HOW FIRST TIME HOME BUYERS CAN GET UP TO 5 LAKH TAX REBATE GH VB
Tax Deductions: మొదటిసారి ఇల్లు కొనేవారికి రూ.5 లక్షల వరకు ట్యాక్స్ రిబేట్.. ఎలా పొందాలంటే..
ప్రతీకాత్మక చిత్రం (Image Credit : Istock)
హోం లోన్స్ తీసుకున్నవారికి ఆదాయ పన్ను చట్టం (Income Tax Act) వివిధ సెక్షన్ల కింద రూ.5 లక్షల విలువైన పన్ను మినహాయింపు (tax deductions)లను ఆఫర్ చేస్తోంది. వాటికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం..
ఇంటి నిర్మాణం (house construction) చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అందుకే చాలామంది ప్రజలు ఎక్కువగా హోం లోన్స్ (Home Loans)పై ఆధారపడుతుంటారు. అయితే హోం లోన్స్ తీసుకున్నవారికి ఆదాయ పన్ను చట్టం (Income Tax Act) వివిధ సెక్షన్ల కింద రూ.5 లక్షల విలువైన పన్ను మినహాయింపు (tax deductions)లను ఆఫర్ చేస్తోంది. ఈ సెక్షన్ల కింద గృహరుణాలపై చెల్లించే వడ్డీ, ప్రిన్సిపల్ కాంపోనెంట్లపై పన్ను మినహాయింపులను పొందవచ్చు. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం, హోం లోన్‌పై మొత్తంగా రూ.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. తొలిసారిగా ఇల్లు కొనేవారు లేదా నిర్మించేవారు రూ.5 లక్షల వరకు ట్యాక్స్ రిబేబ్ (tax rebate) లేదా ట్యాక్స్ డిడక్షన్లు ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రిన్సిపల్‌పై మినహాయింపు (Deduction on Principal)
రుణగ్రహీతలు సెక్షన్ 80సీ (section 80c) కింద హోం లోన్ ప్రిన్సిపల్ రీపేమెంట్‌పై రూ. 1.5 లక్షల పన్ను మినహాయింపు పొందవచ్చు. అయితే రుణ గ్రహీతలు ఆర్బీఐ పరిధిలోకి వచ్చే కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సంస్థ, ఏదైనా ప్రభుత్వ రంగ సంస్థ, యూనివర్సిటీ లేదా సహకార సంఘం నుంచి మాత్రమే రుణాన్ని తీసుకోవాలి. అలాగే, ఇల్లు నిర్మాణంలో ఉన్నంత వరకు ఈ మినహాయింపు అందుబాటులో ఉండదు. మీరు 5 ఏళ్లలోగా మీ ఇంటిని విక్రయిస్తే, మీరు క్లెయిమ్ చేసిన రిబేట్ లేదా రాయితీ అనేది మళ్లీ మీ ఆదాయానికి యాడ్ అవుతుంది. అప్పుడు మినహాయింపు కోసం క్లెయిమ్ చేసిన ఆదాయానికి పన్ను చెల్లించవలసి ఉంటుంది.
వడ్డీపై మినహాయింపు (Deduction on Interest)
సెక్షన్ 24 (Section 24) అనేది స్వీయ-ఆక్రమిత (self-occupied) ఆస్తి కోసం తీసుకున్న గృహ రుణానికి చెల్లించే వడ్డీపై రూ.2 లక్షల వరకు మినహాయింపును అనుమతిస్తుంది. అలాగే ఇది లెట్ అవుట్ (let-out) ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వడ్డీపై మినహాయింపు అందిస్తుంది. ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత మాత్రమే ఈ మినహాయింపును క్లెయిమ్ చేయవచ్చు. నిర్మాణ దశలో వడ్డీ చెల్లించినట్లైతే.. నిర్మాణం పూర్తయిన తర్వాత ఐదు వాయిదాలలో మినహాయింపులను క్లెయిమ్ చేసుకోవచ్చు.
అలాగే సెక్షన్ 80EEA (section 80EEA) కింద వడ్డీపై రూ.1.5 లక్షల వరకు అదనపు మినహాయింపు పొందవచ్చు. ఇది సెక్షన్ 24కి అదనంగా మినహాయింపు ప్రయోజనాలు అందిస్తుంది. ఈ నిబంధనను సరసమైన గృహాల కోసం యూనియన్ బడ్జెట్ 2019లో ప్రవేశపెట్టారు. ఇది అనేక షరతులతో కూడుకున్నది కాబట్టి ఈ షరతులకు లోబడి ఉంటే ఈ 1.5 లక్షల మినహాయింపు పొందవచ్చు. నిపుణుల ప్రకారం, మినహాయింపులు పొందాలంటే రుణం అనేది ఒక బ్యాంకు, బ్యాంకింగ్ కంపెనీ లేదా హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ ద్వారా 1 ఏప్రిల్ 2019 - 31 మార్చి 2022 మధ్య మంజూరు అయ్యి ఉండాలి.
ఆస్తి స్టాంప్ డ్యూటీ విలువ రూ.45 లక్షలకు మించకూడదు. రుణం మంజూరైన తేదీన గృహ కొనుగోలుదారు ఎలాంటి నివాస గృహ ఆస్తిని కలిగి ఉండకూడదు. నిర్మాణంలో ఉన్న ఇల్లు కోసం తీసుకున్న గృహ రుణం సెక్షన్ 80EEA కింద మినహాయింపుకు అర్హత పొందుతుందా లేదా అనేది ఫైనాన్స్ బిల్లులో స్పష్టంగా పేర్కొనలేదు. అయితే నిపుణుల ప్రకారం... సెక్షన్ 24, సెక్షన్ 80సీ లాగానే ఇల్లు నిర్మాణంలో ఉంటే 80EEA కింద మినహాయింపును క్లెయిమ్ చేయవచ్చు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.