FIFA : ఎక్కువ మంది వీక్షించే స్పోర్ట్స్‌లో ఫుట్‌బాల్ మొదటి స్థానంలో ఉంటుంది. ఖతార్‌లో నిర్వహించిన FIFA వరల్డ్ కప్ 2022(FIFA World cup 2022) ఆదివారంతో ముగిసింది. అర్జెంటీనా- ఫ్రాన్స్ మధ్య జరిగిన ఫైనల్ ఫుట్‌బాల్ ప్రపంచాన్ని మునివేళ్లపై నిలబెట్టింది. చివిరి నిమిషాల్లో మరింత ఉత్కంఠగా మారిన మ్యాచ్ అభిమానులను కట్టిపడేసింది. అద్భుతమైన మ్యాచ్‌లో అర్జెంటీనా కప్ గెలుచుకుంది. పెనాల్టీ షూట్‌లో అర్జెంటీనా ఫ్రాన్స్‌ను 4-2 తేడాతో ఓడించింది. ఈ టోర్నీ నిర్వహణకు ఖతార్(Qatar) భారీ ఏర్పాట్లు చేసింది. అయితే ఫిఫా వరల్డ్‌కప్ ద్వారా వచ్చిన ఆదాయం, ఇతర వ్యయాల గురించి ఇప్పుడు చూద్దాం.
FIFA ఆదాయం
ఈ టోర్నమెంట్ నిర్వహణకు ఖతార్‌లో సంవత్సరాల తరబడి ఏర్పాట్లు జరిగాయి. టోర్నమెంట్ వాణిజ్య ఒప్పందాల ద్వారా FIFA 7.5 బిలియన్ డాలర్‌ల నిధులు సమకూర్చుకుంది. ఇది 2018 రష్యా వరల్డ్ కప్‌తో పోలిస్తే 1 బిలియన్ డాలర్లు ఎక్కువ. ఖతార్ వరల్డ్ కప్ 2022 నాలుగు సంవత్సరాల కాలానికి గవర్నింగ్ బాడీ అయిన FIFA 4.7 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని అంచనా వేసింది. ఇది 2018 రష్యా వరల్డ్ కప్ ఆదాయానికి సమానంగా ఉంది. 2022కి సంబంధించి మొత్తం 4.7 బిలియన్ డాలర్ల రెవెన్యూ బడ్జెట్లో FIFA 3.8 మిలియన్ల వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇది మొత్తం టార్గెట్లో 82 శాతంగా ఉంది.
ప్రసార హక్కులు, టికెట్లు రేట్లు
ముఖ్యంగా FIFA ఆదాయం 5 విభాగాల నుంచి అందుతుంది. టీవీ ప్రసార హక్కులు, మార్కెటింగ్ హక్కులు, ఆతిథ్యం హక్కులు, టిక్కెట్ల విక్రయాలు, లైసెన్సింగ్ హక్కుల ద్వారా ఆదాయం సమకూరుతుంది. 56% వాటాతో టీవీ ప్రసార హక్కులు అత్యధిక భాగం ఆదాయాన్ని అందిస్తుంది. మార్కెటింగ్ రైట్స్ ద్వారా 29 శాతం సమకూరుతుంది. మిగతా వాటి నుంచి 15 శాతం ఆదాయం లభిస్తుంది. రష్యా 2018 వరల్డ్ కప్ టికెట్లు రేట్లతో పోలిస్తే ఖతార్ మ్యాచ్ టికెట్ రేట్లు 40 శాతం అధికంగా ఉన్నాయి. ఖతార్‌లో ఆదాయం పెరగడానికి మరో ముఖ్య కారణం FIFA 2022 వరల్డ్‌కప్‌ని ఒకే నగరంలో నిర్వహించడం. దీంతో రవాణా ఖర్చులు, ఇతర మౌలిక సదుపాయాల ఖర్చులు తగ్గాయి. దోహా నగరానికి 50 కిలోమీటర్ల పరిధిలో 8 స్టేడియంలలో వరల్డ్ కప్ జరిగింది.
Christmas Vacation: క్రిస్మస్ వెకేషన్ ప్లాన్ చేస్తున్నారా? వీసా లేకుండా వెళ్లిరాగల 5 బ్యూటిఫుల్ కంట్రీస్ ఇవే..
2026తో ఆదాయం పెంచుకోవడంపై దృష్టి
డిసెంబర్ 16న 2026లో జరిగే FIFA వరల్డ్‌కప్‌కు సంబంధించి బడ్జెట్ ప్రకటించింది. దీనికోసం 11 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని FIFA కౌన్సిల్ సమకూరుస్తుంది. 2026 FIFA వరల్డ్‌కప్ ఉత్తర అమెరికా దేశాలైన US, మెక్సికో, కెనడా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. FIFA వెబ్‌సైట్‌లోని సమాచారం ప్రకారం FIFA ఆదాయానికి వరల్డ్ కప్ ప్రధానమైన వనరు. నాలుగు సంవత్సరాల తర్వాత ఆదాయం లెక్కిస్తారు కాబట్టి రాబడి అంచనా వేయడం ఆలస్యం అవుతుంది. 2026 వరల్డ్‌కప్‌కు సంబంధించి FIFA 50% ఎక్కువ ఆదాయాన్ని సమకూర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. వీటిలో ముఖ్యంగా ప్రసార హక్కులు, స్పాన్సర్‌షిప్ ఒప్పందాలు, ఆతిథ్యం, టికెట్లు రేట్లు నుంచి రాబట్టాలని భావిస్తోంది. అత్యధికంగా NFL స్టేడియంలను ఉపయోగించుకోనుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: FIFA, FIFA World Cup 2022, Qatar