ఇంధన ధరలు తగ్గడం దేశానికి మంచిదా? కాదా?

అయిల్ డిమాండ్‌ పెరుగుతుండడాన్ని ప్రపంచ ఆర్థిక వృద్ధికి సూచికగా పరిగణిస్తారు. ప్రస్తుతం ఇంధన డిమాండ్ తగ్గుముఖం పట్టగా...ఇది రాబోయే ప్రపంచ ఆర్థిక మాంధ్యానికి సంకేతంకావచ్చన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

news18-telugu
Updated: November 19, 2018, 6:03 PM IST
ఇంధన ధరలు తగ్గడం దేశానికి మంచిదా? కాదా?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
పెట్రోల్, డీజిల్ ధరలు దిగివస్తుండడంతో మోదీ సర్కారు ఊపిరిపీల్చుకుంటోంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇది బీజేపీకి ఎంతో ఊరటనిచ్చే అంశం. ఈ ఏడాది మధ్యలో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు బ్యారల్ 100 డాలర్లను దాటిపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమయ్యింది. అక్టోబర్ మాసం మొదటివారంలో క్రూడాయిల్ నాలుగేళ్ల గరిష్ట స్థాయిని తాకింది. అయితే ఆ తర్వాత ఇంధన ధర 25 శాతం మేర తగ్గి బ్యారల్ 65 డాలర్లకు చేరింది. క్రూడాయిల్ ధరలు తగ్గడంతో దేశ ద్రవ్యలోటుపై ఒత్తిడి తగ్గడంతో పాటు రూపాయి బలపడడం, ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతోంది.

ఆయిల్ ధరలు ఎందుకు పెరిగాయో ఒకసారి విశ్లేషిస్తే..ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఇంధన ఉత్పత్తి దేశమైన ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు దీనికి ప్రధాన కారణం. ప్రపంచ మార్కెట్లో ఇంధనానికి డిమాండ్ పెరగడానికి అమెరికా ఆంక్షలు కారణమయ్యాయి. అయితే చైనా, భారత్‌తో పాటు మరో ఆరు దేశాలు ఇరాన్‌ నుంచి ఇంధనాన్ని దిగుమతి చేసుకోవడానికి  తాత్కాలికంగా(180 రోజులు) అనుమతిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆంక్షలను సడలించారు. ఈ దేశాల దాదాపుగా తమ ఇంధన అవసరాల కోసం 75 శాతం మేర ఇరాన్ దిగుమతులపైనే ఆధారపడి ఉన్నాయి.

ఇరాన్ నుంచి ఇంధన సరఫరా తగ్గే అవకాశం ఉందన్న అంచనాలతో ప్రపంచంలో మూడు అతిపెద్ద ఇంధన ఉత్పత్తి దేశాలు సౌదీ అరేబియా, అమెరికా, రష్యా దేశాలు ఇంధన ఉత్పత్తిని రికార్డు స్థాయిలో పెంచాయి. ఏడాది క్రితంతో పోలిస్తే ఆగస్టు మాసంలో అమెరికా ఆయిల్ సంస్థలు తమ ఆంధన ఉత్పత్తిని 23 శాతం పెంచాయి. ప్రస్తుతం ఆ దేశం ప్రతి రోజూ దాదాపు 11.6 మిల్లియన్ బ్యారళ్ల ఇంధనాన్ని ఉత్పత్తి చేస్తోంది.

ప్రతీకాత్మక చిత్రం
ఇంధన ఉత్పత్తిని తగ్గించాలని సౌదీ అరేబియా నేతృత్వంలోని ఆయిల్ ఉత్పత్తి దేశాలైన ఒపెక్ నిర్ణయించాయి. అటు రష్యా కూడా ఇంధన ఉత్పత్తిని గణనీయంగా తగ్గించాలని నిర్ణయించింది. అటు ట్రేడ్ వార్‌లో భాగంగా చైనాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దిగుమతి సుంఖాలు పెంచారు. తాజా పరిణామాలు చైనా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు. నేరుగా విషయానికొస్తే చైనా ఆర్థిక వ్యవస్థ బలహీనపడితే దాని ప్రభావం భారత్ సహా పలు ఆసియా దేశాలపై కూడా స్పష్టంగా కనిపించే అవకాశముంది.

ప్రతీకాత్మక చిత్రం


భారత్‌ ఆర్థిక వ్యవస్థపైనా ప్రతికూల ప్రభావంఇంధన అవసరాల కోసం ఎక్కువగా దిగుమతులపై ఆధారపడే భారత్ వంటి దేశాలకు క్రూడాయిల్ ధరలు తగ్గడం శభవార్తే. అయితే ఇంధన ధరలు తగ్గడానికి దారితీసిన కారణాలు కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన  కీలకమైన అంశాలు. అయిల్ డిమాండ్‌ పెరుగుతుండడాన్ని ప్రపంచ ఆర్థిక వృద్ధికి సూచికగా పరిగణిస్తారు. ప్రస్తుతం ఇంధన డిమాండ్ తగ్గుముఖం పట్టగా... ముందుముందు డిమాండ్ మరింత తగ్గొచ్చని పలు ఏజెన్సీలు హెచ్చరిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా అయిల్ డిమాండ్ మరింత తగ్గితే దాని దుష్పరిణామాలు దేశ ఆర్థిక వ్యవస్థపై అవకాశముంది.

మన దేశంలోని పలు కంపెనీల భవితవ్వం అంతర్జాతీయ వృద్ధిపైనే ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ ముడి చమురు ధరలకు ఈక్విటీ మార్కెట్‌తో బలమైన సంబంధముంది. ప్రస్తుతం ఇంధన ధరలు తగ్గడం, రూపాయి బలపడుతుండడం భారత మార్కెట్లలో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. అయితే గతానుభవాలను దృష్టిలో పెట్టుకుని, భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు దేశం సన్నద్ధం కావాల్సి ఉంటుంది.

ఇది కూడా చదవండి..
First published: November 19, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>