బ్యాంకులు మినిమమ్ బ్యాలెన్స్‌ని ఎలా లెక్కిస్తాయి? తెలుసుకోండి

మెట్రోలో మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ రూ.3,000 ఉండాలి. అంటే అకౌంట్‌లో రూ.3,000 అలాగే డిపాజిట్ చేసి ఉంచేస్తే ఏ సమస్యా ఉండదు అని చాలామంది అనుకుంటారు. అయితే బ్యాంకులు మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్‌ని లెక్కించే విధానం మరోలా ఉంటుంది.

news18-telugu
Updated: December 27, 2018, 12:01 PM IST
బ్యాంకులు మినిమమ్ బ్యాలెన్స్‌ని ఎలా లెక్కిస్తాయి? తెలుసుకోండి
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
బ్యాంకులో అకౌంట్ ఉందంటే మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలన్న టెన్షన్ ఉంటుంది. మినిమమ్ బ్యాలెన్స్ లెక్కలు ఒక్కో బ్యాంకువి ఒక్కోలా ఉంటాయి. మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే వేసే ఛార్జీల్లోనూ తేడాలు ఉంటాయి. అయితే మినిమమ్ బ్యాలెన్స్ అని కాకుండా మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్‌ అని చెబుతుంటాయి బ్యాంకులు. అసలు మినిమమ్ బ్యాలెన్స్ అంటే ఏంటీ? మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్‌ అంటే ఏంటీ? ఈ రెండింటికి మధ్య ఎలాంటి తేడాలు ఉంటాయి? వాటిని ఎలా గుర్తించాలి? మీరు బ్యాలెన్స్ ఎలా మెయింటైన్ చేయాలి? వివరంగా తెలుసుకోండి.

మీ అకౌంట్‌లో మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే బ్యాంకులు జరిమానాలు వేస్తుంటాయి. ఆ జరిమానాలు భారీగానే ఉంటాయి. అయితే కాస్త తెలివిగా వ్యవహరిస్తే ఈ ఛార్జీలను తప్పించుకోవచ్చు. ఉదాహరణకు మీకు మెట్రో నగరంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ)లో సేవింగ్స్ అకౌంట్ ఉంది అనుకుందాం. మెట్రోలో కాబట్టి మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ రూ.3,000 ఉండాలి. అంటే అకౌంట్‌లో రూ.3,000 అలాగే డిపాజిట్ చేసి ఉంచేస్తే ఏ సమస్యా ఉండదు అని చాలామంది అనుకుంటారు. అయితే బ్యాంకులు మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్‌ని లెక్కించే విధానం మరోలా ఉంటుంది.

మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్(ఎంఏబీ) లెక్కించే విధానం ఇదే...
మెట్రో నగరంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ)లో సేవింగ్స్ అకౌంట్‌లో రూ.3,000 మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్(ఎంఏబీ) ఉండాలి.
జనవరి 1న మీ అకౌంట్‌లో ఉన్న బ్యాలెన్స్ రూ.1,000 మాత్రమే అనుకుందాం.
జనవరి 10న మీరు రూ.3,000 డిపాజిట్ చేశారు.
జనవరి 20న మీరు రూ.2,000 విత్‌డ్రా చేశారు.జనవరి 25న మీరు రూ.1,000 డిపాజిట్ చేశారు.
ఇప్పుడు మీ అకౌంట్‌లో ఎంత ఉంటాయి. రూ.3,000
అయితే బ్యాంకులు నెల అంతా కలిపి మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్(ఎంఏబీ) లెక్కిస్తాయి.
మీ అకౌంట్‌లో జనవరి 1 నుంచి జనవరి 9 వరకు రూ.1,000 ఉన్నాయి. అంటే మొత్తం బ్యాలెన్స్ (రూ.1,000x9రోజులు = రూ.9,000)
మీ అకౌంట్‌లో జనవరి 10న రూ.3,000 డిపాజిట్ చేశారు కాబట్టి అప్పట్నుంచి నుంచి జనవరి 19 వరకు రూ.4,000 ఉన్నాయి. అంటే మొత్తం బ్యాలెన్స్ (రూ.4,000x10రోజులు = రూ.40,000)
మీ అకౌంట్‌లో జనవరి 20న రూ.2,000 విత్‌డ్రా చేశారు కాబట్టి అప్పట్నుంచి జనవరి 24 వరకు రూ.2,000 ఉన్నాయి. అంటే మొత్తం బ్యాలెన్స్ (రూ.2,000x5రోజులు = రూ.10,000)
మీ అకౌంట్‌లో జనవరి 25న రూ.1,000 డిపాజిట్ చేశారు కాబట్టి అప్పట్నుంచి జనవరి 31 వరకు రూ.3,000 ఉన్నాయి. అంటే మొత్తం బ్యాలెన్స్ (రూ.3,000x7రోజులు = రూ.21,000)
ఇప్పుడు నెల మొత్తం మీ బ్యాలెన్స్ (రూ.9,000+రూ.40,000+రూ.10,000+రూ.21,000= రూ.80,000)
మొత్తం బ్యాలెన్స్‌ని ఆ నెలలో ఉన్న రోజులతో డివైడ్ చేస్తారు. అంటే రూ.80,000/31రోజులు= రూ.2,580 అవుతుంది.
మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్(ఎంఏబీ) రూ.3,000 కన్నా తక్కువ కాబట్టి జరిమానా విధిస్తుంది బ్యాంకు. ఒకవేళ మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ రూ.3,000 దాటితే ఎలాంటి ఛార్జీలు వేయదు. వేర్వేరు బ్యాంకుల్లో మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ రూరల్‌, సెమీ-అర్బన్, అర్బన్, మెట్రో వారీగా రూ.1,000 నుంచి రూ.10,000 వరకు ఉంటుంది.



ఇవి కూడా చదవండి:

మీ అకౌంట్‌లో మినిమమ్ బ్యాలెన్స్ ఎంత ఉండాలో తెలుసా?

ALERT: ఎస్‌బీఐ విత్‌డ్రా, డిపాజిట్ రూల్స్ మారాయి తెలుసా?

తగ్గిన క్రెడిట్ స్కోర్ పెంచుకోవడానికి 10 మార్గాలు

ALERT: త్వరలో మీ డ్రైవింగ్ లైసెన్స్ మారనుంది తెలుసా?

ALERT: జనవరి 1 తర్వాత ఆ చెక్కులు చెల్లవు
Published by: Santhosh Kumar S
First published: December 27, 2018, 12:00 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading