Home /News /business /

HOW COMPULSORY HALLMARKING OF GOLD JEWELLERY IS AFFECTING CUSTOMER PURCHASES GH VB

Gold Rates: ఆ విధానంతో బంగారం ధరలకు రెక్కలే..! దీనిపై నిపుణులు ఏమంటున్నారంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Gold Rates: కస్టమర్ల ప్రయోజనాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం బంగారు ఆభరణాలకు హాల్​మార్కింగ్​ తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. జూన్​ 15 నుంచి దేశవ్యాపంగా ఈ నిబంధన అమల్లోకి వచ్చింది. ఇప్పుడు వ్యాపారులు హాల్​ మార్కింగ్​ లేని బంగారు ఆభరణాలను విక్రయించరాదు. ఒకవేళ విక్రయిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటారు. దీని వల్ల బంగారం ధరలు ఎలా ఉండబోతున్నాయనేది ఇప్పుడు తెలుసుకుందాం..

ఇంకా చదవండి ...
కస్టమర్ల ప్రయోజనాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం బంగారు ఆభరణాలకు హాల్​మార్కింగ్​ తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. జూన్​ 15 నుంచి దేశవ్యాపంగా ఈ నిబంధన అమల్లోకి వచ్చింది. ఇప్పుడు వ్యాపారులు హాల్​ మార్కింగ్​ లేని బంగారు ఆభరణాలను విక్రయించరాదు. ఒకవేళ విక్రయిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటారు. అందువల్ల, జ్యువెలరీ తీసుకునే సమయంలోనే వాటిపై హాల్​మార్కింగ్​ ఉందా? లేదా? అనేది చెక్​ చేసుకోవాలని బ్యూరో ఆఫ్​ ఇండియన్​ స్టాండర్డ్​ (బీఐఎస్​) కస్టమర్లను కోరింది. బంగారం వంటి లోహాల స్వచ్ఛతను ధ్రువీకరించేదే ఈ హాల్​మార్క్​. హాల్​ మార్క్​ గల బంగారు ఆభరణాలపై బీఐఎస్​ ప్రింట్​, బంగారు క్యారెట్​ డేటా, సెంటర్​ లోగో, హాల్​మార్క్​ డేటా వంటి మొత్తం 4 గుర్తులు ఉంటాయి. కస్టమర్లు వీటిని తప్పనిసరిగా చెక్​ చేసుకోవాలని తెలిపింది. అయితే, ఈ విధానంతో కస్టమర్లకు నకిలీ బంగారు ఆభరణాల బెడద తప్పుతున్నా.. రేట్లు పెరిగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

ఇది పరోక్షంగా కొనుగోళ్లపై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. ఎందుకంటే, హోల్​మార్కింగ్​ గల ఆభరణాల తయారీకి ఎక్కువ ఖర్చవుతుంది. ఫలితంగా ఈ భారం కస్టమర్లపైనే పడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా భారతదేశంలోని దాదాపు 933 ల్యాబరేటరీస్​లో ఇప్పటికే ఉన్న సుమారు 5 కోట్ల గోల్డ్​ పీస్​లపై హాల్‌మార్క్ వేస్తున్నారు. ఈ ప్రక్రియకు పెద్ద ఎత్తున ఖర్చవుతుంది. ఇది పరోక్షంగా వినియోగదారులపై ప్రభావాన్ని చూపుతుంది. ఈ హాల్‌మార్కింగ్ ఖర్చు మూడు రెట్లు పెరుగుతుందని పాప్లీ గ్రూప్ డైరెక్టర్ రాజీవ్ పోప్లే అంచనా వేస్తున్నారు. మరోవైపు హాల్​మార్క్​ చేయని ఆభరణాలను మార్కెట్​లో విక్రయించలేరు. కాబట్టి ఇప్పటికే స్టాక్​ కలిగి ఉన్న వ్యాపారులు నష్టపోయే అవకాశం ఉంది. ఇది ఆభరణాల ధర మరింత పెరగడానికి దారితీస్తుంది. అందువల్ల, మీ ఆభరణాల ఇన్వాయిస్‌లో ప్రతి పీస్​కు ప్రస్తుతం ఉన్న రూ. 35కి బదులుగా సెప్టెంబర్ నుండి హాల్‌మార్కింగ్/ సర్టిఫికేషన్ ఛార్జీగా ప్రతి పీస్​కు రూ .100 వసూలు చేసినా ఆశ్చర్యపోనవసరం లేదని చెబుతున్నారు. అంటే, ప్రతి పీస్​కు 70 రూపాయల వరకు అదనంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది.

హాల్​మార్కింగ్​తో పెరగనున్న ధరలు..
‘‘హాల్​మార్కింగ్​ విధానం అమలు కంటే ముందు బంగారు ఆభరణాన్ని తరుగు కోసం సులభమైన ప్రక్రియ ఉండేది. ఉదయం చెబితే సాయంత్రం వరకు పూర్తి చేసేవారు. కానీ ఇప్పుడు ఈ ప్రక్రియలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. వ్యాపారులు ముందుగా ఆభరణాల బరువు కొలిచి.. దాన్ని ల్యాబరేటరీకి పంపించి తరుగు చేయాలి. దాని బరువును ధృవీకరించిన తర్వాత మాత్రమే కస్టమర్‌కు అందజేయాల్సి ఉంటుంది. ఇది దాదాపు 14 రోజుల సమయం తీసుకుంటుంది. కాబట్టి, ఇకపై ఆభరణాల తరుగు చేయించాలంటే ముందే ప్లాన్​ చేసుకోవడం ఉత్తమం.”అని ఆల్ ఇండియా జెమ్ అండ్ జ్యువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ డైరెక్టర్ దినేష్ జైన్ చెప్పారు.
Published by:Veera Babu
First published:

Tags: Gold jewell, Gold rates, New policy

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు