హోమ్ /వార్తలు /బిజినెస్ /

ChatGPT: ఆర్థిక రంగంపై AI ప్రభావం ఎంత? ఇన్వెస్ట్‌మెంట్‌ పోర్ట్‌ఫోలియోను ChatGPT ఎలా ప్రభావితం చేస్తుంది?

ChatGPT: ఆర్థిక రంగంపై AI ప్రభావం ఎంత? ఇన్వెస్ట్‌మెంట్‌ పోర్ట్‌ఫోలియోను ChatGPT ఎలా ప్రభావితం చేస్తుంది?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ChatGPT: ఆర్థిక రగంలో చాట్GPT లాంటి ఏఐ టూల్స్ ప్రభావాన్ని విశ్లేషించారు ఓమ్నిసైన్స్ క్యాపిటల్‌ సీఈవో& చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వికాస్ వి గుప్తా.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ప్రస్తుతం టెక్నాలజీ (Technology) వేగంగా అభివృద్ధి చెందుతోంది. వివిధ రకాల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) టూల్స్ మన పనులను సులభతరం చేయగలుగుతున్నాయి. ప్రస్తుతం టెక్నాలజీ రంగంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు చాట్‌జీపీటీ (ChatGPT). ఈ చాట్‌బాట్‌ టెక్స్ట్‌ ప్రాంప్ట్‌ను ఇన్‌పుట్‌గా తీసుకుని రిజల్ట్‌ అందిస్తుంది. మనిషిలాగే కమ్యూనికేట్‌ అవుతుంది. గూగుల్ సెర్చ్ మాదిరిగానే ఏ రంగానికి చెందిన ప్రశ్నలకైనా సులువుగా సమాధానాలు చెప్పేస్తుంది. ఇతర బడా కంపెనీలు సైతం AI రీసెర్చ్‌ ప్రోగ్రామ్‌లను రన్‌ చేస్తున్నాయి. ఈ పరిణామాలు భవిష్యత్తులో AI డిమాండ్‌ను సూచిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.

ఆర్థిక రగంలో చాట్GPT లాంటి ఏఐ టూల్స్ ప్రభావాన్ని విశ్లేషించారు ఓమ్నిసైన్స్ క్యాపిటల్‌ సీఈవో& చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వికాస్ వి గుప్తా. ఈ వివరాలను ఆయన మనీకంట్రోల్‌ న్యూస్‌పోర్టల్‌తో పంచుకున్నారు. ఈ పరిస్థితుల్లో యూఎస్‌ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌ చేయాలని చూస్తున్న వారు AIలో పెట్టుబడి పెట్టే కంపెనీలను సెలక్ట్‌ చేసుకోవడం మంచిదని చెప్పారు. ఆయన సూచనలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

* పతనమైన యూఎస్‌ టెక్‌ కంపెనీల స్టాక్‌లు

2022లో నాస్‌డాక్‌లో లిస్ట్‌ అయిన US-బేస్డ్‌ టెక్నాలజీ కంపెనీలు కఠిన పరిస్థితులు ఎదుర్కొన్నాయి. ఆ సంవత్సరం నాస్‌డాక్ 100 ఇండెక్స్ 32 శాతం క్షీణించింది. 2008 నుంచి యూఎస్‌ సూచికలకు ఈ స్థాయిలో పతనమవడం మొదటిసారి. యూఎస్‌ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచడం, COVID-19 లాక్‌డౌన్‌ల తర్వాత తిరిగి పని చేయడం, వర్క్‌ స్టైల్‌లో మార్పు కోసం సిద్ధంగా లేని కంపెనీలకు అనుకూలం కాదు. టెక్నాలజీ కంపెనీల స్టాక్‌లు తక్కువ ప్రైస్‌లో ట్రేడ్‌ అవుతున్నాయి. సరైన ఆలోచనతో ఇన్వెస్ట్ చేయడానికి ఇది సరైన సమయం.

* పెరుగుతున్న AI రీసెర్చ్‌

1950లో థియారెటికల్ కంప్యూటర్ సైన్స్ పితామహుడిగా అలాన్ ట్యూరింగ్ గుర్తింపు పొందారు. కొంతమంది ఫాదర్‌ ఆఫ్‌ AIగా పేర్కొన్నారు. మెషీన్‌కు మనిషిలా ఇంటెలిజెన్స్‌ ప్రదర్శించే సామర్థ్యం ఎంత ఉంది? అని లెక్కించేందుకు ఇమిటేషన్ గేమ్ లేదా ట్యూరింగ్ టెస్ట్ డెవలప్‌ చేశారు. 2022 డిసెంబర్‌లో ట్యూరింగ్ టెస్ట్‌లో ఉత్తీర్ణత సాధించిన రెండో చాట్‌బాట్‌గా ChatGPT నిలిచింది. 2022 జూన్‌లో ఉత్తీర్ణత సాధించిన గూగుల్‌కి చెందిన LaMDA మొదటి స్థానంలో ఉంది.

* AI మానవ జీవితాల్లోకి ఎలా ప్రవేశిస్తోంది?

చాలా సంవత్సరాలుగా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ రోజువారీ జీవితంలో భాగమైపోయింది. ఆల్ఫాబెట్ కంపెనీ లామ్‌డా, ఓపెన్‌ఏఐ చాట్‌జీపీటీ టెక్నాలజీ అభివృద్ధిని సూచిస్తుంది. OpenAIకి చెందిన మరొక సిస్టమ్, Dall-E 2 ఇమేజ్‌లను క్రియేట్‌ చేయగలవు. ఆల్ఫాబెట్‌లో ఇదే విధమైన, కొంచెం మెరుగైన ఫలితాలు అందించే టూల్‌ ఇమేజెన్ ఉంది. మెటా (ఫేస్‌బుక్)లో ‘మేక్-ఎ-సీన్’ అనే టూల్‌ ఉంది.

AI ఇప్పటికే చాలా విభాగాల్లో అభివృద్ధి చెందింది. ఫిజికల్‌ సైన్సెస్‌, మ్యాథమెటిక్స్‌ విభాగాల్లో రీసెర్చ్‌ కొనసాగుతోంది. AI 2022 స్టేటస్‌ రిపోర్ట్‌ మేరకు.. న్యూక్లియర్ ఫ్యూజన్‌లో సహాయం చేయడం, 200 మిలియన్ల ప్రొటీన్‌ల నిర్మాణాన్ని అంచనా వేయడం, PET ప్లాస్టిక్ రీసైక్లింగ్ ఎంజైమ్‌ ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్‌, మెటీరియల్ సైన్స్‌లో పురోగతి సాధించడంలో AI సహాయపడింది. ఘన వ్యర్థాలు, న్యాచురల్‌ లాంగ్వేజ్‌ నుంచి కోడ్ రాయడం, అనేక ఇతర ప్రాజెక్ట్‌లలో గణిత సమస్యలను పరిష్కరించడంలో AI కీలకంగా మారింది.

* మేజర్‌ కంపెనీల ప్రాజెక్టులు

OpenAI కోడెక్స్-బేస్ట్‌ GitHub, మైక్రోసాఫ్ట్‌కి చెందిన Copilot, అమెజాన్‌ సొంతమైన CodeWhisperer, గూగుల్‌ నుంచి త్వరలో లాంచ్‌ కానున్న ప్రొడక్ట్‌ సాఫ్ట్‌వేర్‌ రంగంలో పెను మార్పులు తీసుకురానున్నాయి. ఈ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ బేస్డ్‌ సాఫ్ట్‌వేర్‌లు న్యాచురల్‌ లాంగ్వేజ్‌ నుంచి కోడింగ్ చేయగలవు. అదే విధంగా AI-ఫస్ట్ డ్రగ్ డెవలప్‌మెంట్ కంపెనీలు టెక్నాలజీ సాయంతో మందులను తయారు చేసే ప్రయత్నాల్లో ఉన్నాయి.

ఇది కూడా చదవండి :  Bank Scheme: కొత్త స్కీమ్ తెచ్చిన బ్యాంక్.. కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త!

InstaDeep, BioNTech కంపెనీలు కొత్త కోవిడ్ వేరియంట్‌లను గుర్తించేలా ఎర్లీ వార్నింగ్‌ సిస్టమ్‌(EWS)ని అభివృద్ధి చేశాయి. ఈ EWS వేరియంట్‌లను అధికారికంగా ప్రకటించడానికి 1.5 నెలల కంటే ముందే గుర్తించగలదు. టెక్నాలజీ ఉపయోగించి టెక్నాలజీతో పనిచేసే అటానమస్‌ ఎక్స్-రే ఎనలైజర్‌కి రెగ్యులేటరీ అప్రూవల్‌ కూడా లభించింది. డిఫెన్స్‌ రంగంలో కూడా ఆర్టిఫిషియల్‌ వినియోగం ఎక్కువగా ఉంది.

బడా కంపెనీలు చాలా AI ఇనిషియేటివ్స్‌ను లాంచ్‌ చేశాయి. ఆల్ఫాబెట్ కంపెనీ గూగుల్‌ బ్రెయిన్, డీప్‌మైండ్ ప్రోగ్రామ్స్‌ నిర్వహిస్తోంది. మైక్రోసాఫ్ట్ AI రీసెర్చ్‌, OpenAIతో కొలాబొరేషన్‌ ఉంది, మెటా కంపెనీ FAIR(Facebook AI రీసెర్చ్‌) తీసుకొచ్చింది. అమెజాన్‌, యాపిల్‌ రెండూ AI లేదా మెషిన్ లెర్నింగ్ (ML) రీసెర్చ్‌ కార్యక్రమాలను చేపడుతున్నాయి. AIపై పనిచేసిన తొలి కంపెనీలలో IBM ఉంది, Nvidia, సేల్స్‌ఫోర్స్, ఇంటెల్, క్వాల్కమ్‌, ఇతర కంపెనీలు ఆర్టిఫిషియల్‌ రంగంలో పని చేస్తున్నాయి.

* టెక్ కంపెనీలు, స్టాక్‌లపై ChatGPT ప్రభావం

ఆర్థిక వ్యవస్థలోని అన్ని రంగాలను AI ప్రభావితం చేస్తుంది. వాటిలో కీలక మార్పులకు కారణం అయ్యే అవకాశం ఉంది. ప్రపంచం రూపాంతరం చెందబోతోంది. దీనికి సంబంధించిన కంపెనీలు ఆదాయాలు, లాభాలు, నగదు ప్రవాహాల పరంగా దూసుకెళ్తాయి. ఇతర కంపెనీల బిజినెస్‌ పడిపోతుంది. AI- బేస్డ్‌ కంపెనీల పరిశీలించి పెట్టుబడిదారులు తమ పోర్ట్‌ఫోలియోలను సిద్ధం చేసుకోవడం ముఖ్యం. 2030 నాటికి S&P 500 మార్కెట్ క్యాప్‌లో ఎక్కువ భాగం AI-బేస్డ్‌ కంపెనీలు ఉండే అవకాశం ఉంది.

US టెక్ సెక్టార్‌లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి ఉన్న పెట్టుబడిదారులు.. AI లేదా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT), 5G, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్‌చెయిన్, మెటావర్స్ మొదలైన వాటిపై పని చేస్తున్న కంపెనీలను పరిశీలించాలి. యూఎస్‌ స్టాక్‌ మార్కెట్‌లో ఇలాంటి టెక్‌ కంపెనీలు దాదాపు 200-300 లిస్ట్‌ అయి ఉన్నాయి. పోర్టిఫోలియోను 15-25 శాతం కంపెనీల ఆర్థిక బలం, వృద్ధి అవకాశాలు, సైంటిఫిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫ్రేమ్‌వర్క్‌తో సమానమైన ప్రక్రియను ఉపయోగించి వాల్యుయేషన్‌ల ఆధారంగా క్రియేట్‌ చేయాలి. పాజిటివ్‌గా కనిపిస్తున్న రెండు కంపెనీలపై ఇన్వెస్ట్‌ చేసేకంటే AI- బేస్డ్‌ కంపెనీల స్టాక్‌లలో పెట్టుబడి పెట్టడం ఉత్తమం.

First published:

Tags: Artificial intelligence, Investments, Personal Finance

ఉత్తమ కథలు