వేతనజీవులు 2018-19లో ఎంత పన్ను ఆదా చేయొచ్చో తెలుసా?

అసలు చాలామందికి ఏఏ పన్ను మినహాయింపులు ఉంటాయో చూడా సరిగ్గా తెలియదు. ఆదాయపు పన్ను చట్టం, 1961 ప్రకారం పన్ను ఆదా చేసే అవకాశాలను ప్రభుత్వమే కల్పించింది. వాటిని ఉపయోగించుకుంటే పన్నులు మొత్తం లేదా వీలైనంత తక్కువ మినహాయించుకోవచ్చు.

news18-telugu
Updated: January 3, 2019, 6:04 PM IST
వేతనజీవులు 2018-19లో ఎంత పన్ను ఆదా చేయొచ్చో తెలుసా?
వేతనజీవులు 2018-19లో ఎంత పన్ను ఆదా చేయొచ్చో తెలుసా? (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ఇన్‌కమ్ ట్యాక్స్... ఈ మాట వింటే వేతనజీవుల గుండెల్లో ఝల్లుమంటుంది. కష్టపడి సంపాదించుకున్న సొమ్మును పన్నుల రూపంలో చెల్లించాల్సి వస్తుందేమో అన్న ఆందోళన వెంటాడుతుంది. వేతనజీవులు ఖచ్చితంగా పన్నులు చెల్లించాల్సిందే. అయితే కాస్త తెలివిగా ప్లాన్ చేసుకొని పెట్టుబడులు పెడితే ఆదాయపు పన్నును తగ్గించుకోవచ్చు. కానీ నిర్లక్ష్యంతో మొదట్లో పట్టించుకోరు. గడువు దగ్గరకు వచ్చాక కంగారుపడుతుంటారు. అసలు చాలామందికి ఏఏ పన్ను మినహాయింపులు ఉంటాయో చూడా సరిగ్గా తెలియదు. ఆదాయపు పన్ను చట్టం, 1961 ప్రకారం పన్ను ఆదా చేసే అవకాశాలను ప్రభుత్వమే కల్పించింది. వాటిని ఉపయోగించుకుంటే పన్నులు మొత్తం లేదా వీలైనంత తక్కువ మినహాయించుకోవచ్చు.

హౌజ్ రెంట్ అలవెన్స్(HRA): ఇంటి అద్దె కోసం ఇచ్చే అలవెన్స్. జీతంలో హెచ్ఆర్ఏ చాలా ముఖ్యమైన భాగం. ఉద్యోగి అద్దె ఇంట్లో ఉంటున్నట్టయితే పలు నిబంధనల ప్రకారం హెచ్ఆర్ఏ క్లెయిమ్ చేసుకొని పన్ను మినహాయింపు పొందొచ్చు. మెట్రో నగరాల్లో అయితే వేతనంలో 50%, నాన్-మెట్రో నగరాల్లో అయితే 40% వరకు హెచ్ఆర్ఏ పొందొచ్చు.

వేతనజీవులు 2018-19లో ఎంత పన్ను ఆదా చేయొచ్చో తెలుసా? | How much income tax salaried individuals can save for FY 2018-19?
ప్రతీకాత్మక చిత్రం


హోమ్ లోన్: హోమ్ లోన్‌తో కొన్న ఇంట్లో ఉంటున్నవాళ్లు ఈఎంఐలపై వార్షికంగా రూ.2 లక్షల వరకు పన్ను మినహాయింపులు పొందొచ్చు. సీనియర్ సిటిజన్లు అయితే రూ.3 లక్షల వరకు మినహాయింపు లభిస్తుంది.



స్టాండర్డ్ డిడక్షన్: గతంలో వైద్యం, రవాణా ఖర్చుల కోసం వేర్వేరుగా అలవెన్సులు ఉండేవి. 2018-19లో రెండింటికీ కలిపి రూ.40,000 మినహాయింపులు ఇస్తోంది ప్రభుత్వం. గతంతో పోలిస్తే రూ.5800 ఎక్కువ పన్ను మినహాయింపు లభిస్తోంది.

సేవింగ్స్: పన్ను ఆదా చేసుకోవడానికి అనేక అవకాశాలను కల్పించింది ఆదాయపు పన్ను శాఖ. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(పీపీఎఫ్), లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ప్రీమియం, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్(ఎన్ఎస్‌సీ), సుకన్య సమృద్ధి యోజన(ఎస్ఎస్‌వై), ఇంటి రుణం అసలు చెల్లింపు, ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్(ఈఎస్ఎస్), బ్యాంకులు, పోస్ ఆఫీసుల్లో 5 ఏళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లు, పిల్లల చదువుల కోసం ట్యూషన్ ఫీజ్ లాంటి వాటిపై రూ.1,50,000 వరకు మినహాయింపులు పొందొచ్చు.

హోమ్ లోన్: హోమ్ లోన్‌తో కొన్న ఇంట్లో ఉంటున్నవాళ్లు ఈఎంఐలపై వార్షికంగా రూ.2 లక్షల వరకు పన్ను మినహాయింపులు పొందొచ్చు. సీనియర్ సిటిజన్లు అయితే రూ.3 లక్షల వరకు మినహాయింపు లభిస్తుంది.
ప్రతీకాత్మక చిత్రం
Loading...
పెన్షన్ స్కీమ్: నేషనల్ పెన్షన్ స్కీమ్(ఎన్‌పీఎస్)‌లో జమ చేయడం ద్వారా ఏడాదికి రూ.50,000 అదనంగా మినహాయింపు పొందొచ్చు. 2009 వరకు నేషనల్ పెన్షన్ స్కీమ్‌లో పెట్టుబడులు కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే పరిమితంగా ఉండేది. ప్రస్తుతం ఎవరైనా ఎన్‌పీఎస్‌లో జమ చేయొచ్చు.

మెడికల్: మెడికల్ ఇన్స్యూరెన్స్‌ చెల్లింపులపైనా పన్ను మినహాయింపు పొందొచ్చు. ఉద్యోగులు తనతో పాటు జీవిత భాగస్వామి, పిల్లల పేరు మీద రూ.25,000 వరకు మెడికల్ ఇన్స్యూరెన్స్ చెల్లించి పన్ను మినహాయింపు పొందొచ్చు. దాంతో పాటు 60 ఏళ్లు అంతకన్నా ఎక్కువ ఉన్న తల్లిదండ్రులకు మెడికల్ ఇన్స్యూరెన్స్ తీసుకుంటే అదనంగా రూ.50,000 మినహాయింపు పొందొచ్చు.

హోమ్ లోన్: హోమ్ లోన్‌తో కొన్న ఇంట్లో ఉంటున్నవాళ్లు ఈఎంఐలపై వార్షికంగా రూ.2 లక్షల వరకు పన్ను మినహాయింపులు పొందొచ్చు. సీనియర్ సిటిజన్లు అయితే రూ.3 లక్షల వరకు మినహాయింపు లభిస్తుంది.
ప్రతీకాత్మక చిత్రం


ఎడ్యుకేషన్: ఉన్నత విద్య కోసం ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటే కొంతవరకు పన్ను మినహాయింపు లభిస్తుంది. తల్లిదండ్రులు పిల్లల కోసం ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటే సెక్షన్ 80ఈ కింద ఆ ఆర్థిక సంవత్సరంలో చెల్లించిన వడ్డీకి మినహాయింపు పొందొచ్చు. ఇలా ఎనిమిది ఆర్థిక సంవత్సరాల వరకు పొందొచ్చు. అయితే ఇది రుణంలో అసలుకు వర్తించదు. కేవలం వడ్డీకి మాత్రమే వర్తిస్తుంది.

మొత్తం పన్ను మినహాయింపు: పన్ను చెల్లింపుదారులు పైన వివరించినవన్నీ క్లెయిమ్ చేసుకుంటే రూ.6,15,000 పన్ను మినహాయింపులు పొందొచ్చు. దాదాపు రూ.1,91,880(ట్యాక్స్ రేట్ 30%+సెస్ 4%) పన్ను ఆదా చేయొచ్చు. అయితే వేతనజీవులు తమ ఈ మినహాయింపుల్ని సరిగ్గా అర్థం చేసుకొని తమ అవసరాలకు తగ్గట్టుగా ఉపయోగించుకోవడం మంచిది.

ఇవి కూడా చదవండి:

వాట్సప్‌లో స్టేటస్ వాడుతున్నవారికి బ్యాడ్ న్యూస్

స్మార్ట్‌ఫోన్ వ్యసనాన్ని తగ్గించుకోవడానికి 5 టిప్స్

2019లో 5 బెస్ట్ ఆండ్రాయిడ్ కెమెరా ఫోన్లు ఇవే...

మీ స్మార్ట్‌ఫోన్ పేలకుండా ఏం చేయాలంటే...
First published: January 3, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...