Home /News /business /

HOW DO YOU MAKE MONEY GROWING MINT MK

Business Ideas: పుదీనా సాగుతో అరఎకరంలో రూ.80 వేల ఆదాయం పొందే చాన్స్...

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

పుదీనా సాగు ఫ‌లాలు తెలిసిన రైతులు మాత్రం రోజువారీగా లాభాలు గ‌డిస్తున్నారు. ఒక్క‌సారి పెట్ట‌బ‌డితో 5 నుంచి 6 ఏళ్ల‌పాటు దిగుబ‌డి సాధిస్తున్నారు.

  మ‌ట‌న్‌, చికెన్ బిర్యానీ, సాంబార్ త‌యారీల్లో పుదీనాది ప్ర‌త్యేక స్థానం. ఇది లేనిదే వంట‌కానికి రుచి ఉండ‌దు. ఇంత ప్రాముఖ్యం గ‌ల పుదీనా సాగు గురించి రైతులు పెద్ద‌గా ఆలోచించ‌రు. చాలా అరుదుగానే సాగుచేస్తుంటారు. పుదీనా సాగు ఫ‌లాలు తెలిసిన రైతులు మాత్రం రోజువారీగా లాభాలు గ‌డిస్తున్నారు. ఒక్క‌సారి పెట్ట‌బ‌డితో 5 నుంచి 6 ఏళ్ల‌పాటు దిగుబ‌డి సాధిస్తున్నారు.

  సాగు విధానం
  పుదీనా సాగుకు ఐదు గుంట‌ల భూమి విస్తీర్ణం తీసుకుంటే స‌రిపోతుంది. దుక్కిని బాగా క‌లియ‌దున్నాలి. ఇందులో మూడు ట్రాక్ట‌ర్ల ప‌శువుల ఎరువు పోసి 15 రోజులు మ‌గ్గ‌పెట్టాలి. దీనికి అద‌నంగా డీఏపీ దుక్కిలో చ‌ల్లాలి. త‌ర్వాత పుదీనా కాండాల‌ను క‌త్తిరిచి విత్త‌నంగా నాటాలి. వారం రోజుల వ్య‌వ‌ధిలోనే కాండాలు బాగా చిగురిస్తాయి. ఆకులు పెద్ద‌విగా వ‌స్తూనే 30 రోజుల వ్య‌వ‌ధిలోనే దిగుబ‌డి ప్రారంభ‌మ‌వుతుంది. కాలం గ‌డిచే కొద్దీ పిల‌క‌లు ఎక్కువై దిగుబ‌డి పెరుగుతుంది. ఇలా 5 నుంచి 6 సంవ‌త్స‌రాల వ‌ర‌కు దిగుబ‌డి వ‌స్తూనే ఉంటుంది.

  నీటి త‌డులు
  పుదీనా సాగుకు రైతులు తుంప‌ర్ల‌(స్ప్లింక్ల‌ర్స్‌) ప‌రిక‌రాలు అమ‌ర్చుకొని నీటి త‌డులు అందిస్తే బాగుంటుంది. మూడు రోజుల‌కోసారి కేవ‌లం అర‌గంట పాటు నీటిని అందిస్తే స‌రిపోతుంది. తుంప‌ర్ల ద్వారా నీరు ఆకు, కాండాన్ని త‌డిసి ముద్ద చేస్తోంది. దీంతో ఆకులు, కాండంపై ఉన్న చీడ‌లు, పురుగులు చ‌నిపోవ‌డంతోపాటు చేను తాజాగా ఉంటుంది.

  మార్కెటింగ్‌
  పుదీనా దిగుబ‌డిని వారాంత‌పు సంత‌ల‌తోపాటు ద‌గ్గ‌ర‌లో ఉన్న ప‌ట్ట‌ణాల‌కు త‌ర‌లించి విక్ర‌యించ‌వ‌చ్చు. వేస‌విలో పెండ్లిళ్లు, ఫంక్ష‌న్‌లు ఎక్కువ‌గా ఉంటాయి కాబ‌ట్టి డిమాండ్‌ను బ‌ట్టి పుదీనా మార్కెట్‌కు తీసుకువెళ్లాలి.

  పెట్టుబ‌డి
  దున్న‌డానికి రూ. 2 వేలు, ప‌శువుల ఎరువుకు రూ.10 వేలు, ఫ‌ర్టిలైజ‌ర్స్‌కు రూ.5 వేలు, క్రిమి సంహార‌క మందుల‌కు రూ.1000 మొత్తం రూ. 18 వేల నుంచి 20 వేల వ‌ర‌కు పెట్టుబ‌డి వ‌స్తుంది.

  దిగుబ‌డి
  ఐదు గుంట‌ల విస్తీర్ణంలో నెల‌కు 2 వేల క‌ట్ట‌ల దిగుబ‌డి వ‌స్తోంది. భూమిలో పోష‌కాలు అందించే శాతం పెరిగే కొద్దీ దిగుబ‌డి మ‌రో 500 క‌ట్ట‌లు పెరుగుతాయి. పుదీనా దిగుబ‌డితో రైతుకు ప్ర‌తి రోజూ ఆదాయం స‌మ‌కూరుతుంది. ఒక‌వైపు నుంచి కోస్తుంటేనే.. మ‌రో వైపు చేను పెరుగుతుంటుంది. ఓ మాదిరి క‌ట్టకు రూ.10 పలికినా.. రైతుకు రోజువారీగా స‌రాస‌రిగా ఖ‌ర్చులు పోనూ రూ. 700 నుంచి 800 వ‌ర‌కు చేతికందుతుంది. ఇలా కేవ‌లం ఐదు గుంట‌ల విస్తీర్ణంలో నెల‌కు రూ.22 వేల వ‌ర‌కు ఆదాయం పొంద‌వ‌చ్చు. అయితే సుమారు అరఎకరం విస్తీర్ణంలో ఈ పంట వేస్తే దాదాపు 80 వేల వరకూ ఆదాయం పొందే వీలుంది.
  Published by:Krishna Adithya
  First published:

  Tags: Business Ideas

  తదుపరి వార్తలు