Maruti Car: నెలకు రూ.5 వేల కన్నా తక్కువ EMIతో కొత్త కారు కొనండి...ఇలా...

దేశంలో అతిపెద్ద కార్ల సంస్థ మారుతి, అలాగే దేశంలో అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI ప్రత్యేక ఆఫర్లతో ముందుకు వచ్చింది. రూ. 5000 కన్నా తక్కువ EMIతో మారుతి కారును ఎలా కొనుగోలు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Krishna Adithya | news18-telugu
Updated: July 14, 2020, 9:51 PM IST
Maruti Car: నెలకు రూ.5 వేల కన్నా తక్కువ EMIతో కొత్త కారు కొనండి...ఇలా...
Maruti Suzuki (Image: News18.com)
  • Share this:
కరోనా మహమ్మారి వేళ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ వెహికిల్స్ వాడకం భవిష్యత్తులో పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే బస్సుల్లోనూ, రైళ్లలోనూ ప్రయాణిస్తే వైరస్ వ్యాప్తి పెరిగే అవకాశం ఉంది. దీంతో ప్రతీ ఒక్కరూ ఇకపై తమ పనులు కోసం బయటకు వెళ్లేందుకు సొంత వాహనాలనే ఆశ్రయించాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో ఇప్పుడు చాలా మంది కొత్త కార్లను కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు. దీనికి తగ్గట్టే అటు కార్ల కంపెనీలు, ఇటు బ్యాంకులు అనేక రాయితీలు, ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కారు కొనాలనుకునే వారు వాహన రుణం పొందడానికి ఎలా ప్రయత్నం చేయాలో తెలుసుకుందాం...

ఇప్పుడు కొన్ని బ్యాంకులు వార్షికాదాయం రూ.1లక్ష ఉన్నా చాలు లోన్లు ఇస్తామంటున్నాయి. మరికొన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు నెలకు రూ.10వేల ఆదాయం ఉన్నవారికి సైతం కారు రుణం ఇవ్వడానికి సిద్ధం అంటున్నాయి. కాబట్టి, రుణం తీసుకునే ముందు మీ ఆదాయాన్ని బట్టి ఏ బ్యాంకు నుంచి సులభంగా రుణం వస్తుందనేది తెలుసుకోవాలి.

అయితే దేశంలో అతిపెద్ద కార్ల సంస్థ మారుతి, అలాగే దేశంలో అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI ప్రత్యేక ఆఫర్లతో ముందుకు వచ్చింది. రూ. 5000 కన్నా తక్కువ EMIతో మారుతి కారును ఎలా కొనుగోలు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మారుతి ఆల్టో 800 ఆన్‌రోడ్ ధర :

కారు ధర ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా పన్ను విధించడంతో కార్ల రేట్లు మారుతుంటాయి. దీంతో ఆన్‌రోడ్ ధరలో వ్యత్యాసం ఉంటుంది. ఉదాహరణగా హైదరాబాద్‌లో మారుతి ఆల్టో 800 ను కొనాలనుకుంటే
- ఎక్స్ షోరూమ్ ధర రూ. 2,94,800
- ఆర్‌టీఓ ఫీజు రూ. 12,622- బీమా రూ. 16,419
- ఇతర ఖర్చులు రూ. 29,72O
- ఆన్‌రోడ్ ధర రూ. 3,26,813.

మారుతి ఆల్టో 800 ధర 2.94 లక్షల రూపాయల నుండి ప్రారంభమవుతుంది. అతి తక్కువ ధర కలిగిన మోడల్ మారుతి ఆల్టో 800 ఎస్‌టిడి, ఇక ఇందులోనే అత్యధిక ధర కలిగిన మోడల్ మారుతి ఆల్టో 800 ఎల్‌ఎక్స్ఐ సిఎన్‌జి మోడల్. దీని ధర రూ. 4.36 లక్షలుగా పలుకుతోంది.

ఇప్పుడు 5000 రూపాయల కన్నా తక్కువ EMIతో SBI కారు లోన్ పొందడం ఎలా:
SBI కారు రుణాలను చాలా తేలికగా పొందే వీలుంది. SBI కారు ఆన్ రోడ్ ధర వద్ద రుణాలు కూడా అందిస్తుంది. హైదరాబాద్ లో మారుతి ఆల్టో 800 పెట్రోల్ లేదా బేస్ మోడల్ తీసుకుంటే, మీరు దానిని సుమారు 3.27 లక్షల రూపాయలకు పొందవచ్చు. ఇలాంటి పరిస్థితిలో, మీకు కావాలంటే, మీరు 3 లక్షల రూపాయల రుణం తీసుకోవచ్చు.

3 లక్లల రుణం మీద ఎంత ఈఎంఐ కట్టాలో చూడండి...
- SBI కారు రుణం 3 లక్షలు
- ప్రస్తుతం బ్యాంకు 8 శాతం వడ్డీని వసూలు చేస్తోంది
- 7 సంవత్సరాలు అంటే 84 నెలల్లో ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది.
- ఇప్పుడు నెలవారీ మీరు చెల్లించాల్సిన EMI రూ .4,676

కేవలం ఆల్టో కారు మాత్రమే కాదు.. అలాగే మీరు 5 లక్షల రూపాయల విలువైన కారు కొనాలనుకుంటే, 7 సంవత్సరాల పాటు మీరు చెల్లించాల్సిన ఈఎంఐ 7,793 రూపాయలు.

బ్యాంకుల కారు లోన్స్ వడ్డీ రేట్లు తెలుసుకోండి

ప్రభుత్వ రంగ బ్యాంకుల నుండి ప్రైవేట్ బ్యాంకులు మరియు దేశంలోని ఇతర ఆర్థిక సంస్థలు కారు రుణాలు ఇస్తాయి. ఇది కాకుండా, కార్ కంపెనీలు కూడా ఫైనాన్స్ చేస్తాయి. అటువంటి పరిస్థితిలో, మీరు ఎక్కడి నుంచైనా కారు రుణం తీసుకోవచ్చు. అయితే దేశంలోని ప్రధాన బ్యాంకులను పరిశీలిద్దాం.

- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 8.00 శాతం నుండి 10.75 శాతానికి
- హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 8.80% నుండి 10.00% వరకు
- యాక్సిస్ బ్యాంక్ 9.05% నుండి 11.30% వరకు
- ఐసిఐసిఐ బ్యాంక్ 9.30% నుండి 14.25%
- కెనరా బ్యాంక్ యొక్క 7.70% నుండి 10.30% వరకు
- ఫెడరల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 8.90% నుండి 14.20%
- యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7.80% నుండి 10.90%
Published by: Krishna Adithya
First published: July 14, 2020, 7:07 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading