NPS Investment: తక్కువ పెట్టుబడితో అధిక ప్రయోజనం.. ఇలా చేస్తే నెలకు రూ. లక్ష పెన్షన్.. వివరాలివే

(ప్రతీకాత్మక చిత్రం)

పదవీ విరమణ చేసిన తరువాత నెలకు ఎంత పెన్షన్ అందుకోవాలనుకుంటున్నారనే దానిపై మనం నెలవారీ పెట్టాల్సిన పెట్టుబడి ఆధారపడి ఉంటుంది. నెలకు రూ.1 లక్ష పెన్షన్ రావాలంటే ఈ స్కీమ్‌లో ఎంత పెట్టుబడి పెట్టాలో తెలుసుకుందాం.

  • Share this:
ఉద్యోగం చేసినంత కాలం ఎవరికైనా జీతం వస్తుంది. పదవీ విరమణ చేస్తే వీరిలో కొందరికి పెన్షన్  (Pension)వస్తుంది. వ్యాపారాలు చేసే వారికి ఆ అవకాశం లేదు. అందుకే రిటైర్‌మెంట్‌ను దృష్టిలో పెట్టుకొని సంపాదిస్తున్నప్పుడే జాతీయ పెన్షన్ స్కీమ్ (National Pension Scheme)లో నెలవారీ పెట్టుబడి పెట్టడం ద్వారా మెచ్యూరిటీ తరువాత పెన్షన్ అందుకోవచ్చు. ఇలా ప్రతినెలా అందే పెన్షన్‌తో జీవితం సాఫీగా సాగిపోతుంది. అయితే పదవీ విరమణ (Retirement) చేసిన తరువాత నెలకు ఎంత పెన్షన్ అందుకోవాలనుకుంటున్నారనే దానిపై మనం నెలవారీ పెట్టాల్సిన పెట్టుబడి ఆధారపడి ఉంటుంది. నెలకు రూ.1 లక్ష పెన్షన్ రావాలంటే ఈ స్కీమ్‌లో ఎంత పెట్టుబడి పెట్టాలో తెలుసుకుందాం.

ప్రభుత్వ పథకమైన జాతీయ పెన్షన్ స్కీమ్ (National Pension Scheme)లో ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ. 2 లక్షల పెట్టుబడి వరకు పన్ను రాయితీ పొందవచ్చు. సెక్షన్ 80సి కింద రూ.లక్షన్నర, సెక్షన్ 80 సీసీడీ ద్వారా మరో రూ.50,000 వరకు పన్ను రాయితీ పొందవచ్చు. మెచూరిటీ తరువాత నెలకు లక్ష రూపాయల పెన్షన్ అందుకోవడానికి అనేక పెట్టుబడి మార్గాలు ఉన్నాయి.
Used Car: పాత కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే, ఈ కీలక విషయాలను తప్పక తెలుసుకోండి

30 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేస్తే..
సాధారణంగా 60 శాతం ఈక్విటీ, మరో 40 శాతం డెట్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేందుకు జాతీయ పెన్షన్ స్కీమ్ అనుమతిస్తుంది. ఈ నిధులను పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్ మెంట్ అథారిటీ నియంత్రిస్తుంది. ఈక్విటీ, డెట్ మార్కెట్లలో సమతుల్యత పాటిస్తూ పెట్టుబడులు పెట్టడం ద్వారా ఏటా సగటున 10 నుంచి 10.40 శాతం ఆదాయం వచ్చే అవకాశం ఉంది. 30 సంవత్సరాలు పెట్టుబడి పెట్టడం, అందులో మెచూరిటీ మొత్తంలో 60 శాతం యాన్యుటీ (annuity)కి మళ్లించడం ద్వారా ఏటా దానిపై 6 శాతం రాబడి లభిస్తుంది. ఇలా నెలకు రూ.15,000 చొప్పున 30 సంవత్సరాల పాటు ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా మెచూరిటీ తరువాత నెలకు రూ.1 లక్ష చొప్పున పెన్షన్ పొందవచ్చు.
LIC Fund: ఎల్‌ఐసీ బ్యాలెన్స్‌డ్ అడ్వాంటేజ్ ఫండ్ ఎన్‌ఎఫ్‌ఓ పనితీరు ఎలా ఉంది? దీంట్లో పెట్టుబడి పెట్టవచ్చా?

20 ఏళ్ల తరువాత నెలకు రూ.1 లక్ష రావాలంటే
ఇదే స్కీములో 20 సంవత్సరాల తరువాత నెలకు రూ.1 లక్ష పెన్షన్ తీసుకోవాలంటే నెలకు రూ.32 వేలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఇందులో ఏటా కనీసం 12 శాతం ఆదాయం లభిస్తేనే మెచూరిటీ తరువాత నెలకు రూ.1లక్ష పెన్షన్ అందుతుంది.
SBI New Feature: మీరు ఎస్‌బీఐ కస్టమరా? ఈ కొత్త ఫీచర్ మీకోసమే

10 ఏళ్ల తరవాత నెలకు లక్ష రావాలంటే..
పది సంవత్సరాలు జాతీయ పెన్షన్ స్కీమ్ లో పెట్టుబడి పెట్టాలనుకుంటే.. నెలకు కనీసం రూ.1.3 లక్షలు పెట్టుబడి పెట్టాలి. అదే సమయంలో ఈ మొత్తం 15 శాతం ఆదాయం లభించే పథకాల్లో పెట్టాల్సి ఉంటుంది, ఇదే స్కీమ్‌లో నెలకు రూ.32,000 పెట్టుబడి పెట్టడం ద్వారా 18 సంవత్సరాల తరువాత నెలకు రూ.1 లక్ష పెన్షన్ పొందవచ్చు.

పెట్టుబడి పెట్టే ముందు ఇవి తెలసుకోండి..
ద్రవ్యోల్బణం సగటున 6 శాతం ఉంటే, 45 సంవత్సరాల తరువాత లక్ష రూపాయలు, రూ.7500తో సమానం. పెట్టుబడిదారుడికి 85 సంవత్సరాలు వచ్చినప్పుడు రూ.7500 సరిపోకపోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అందువల్ల నెలకు రూ.10,000 ఈక్వీటీ ఫండ్స్ లో 30 సంవత్సరాలు పెట్టుబడి పెడితే ఇదే కాలంలో రూ.6.92 కోట్లు ఆదాయం వచ్చే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
Published by:Nikhil Kumar S
First published: