HOW IS DOUBLE MASK GOING TO HELP WHATS THE RIGHT WAY TO WEAR IT MK GH
Double masking: కరోనా వ్యాప్తిని నిరోధించడానికి రెండు మాస్క్‌లు ధరించాలా? నిపుణుల సలహా తెలుసుకోండి
డబుల్ మాస్క్ (Image Credit: Twitter)
ముఖానికి మాస్కు ధరించడం, పరిశుభ్రత పాటించడం, సామాజిక దూరం వంటి నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. ప్రస్తుత పరిస్థితుల్లో మహమ్మారి వ్యాప్తిని నిరోధించేందుకు రెండు మాస్కులు కలిపి ధరించాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం అధికారులు, స్వచ్ఛంద సంస్థలు డబుల్ మాస్కింగ్ పేరుతో అవగాహన కల్పిస్తున్నాయి.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా కోవిడ్-19 రెండో దశ ప్రభావం ఉంది. రోజురోజుకీ పెరిగిపోతున్న కరోనా కేసులతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వైరస్ కట్టడికి ప్రజలందరూ కోవిడ్ మార్గదర్శకాలు పాటించాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. ముఖ్యంగా ముఖానికి మాస్కు ధరించడం, పరిశుభ్రత పాటించడం, సామాజిక దూరం వంటి నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. ప్రస్తుత పరిస్థితుల్లో మహమ్మారి వ్యాప్తిని నిరోధించేందుకు రెండు మాస్కులు కలిపి ధరించాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం అధికారులు, స్వచ్ఛంద సంస్థలు డబుల్ మాస్కింగ్ పేరుతో అవగాహన కల్పిస్తున్నాయి. వస్త్రంతో తయారు చేసిన మాస్కు, సర్జికల్ మాస్కులను కలిపి ఒకేసారి ధరించాలని డాక్టర్లు చెబుతున్నారు. ఇవి ముఖాన్ని మరింత ఎక్కువగా కప్పి ఉంచి, మెరుగైన భద్రతతో పాటు సూక్ష్మక్రిముల నుంచి రక్షణ కల్పిస్తాయని అమెరికాకు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) సైతం వెల్లడించింది.
ఇటీవల ప్రభుత్వం సైతం ప్రజలు ఇంట్లో ఉన్నప్పడు కూడా మాస్క్‌ను ధరించాలని సూచించింది. కుటుంబంలో కోవిడ్ పాజిటివ్ కేసు ఉన్నప్పుడు, రోగితో పాటు ఇంటిలోపల ఉన్నవారు అందరూ తప్పనిసరిగా మాస్కులను వాడాలి. అప్పుడే వైరస్ ఇంట్లో ఇతరులకు సోకకుండా నివారించవచ్చు. ఇంటి నుంచి బయటకు వెళ్లినప్పుడు, బంధువులు, స్నేహితులను కలిసినప్పుడు కూడా రెండు మాస్కులు కలిపి ధరించాలని నిపుణులు చెబుతున్నారు. మాస్క్ ధరించని ఇద్దరు వ్యక్తులు వ్యక్తిగత దూరం పాటించనప్పుడు.. ఒకరి నుంచి మరొకరికి వ్యాధి సోకే అవకాశం 90 శాతం ఉంటుంది. వ్యాధి సోకని వ్యక్తి మాస్కు ధరిస్తే ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం 30 శాతమే ఉంటుంది. అయితే క్లాత్ మాస్కులు, సర్జికల్ మాస్కులను కలిపి డబుల్ మాస్క్ ధరిస్తే.. కోవిడ్-19ను నిరోధించే అవకాశం 95 శాతం ఉంటుందని సీడీసీ తెలిపింది.
* ప్రస్తుత పరిస్థితుల్లో పాటించాల్సిన నియమాలు...
* ఎన్ 95 మాస్క్, సర్జికల్ మాస్క్, లేదంటే ముఖాన్ని పూర్తిగా కప్పి ఉంచే రెండు మూడు పొరల క్లాత్ మాస్క్‌లు ధరించాలి. స్కార్ఫ్‌లు, వాల్వ్ లేదా ఫిల్టర్ రంధ్రాలున్న మాస్క్‌లు ధరించడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు.
* ముక్కుకు పట్టి ఉండే మాస్కులను ధరించడం వల్ల అవి జారిపోయే సమస్య ఎదురుకాదు.
* చెవులకు తగిలించుకునే ఎలాస్టిక్ బ్యాండ్లు ఉన్న మాస్కులను ఎంచుకోవాలి.
* తల వెనుక కట్టుకునే మాస్కులు ధరించేవారు, వాటి ముడులు ఊడిపోకుండా చూసుకోవాలి.
* మాస్క్ ధరించే ముందు చేతులు శుభ్రం చేసుకోవాలి.
* శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి.
* మాస్కును తొలగించేటప్పుడు చెవుల దగ్గర ఉండే బ్యాండ్లను తీసివేయాలి. మాస్కును ముందువైపు నేరుగా తాకకూడదు.
* తిరిగి వాడుకునే మాస్కులను శుభ్రంగా ఉతికి, సురక్షితమైన ప్రదేశంలో ఆరబెట్టాలి.
* మాస్కు తీసేసిన తర్వాత కూడా చేతులను శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలి. లేదా సబ్బుతో కడుక్కోవాలి.
* వ్యాధిసోకిన వ్యక్తి దగ్గర నుంచి వచ్చిన తర్వాత కనీసం 30 నిమిషాలు మాస్క్ తీయకూడదు.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.