవేళ ఒకటి కంటే ఎక్కువ యూలిప్స్‌ ఉంటే రూ.2.5 లక్షల పరిమితిని మొత్తంగా పరిగణించడం జరుగుతుంది. మరణం తర్వాత అందే మొత్తం వార్షిక ప్రీమియం పరిమితితో సంబంధం లేకుండా మినహాయింపు లభిస్తుంది.
Published by:Nikhil Kumar S
First published:

Tags: Income tax, Investment Plans, Money

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు