హోమ్ /వార్తలు /బిజినెస్ /

ఈ రోజుల్లో ఒక వ్యక్తి, ఒక ఫ్యామిలీకి ఎంత హెల్త్ ఇన్సూరెన్స్ అవసరం? పాలసీ తీసుకునే ముందు ఏమేం చెక్ చేసుకోవాలి?

ఈ రోజుల్లో ఒక వ్యక్తి, ఒక ఫ్యామిలీకి ఎంత హెల్త్ ఇన్సూరెన్స్ అవసరం? పాలసీ తీసుకునే ముందు ఏమేం చెక్ చేసుకోవాలి?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఈ రోజుల్లో ఆస్పత్రికి వెళితే ఆస్తులమ్ముకోవాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. అయితే, కొంచెం తెలివిగా ఆలోచించి హెల్త్ ఇన్సూరెన్స్ లు తీసుకుంటే ఆస్తులు అమ్ముకోవాల్సిన దుస్థితి రాదు. అయితే, అసలు ఎంత మొత్తానికి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనే డౌట్ చాలా మందికి ఉంటుంది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada | Visakhapatnam | Guntur

కొవిడ్‌ 19 ప్రపంచాన్ని కుదిపేసిన తర్వాత హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలు తీసుకునే వారి సంఖ్య పెరిగింది. ఇండియాలో హెల్త్‌ ఇన్సూరెన్స్‌ గణాంకాల్లో చాలా మార్పులు కనిపించాయి. తీవ్రమైన అనారోగ్యాలు, ప్రమాదాల కారణంగా తీవ్రమైన ఆర్థిక నష్టాల్లో మునిగిపోకుండా రక్షించేందుకు హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలు అవసరం. బెస్ట్ పాలసీని ఎంచుకోవడంలో సహాయపడటానికి Moneycontrol-SecureNow హెల్త్ ఇన్సూరెన్స్ రేటింగ్‌లను అందిస్తోంది. అందరి ఆర్థిక పరిస్థితులు ఒకేలా ఉండవు.. అందరూ ఒకే రకమైన పాలసీలను పొందలేరు. అందుకే ఎంత మొత్తంలో కవర్‌ అందించే పాలసీలు సరిపోతాయి? ఎలాంటి అంశాలు పరిశీలించాలో ఇప్పుడు చూద్దాం..

నివాస ప్రాంతాలను బట్టి హెల్త్‌ పాలసీ

మెట్రో నగరాల్లో నివసించే వారికి ఎక్కువ కవర్‌ అందించే హెల్త్‌ ఇన్సూరెన్స్ పాలసీలు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ఎంత మొత్తంలో కవర్‌ అందించే పాలసీ అవసరం అనేది నివాస ప్రాంతంపై ప్రధానంగా ఆధారపడి ఉంటుంది పేర్కొన్నారు. నివా బుపా హెల్త్ ఇన్సూరెన్స్ అండర్ రైటింగ్, ప్రొడక్ట్స్ అండ్ క్లెయిమ్స్ డైరెక్టర్ భ బాతోష్ మిశ్రా మాట్లాడుతూ..‘ఢిల్లీలో ఆరోగ్య సంరక్షణ ఖర్చులకు, భువనేశ్వర్‌కు మధ్య చాలా వ్యత్యాసం ఉంది. నివసించే రాష్ట్రంలోని కనీస ఆరోగ్య సంరక్షణ ఖర్చుల ఆధారంగా పాలసీలు ఎంచుకోవాలి.’ అని చెప్పారు. మెట్రోపాలిటన్ నగరంలో నివసించకపోయినా, రాష్ట్ర రాజధానిలో ఆసుపత్రి ఖర్చులను పరిగణనలోకి తీసుకోవాలి.

LIC Policy: ఇది కోటి రూపాయల ఎల్ఐసీ పాలసీ... ప్రీమియం, బెనిఫిట్స్ వివరాలివే


వయసు, హెల్త్‌ హిస్టరీ ప్రధానం

వృద్ధాప్యంలో ఉన్నవారికి ఆస్పత్రులకు వెళ్లాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది. అందుకే వారికి ఎక్కువ మొత్తం లభించే పాలసీలు అవసరం. ఫ్యామిలీ ఫ్లోటర్ కవర్‌లో తల్లిదండ్రులను చేర్చుకోవడం సరైన ఆలోచన కాదని నిపుణులు చెబుతున్నారు. పాలసీ సంవత్సరంలో ఎక్కువ సంఖ్యలో క్లెయిమ్‌లు చేస్తే మొత్తం కవర్‌ త్వరగా పూర్తవుతుందని పేర్కొన్నారు. ఇది ఇతర సభ్యులకు నష్టం చేకూరుస్తుందని తెలిపారు. తల్లిదండ్రుల కోసం ప్రత్యేక పాలసీని తీసుకోవాలని సూచిస్తున్నారు. తల్లిదండ్రులు ఇప్పటికే ఉన్న అనారోగ్యాల కారణంగా తక్కువ ప్రీమియంలతో రెగ్యులర్ కవర్ పొందలేకపోతే, సీనియర్ సిటిజన్ పాలసీలను పరిశీలించాలని చెప్పారు.

Savings Accounts: చిన్న పిల్లల కోసం ఎస్‌బీఐ స్పెషల్ సేవింగ్స్ అకౌంట్లు.. ప్రయోజనాలివే..పాలసీ ఎంపికలో రిక్వైర్‌మెంట్స్‌ కీలకం

ఆశించే ప్రయోజనాలపై పాలసీ కవర్‌ ఆప్షన్‌ ఆధారపడి ఉంటుంది. ఇండివిడ్యువల్‌ రూమ్‌ కావాలని కోరుకుంటారా? షేర్డ్ రూమ్‌ అయినా ఫర్వాలేదా? కచ్చితంగా డీలక్స్‌ రూమ్‌ కావాలా? ఎలాంటి సౌకర్యాలు ఎంచుకుంటారు అనే దాని ఆధారంగా పాలసీ కవర్‌ను నిర్ణయించుకోవాలని Policybazaar.com హెల్త్ అండ్ ట్రావెల్ బిజినెస్ హెడ్ అమిత్ ఛబ్రా చెప్పారు.

డీలక్స్ రూమ్ కావాలని కోరుకునే వారైతే రూ.5 లక్షల కవర్ సరిపోదని వివరించారు. ప్రత్యేకమైన గది కావాలంటే, తప్పనిసరిగా రూమ్‌ రెంట్‌ సబ్‌ లిమిట్స్‌ లేని పాలసీ ఎంచుకోవాలని, సాధారణంగానే ఎక్కువ ప్రీమియం చెల్లించాల్సి వస్తుందని చెప్పారు.

కనీసం రూ.10 లక్షల కవర్ తప్పనిసరి

రూమ్‌ రెంట్‌ సబ్‌ లిమిట్స్‌, ప్రొపోర్షనేట్‌ డిడక్షన్‌ వంటి పరిమితులను తొలగించడంతో పాటు, ఎక్కువ కవర్‌ అందించే పాలసీని కొనుగోలు చేయడం మంచిది. ఆర్థిక స్థోమతపై కూడా దృష్టి పెట్టాలి. పెద్ద పాలసీలు ఎక్కువ ప్రీమియంలతోనే వస్తాయి. అవసరాలు, బడ్జెట్ మధ్య సమతుల్యతను సాధించాలి. ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికీ రూ.10 లక్షల కవర్ అవసరమని సెక్యూర్‌నౌ ఇన్సూరెన్స్ బ్రోకర్స్ ప్రిన్సిపల్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్ అభిషేక్ బోండియా చెప్పారు.

రూ.కోటి కవర్‌ను అందించే పాలసీ అవసరమా?

ఈ రోజుల్లో బడ్జెట్‌ అనుమతిస్తే ఓ వ్యక్తికి రూ.కోటి కవర్‌ అందించే పాలసీలు అవసరమని కొందరు నిపుణులు చెబుతున్నారు. భవిష్యత్తులో హల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీల ప్రీమియంలు పెరిగే అవకాశం ఉందనేది గుర్తించాలని తెలిపారు. ఖరీదైన చికిత్సలు అవసరమైన వారికి రూ.కోటి కవర్‌ అవసరమవుతుందని చెప్పారు. గణాంకాల ప్రకారం 100 శాతం కవరేజీని పొందడం అసాధ్యమని, ఎదురయ్యే ఘటనల్లో 98 శాతం కవర్ పొందాలనుకుంటే.. రూ.కోటి కవర్‌ అందించే పాలసీ అవసరమని అన్నారు. రూ.కోటి కవర్ అందించే పాలసీలకు ప్రీమియంలు చెల్లించలేమని భావిస్తే.. రూ.10 లక్షల బేస్ పాలసీ తీసుకుని, టాప్-అప్ కవర్ ఆప్షన్‌లను ఎంచుకోవచ్చని సూచించారు.

Published by:Ashok Kumar Bonepalli
First published:

Tags: Health Insurance, Personal Finance

ఉత్తమ కథలు