Home /News /business /

HOW EV MAKERS IN INDIA ARE PUSHING GREEN MOBILITY BY ELECTRIFYING THE INDIAN ROADS ANALYSIS MK GH

Electric Vehicles: భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల పురోగతి ఎలా ఉంది? సంస్థల భవిష్యత్తు ప్రణాళికలు ఏంటి?

ఫ్రతీకాత్మకచిత్రం

ఫ్రతీకాత్మకచిత్రం

2030 నాటికి ఇండియాలో 100% ఎలక్ట్రిక్ వాహనాలే ఉండాలనే లక్ష్యంతో తయారీదారులు పనిచేస్తున్నారు. ఇండియాలో ప్రస్తుత ఎలక్ట్రిక్ వాహనాల తయారీ ప్రోగ్రెస్ గురించి తెలుసుకుంటే..

భారతదేశంలోని ప్రజారవాణా అవసరాలను తీర్చేందుకు విద్యుత్‌తో నడిచే ఫ్లీట్ కార్లు, ఈ-బస్‌లు, 3 వీలర్లు, 2 వీలర్లు, ఈ-బైక్‌లు భారీగా అందుబాటులోకి రావడానికి సిద్ధమవుతున్నాయి. భారతీయ రోడ్లను పూర్తిగా ఎలక్ట్రిక్ వెహికల్స్ తో నింపేందుకు తయారీ సంస్థలు వడివడిగా అడుగులు వేస్తున్నాయి. 2030 నాటికి ఇండియాలో 100% ఎలక్ట్రిక్ వాహనాలే ఉండాలనే లక్ష్యంతో తయారీదారులు పనిచేస్తున్నారు. ఇండియాలో ప్రస్తుత ఎలక్ట్రిక్ వాహనాల తయారీ ప్రోగ్రెస్ గురించి తెలుసుకుంటే..

1. ఎలక్ట్రిక్ 3-వీలర్‌లు:
ఇప్పటికే భారతదేశంలో టెర్రా మోటార్స్ EV మార్కెట్లోకి వివిధ ఎలక్ట్రిక్ 3-వీలర్‌లను విడుదల చేసింది. ప్రజారవాణాతో పాటు సరుకు రవాణా కోసం తయారుచేసిన ఈ వాహనాలు టెర్రా బ్యాటరీ యూనిట్ ద్వారా శక్తిని పొందుతాయి. ఫుల్ ఛార్జ్‌ చేస్తే ఇది 100 కి.మీ ప్రయాణించగలదు. ఈ వాహనాల్లో డ్రైవర్‌తో సహా ఐదుగురు ప్రయాణించవచ్చు. ఇతర 3-వీలర్ తయారీదారులతో పోలిస్తే, టెర్రా మోటార్స్ ముందంజలో ఉంది. 2024-25 నాటికి ఎలక్ట్రిక్ వెహికల్స్ అన్నీ లిథియం-అయాన్ బ్యాటరీ ఆధారితంగా నడుస్తాయని తెలుస్తోంది. దీంతో టెర్రా మోటార్స్ లిథియం-అయాన్ పరిశోధన కోసం భారీగా పెట్టుబడి పెడుతోంది.

2. ఎలక్ట్రిక్ 4-వీలర్‌లు:
4-వీలర్ వాహనాల విభాగంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రోగ్రెస్ 0.1% గా ఉంది. ఇంత తక్కువ ప్రోగ్రెస్ ఉండడానికి చాలా కారణాలే ఉన్నాయి. ముఖ్యంగా అధిక ధరలు, పరిమిత సంఖ్యలో ఉత్పత్తులు, అసమర్థ బ్యాటరీల వల్ల 4-వీలర్‌ల విక్రయాలు తగ్గాయి. ప్రస్తుతం ఇండియాలో టాటా టిగోర్ EV వంటి ఆరు ఎలక్ట్రిక్ కార్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. త్వరలోనే జాగ్వార్ ఐ-పేస్, మహీంద్రా ఇకెయువి 100, పోర్షే టేకాన్ విడుదల కానున్నాయి. 4-వీలర్ వాహనాలను తయారు చేయడానికి టాటా మోటార్స్ (నెక్సాన్ EV), మహీంద్రా ఇ-వెరిటో వంటి సంస్థలు రెడీ అవుతున్నాయి.

3. ఈ-బస్‌లు:
గతేడాది మార్చి నెల నాటికి భారతదేశ వ్యాప్తంగా 1,031 ఇ-బస్సుల కొనుగోళ్లు జరిగాయి. ఫేమ్ ఇండియా స్కీమ్ ద్వారా ఈ-బస్సుల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. అలాగే అంతర్జాతీయ పెట్టుబడిదారుల్లో ఆసక్తిని పెంచడం ద్వారా దేశంలోని ఎలక్ట్రిక్ బస్సు మార్కెట్ ఊపందుకుంది. దేశంలో ఫేమ్ 1 కింద అందుబాటులోకి వచ్చిన మొత్తం 400 బస్సులలో 215 బస్సులను టాటా మోటార్స్ సరఫరా చేసింది. Olectra-BYD, Scania, Foton PMI, JBM Solaris విదేశీ తయారీదారులు భారతదేశంలోని ఇ-బస్ మార్కెట్‌పై దృష్టి సారిస్తున్నారు.

4. 2-వీలర్:
2030లోపు భారతదేశ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల వినియోగం 25-35% చేరుకుంటుందని అంచనా. ఇప్పుడు దేశంలో మొత్తం 148 ఎలక్ట్రిక్ 2-వీలర్ వాహనాలు అందుబాటులో ఉన్నాయి. వీటి ప్రారంభ ధర రూ.25 వేలు. టెర్రా మోటార్స్ తయారు చేసిన 1000 సీసీ కివామి సూపర్ బైక్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 20,000 కి.మీ ప్రయాణించగలదు. ఇది గంటకు 140 కిమీ గరిష్ట వేగాన్ని అందుకోగలదు.

5. ఇ -బైక్‌లు/ఎలక్ట్రిక్ బైసైకిల్స్:
భారతదేశంలో ఎలక్ట్రిక్ బైక్‌ల మార్కెట్ 2024 నాటికి రూ.17.43 బిలియన్ విలువకు చేరుకుంటుందని అంచనా. ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ల అభివృద్ధితో ఎలక్ట్రిక్ బైక్‌ల కొనుగోళ్లు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది.
Published by:Krishna Adithya
First published:

Tags: Electric vehicle

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు