కొన్ని వారాల్లో యూనియన్ బడ్జెట్ (Union Budget) 2023 ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుతం జీవన వ్యయం పెరగడంతో ఉద్యోగులు పన్ను భారం తగ్గించే ప్రకటనల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. వాస్తవానికి ప్రభుత్వం(Government) వసూలు చేసే పన్నుల్లో ఉద్యోగుల వాటా ఎక్కువగా ఉంటుంది. 2023 బడ్జెట్‌తో ఉద్యోగుల జీవితాలు మారుతాయని, ఉపశమనాలు లభించే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఉద్యోగులకు మేలు చేసేలా ఇన్‌కం ట్యాక్స్‌లో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న కొన్ని సవరణలను తీసుకొచ్చేందుకు ఇది ప్రభుత్వానికి గొప్ప అవకాశమని భావిస్తున్నారు. బడ్జెట్ 2023 ఉద్యోగులకు అందించే ప్రయోజనాలపై నిపుణుల విశ్లేషణ ఇలా..
డిడక్షన్స్ లిమిట్ సవరణ
తాజా బడ్జెట్‌లో సెక్షన్లు 80C, 80D కింద వివిధ డిడక్షన్స్ లిమిట్స్‌ను సవరించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు టీమ్‌లీజ్ హెచ్‌ఆర్‌టెక్ సీఈఓ సుమిత్ సబర్వాల్. చాలా ఏళ్లుగా 80C డిడక్షన్‌లో ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం ఉన్న రూ.1.5 లక్షల లిమిట్‌ను ఫైనాన్స్ యాక్ట్ 2014లో నిర్ణయించారు. ఈ లిమిట్‌ను రూ.2.5 లక్షలకు పెంచితే సామాన్యులకు మేలు జరుగుతుందని ఆయన ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ వార్తాసంస్థతో మాట్లాడుతూ చెప్పారు.
అలాగే హెల్త్ ఇన్సూరెన్స్‌పై సెక్షన్ 80D డిడక్షన్ లిమిట్‌ను పెంచాల్సిన అవసరం కూడా ఉందన్నారు. దీన్ని రూ.25,000 నుంచి రూ.50,000కి సవరించాలని సూచించారు. కరోనా సమయంలో ఇన్సూరెన్స్ కంపెనీలు పాలసీ ప్రీమియంలు పెంచాయని, వృద్ధులకు ప్రస్తుతం ఉన్న లిమిట్‌ను రూ.50,000 నుంచి రూ.75,000కి పెంచాలని సబర్వాల్ పేర్కొన్నారు.
Sukanya Samriddhi Yojana: నెలకు రూ.1,000 జమ చేస్తే రూ.5,27,445 రిటర్న్స్
ఇన్‌కం ట్యాక్స్ శ్లాబ్ రివిజన్
ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల ప్రకారం ఇన్‌కం ట్యాక్స్ శ్లాబ్‌లను కూడా అప్‌డేట్ చేయాల్సిన అవసరం ఉందని సబర్వాల్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఫ్రెషర్‌లు కూడా రూ.5- 7 LPA ప్యాకేజీలతో ఉద్యోగాలు పొందడం సాధారణమైంది కాబట్టి, ఒక వైపు పన్నులు, మరొక వైపు పెరుగుతున్న జీవన వ్యయం ప్రభావం సేవింగ్స్‌పై కనిపిస్తుందన్నారు. అదే ప్యాకేజీలో ఆధారపడిన కుటుంబ సభ్యులను చూసుకోవాల్సిన పరిస్థితి ఉంటే పరిస్థితి మరింత దిగజారుతుందని చెప్పారు.
HRA రూల్స్ అప్‌డేట్
ఇంటి అద్దె అలవెన్సు(హెచ్‌ఆర్‌ఏ) లెక్కింపుకు సంబంధించి మెట్రో నగరాల నిర్వచనాన్ని సవరించాల్సిన అవసరం ఉందని సుమిత్ సబర్వాల్ తెలిపారు. బెంగళూరు వంటి నగరాల్లో అద్దె, జీవన వ్యయం పెరిగినప్పటికీ, HRA డిడక్షన్ కోసం బెంగళూరును మెట్రో నగరంగా పరిగణించలేదని చెప్పారు. బెంగళూరులో IT/IT అనుబంధ రంగాలలో దాదాపు 1.5 మిలియన్ల మంది ఉద్యోగులు పని చేస్తున్నారని పేర్కొన్నారు. జీతాలు పెరుగుతున్నాయని, అదే వేగంతో ఇంటి అద్దెలు కూడా పెరుగుతున్నాయని తెలిపారు. ఇప్పటికీ HRA డిడక్షన్ కోసం ఢిల్లీ , కోల్‌కత్తా, చెన్నై, ముంబైని మాత్రమే మెట్రో నగరాలుగా పరిగణిస్తున్నారని చెప్పారు. బెంగళూరులోని ఉద్యోగులకు కూడా అదే ప్రయోజనాలు అందే అవకాశం ఉందని సబర్వాల్ వివరించారు.
జాయినింగ్ బోనస్‌పై ట్యాక్స్
ఉద్యోగులు పొందే జాయినింగ్ బోనస్‌కి సంబంధించి ట్యాక్స్ రూల్స్ మార్చాల్సిన అవసరం ఉందని చెప్పారు క్లియర్ (గతంలో క్లియర్‌టాక్స్) వ్యవస్థాపకుడు, CEO అర్చిత్ గుప్తా. ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ కొన్ని వివరాలు పంచుకున్నారు. జాయినింగ్ బోనస్ పొందిన తర్వాత ఉద్యోగులు.. నిర్ణయించిన సమయం కంటే ముందే ఆర్గనైజేషన్ నుంచి బయటకు వెళ్తే.. బోనస్ మొత్తాన్ని తిరిగి చెల్లించాలని పేర్కొన్నారు. అయితే కంపెనీ జాయినింగ్ బోనస్ ఇచ్చే ముందు పన్ను మినహాయించి అందజేస్తుందని వివరించారు. తిరిగి చెల్లించే సమయంలో మొత్తాన్ని (పన్నుతో సహా) యజమానికి చెల్లించాలన్నారు.
ప్రస్తుత బడ్జెట్ ఈ విషయంలో ఉద్యోగులకు ఉపశమనం కలిగించే అవకాశం ఉందని గుప్తా చెప్పారు.
హోమ్ ఆఫీస్ ఖర్చులు
భవిష్యత్తులో వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం కొనసాగుతుంది. ఆఫీస్‌లు ఓపెన్ అయినప్పటికీ, చాలా మంది తమ ఇళ్ల నుంచి పని చేస్తున్నారు. అందువల్ల హోమ్ ఆఫీస్ ఖర్చులపై డిడక్షన్ పొందే అవకాశం కల్పించాలని నిపుణులు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Budget, Budget 2022-23, Budget 2023-24, Schemes