Online Timings: పెరిగిన భారతీయుల ఆన్ లైన్ టైమ్.. 5జీ కోసం వేచి చూస్తున్నారంటోన్న సర్వే

భారతీయులు స్మార్ట్ ఫోన్‌తో గడిపే సమయం పెరిగిందని ఈ సర్వే నివేదిక తెలిపింది. ఈ సంస్థ భారత్‌లో స్మార్ట్‌ఫోన్ ఉపయోగంపై సర్వే నిర్వహించింది. 15 నుంచి 69 సంవత్సరాల వయసు వారు ఇంటర్నెట్ ఎలా ఉపయోగిస్తున్నారో తేల్చి చెప్పింది.

భారతీయులు స్మార్ట్ ఫోన్‌తో గడిపే సమయం పెరిగిందని ఈ సర్వే నివేదిక తెలిపింది. ఈ సంస్థ భారత్‌లో స్మార్ట్‌ఫోన్ ఉపయోగంపై సర్వే నిర్వహించింది. 15 నుంచి 69 సంవత్సరాల వయసు వారు ఇంటర్నెట్ ఎలా ఉపయోగిస్తున్నారో తేల్చి చెప్పింది.

  • Share this:
కరోనా కారణంగా ఇంటి నుంచి బయటకు వెళ్లడం చాలా వరకు తగ్గిపోయింది. దీంతో అందరూ ఇంట్లోనే ఫోన్లు, లాప్ టాప్స్, టీవీలకు అతుక్కుపోతున్నారు. ఇలాంటి అలవాట్ల గురించి తెలుసుకోవడానికి ఒక సర్వే నిర్వహించింది ఎరిక్సన్ కన్స్యూమర్ ల్యాబ్ సంస్థ. భారతీయులు స్మార్ట్ ఫోన్‌తో గడిపే సమయం పెరిగిందని ఈ సర్వే నివేదిక తెలిపింది. ఈ సంస్థ భారత్‌లో స్మార్ట్‌ఫోన్ ఉపయోగంపై సర్వే నిర్వహించింది. 15 నుంచి 69 సంవత్సరాల వయసు వారు ఇంటర్నెట్ ఎలా ఉపయోగిస్తున్నారో తేల్చి చెప్పింది. భారతీయుల్లో చాలామంది ఈ సంవత్సరం 5జీ ఫోన్లు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారని రిపోర్టు వెల్లడించింది. ఇంకా సర్వేలో తేలిన ఆసక్తికరమైన అంశాలేంటంటే..

* ఈ రిపోర్ట్ ప్రకారం భారతీయులు సగటున రోజుకు 3.4 గంటలు ఆన్ లైన్లో గడుపుతున్నారు. విద్యార్థులు, రిమోట్ వర్కింగ్ వల్ల చాలామంది ఆన్ లైన్లో ఎక్కువ సమయం గడుపుతున్నామని వెల్లడించారు. స్మార్ట్ ఫోన్ వినియోగం చూస్తే సగటున 5 గంటల 24 నిమిషాలు దాన్ని వాడుతున్నారు.

* 46 శాతం స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఈ లెర్నింగ్ ప్లాట్ ఫాంల ద్వారా కొత్త కోర్సులు నేర్చుకుంటున్నారు. ఇది కాకుండా బ్రౌజ్ చేయడం (89 నిమిషాలు), షార్ట్, లాంగ్ వీడియో ప్లాట్ ఫాంలు ఉపయోగించడం (92 నిమిషాలు) ఎక్కువగా చేస్తున్నారు. ఆన్ లైన్ లో గడిపే సమయంలో పది శాతం వాయిస్, వీడియో కాల్స్‌కి వెచ్చిస్తున్నారు.

* గతంతో పోల్చితే వారానికి 10 అదనపు గంటలు ఆన్ లైన్లో గడుపుతున్నారు. అలాగే వారానికి రెండున్నర గంటలు ఫోన్‌లోని వివిధ సర్వీసులు ఉపయోగిస్తూ గడుపుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ వినియోగం పెరగడం వల్ల 2025 కల్లా ప్రస్తుతం ఉన్న ఒత్తిడి స్థాయుల కంటే ఎక్కువ ఒత్తిడి ఎదుర్కోవాల్సి వస్తుందని 67 శాతం మంది భావిస్తున్నారు.

* స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్న ప్రతి ఐదుగురిలో నలుగురు 5జీ ఫోన్ వినియోగించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే సర్వేలో పాల్గొన్న వారిలో 52 శాతం మంది ఇంటర్నెట్ వాడేందుకు పీసీ లేదా లాప్ టాప్ మంచిదని భావిస్తున్నారు. ఇందుకు వాటిని కలిగి ఉండడం ఓ కారణం అయితే ఇంటర్నెట్ స్పీడ్ మరో కారణంగా చెప్పుకోవచ్చు.

* చాలామంది తాము ఉపయోగిస్తున్న మొబైల్ నెట్ వర్క్ మంచిది అని భావిస్తున్నారు. మంచి కనెక్టివిటీ ఉంటుందని కూడా చెప్పారు. తాము ఎంచుకున్న నెట్ వర్క్ 5జీ సేవలలో కూడా బెస్ట్‌గా ఉంటుందని వారు నమ్ముతున్నారు.

* కరోనా తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఆన్ లైన్ షాపింగ్‌పై ఆసక్తి పెరిగింది. అంతకుముందు 34 శాతం మంది ఆన్ లైన్ షాపింగ్ చేస్తుంటే ప్రస్తుతం ఈ సంఖ్య 53 శాతానికి చేరిందని సర్వే తేల్చింది.
Published by:Krishna Adithya
First published: